Monday, February 27, 2012

ఎందుకో ఏమో గారికి విన్నపాలు !!!

ఎందుకో ఏమో గారూ..

విన్నపాలు విన వలెను వింత వింతలు !

బ్లాగ్ లోకపు 'యుట్యూబ్ శివాజీ " గారు విన్నపం విన వలె.

శ్రీ శ్యామలీయం వారు జిలేబీ శతకాన్ని 'బ్లాగీకరణం' కానిస్తున్న సంగతి మీకు తెలిసినదే.

వారు ఇప్పటి దాక రాసిన ఎనభై కందములు నాలుగు టపాలు గా వచ్చినాయి. 

ఐదవ విడత గా ఇప్పటి దాకా పదిహేను కందములు అయ్యాయి. ఇక అతి త్వరలో వారి శతకం పూర్తి కావస్తోంది.

ఈ సందర్భం గా మీతో వినతి ఏమనగా ... మీరు దయ చేసి, మీ 'వీడియో ' ఆడియో ' తెకినీకులు ఉపయోగించి , ఈ శతకాన్ని 'యుట్యూబ్ వీడియో గా మార్చి వారికి బహుకరించ వలె నని చిరు విన్నపం !

ఇప్పటి దాకా వచ్చిన నాలుగు విడతల టపాలని వీలు చేసుకుని మీరు తయారీ గావించ గలరు. రాబోయే ఐదవ విడత తో చేర్చి ఉగాది కి ఈ  'వీడియో రూపక జిలేబీ శతకం' వారికి మీరు చిరు కానుకగా ఇవ్వవలె నని ప్రార్థన!

ఇట్లు
మీ
చీర్స్
జిలేబి.
(రోజూ ఎవరో ఒక్కరికి పని పెట్టకుంటే నీకు పొద్దే గడవదా జిలేబీ?)  

Sunday, February 26, 2012

బుజ్జి పండు తెలుగు చదువు - 13 - భాస్కర విజయం - 1

यहाँ हाट हाट जिलेबी मिलेगी


ఆల్ఫ్ పర్వత శ్రేణులలో హిమవత్పర్వతం లా ధవళ కాంతులతో విరజిల్లుతోన్న యంగ్ ఫ్రౌ పర్వత పరిసర ప్రాంతలో
ఒక ఇండియన్ హోటలు బయట పెద్ద బోర్డు పెట్ట బడి ఉంది.

డిసెంబరు నెల చలి వణికిస్తోంది. చలికాలం కావడం తో ఇండియా నించి ఊడి పడే స్విస్సు యాత్రికులు అస్సలు ఎవ్వరూ లేరు.

కౌంటరు ముందు కూర్చుని చలికి వణుకుతూ శివ శివా అని స్మరణ చేస్తున్న జమ్బూనాధాన్ కృష్ణ స్వామీ   అయ్యరు ట్రింగ్ ట్రింగ్ అంటూ పాత కాలపు ఫోను రింగు అవటం తో ఫోను రిసీవరు తీసి 'హలో' అన్నారు.

ఆ వైపు వున్న ఆసామి 'నేను హంగేరీ నించి మాట్లాడుతున్నా. జిలేబీ గారున్నారండీ ' అన్నాడు వచ్చీ రాని హిందీ అక్సెంటు లో.


"జిలేబీ నీ కోసం ఎవరో ఫోన్ హంగేరి నించి " అని జంబూ వారూ లోపలి కేక పెట్టి మళ్ళీ శివ శివా అంటూ నామ జపం లో పడ్డారు.

అప్పటి దాకా ఆ రోజు వెయ్యాల్సిన జిలేబీలకి పిండి కార్య క్రమం లో వున్న , కస్సు బస్సు మంటున్న జిలేబీ , హమ్మయ్య ఈ పిండి రుబ్బే కార్యక్రమం కట్ట  బెట్టి ఫోన్ లో టైం పాస్స్ చెయ్యొచ్చు అని సంతోష పడి పోయి, "ఇదిగో అయ్యరు వాళ్ - ఈ పిండి కార్యక్రమం చూడండీ " అని వారికి పని పురమాయించి ఫోన్ దగ్గరికి వెళ్ళింది జిలేబీ.

అయ్యరు గారు, శివ శివ అంటూ  "ఈ జిలేబీ తో వచ్చిన చిక్కే ఇది, ఫోన్ వచ్చిమ్దనో, అదనో ఇదనో  ఏదో  ఒక నెపం తో మనకి పని పెట్ట కుండా వుండదు సుమా " అని గొణుక్కుంటూ సణుక్కుంటూ పిండి కార్యక్రమాన్ని చూడడానికి లోనికి వెళ్ళారు.

జిలేబీ ఫోన్ దగ్గరికి వచ్చి తీరిగ్గా ఓ గంట సేపు మాట్లాడింది. ఆవిడ గంట సేపు మాట్లాడిన సమాచారం ఏమిటంటే -

ఈ హంగేరీ ఆసామీ ఆయుర్వేద ఇన్స్టిట్యుట్  నడుపుతున్న హంగేరీ ఆసామి. ఈతను అప్పుడెప్పుడో యంగ్ ఫ్రౌ మౌంటైన్ కి వచ్చిన సమయం లో  ఈ ఇండియన్ హోటలు కి వచ్చినాడు. జిలేబీ తో పరిచయం అప్పుడే. ఈ మధ్య ఆ హంగేరీ ఆసామీ ఆయుర్వేదా రిసెర్చ్ చేస్తూ 'పరహిత వైద్యం ' గురించి చదివాడట చూచాయిగా. అందుకని తన కేమైనా దీని గురించి తెలుసా , ఆ విషయమై ఎవరైనా హంగేరీ వచ్చి లెక్చర్ ఇవ్వగలరా అని కనుక్కోవడానికి ఫోను చేసాడు.

జిలేబీ మరీ ఖుషీ అయి పోయింది. తనకు తెలియని విషయం అని ఏదైనా ఈ లోకం లో ఉందా ? ఆయ్ అని 'ఓ బ్రహ్మాండం గా తెలుసు, ఓ పెద్దాయన పరహిత వైద్యం  గురించి రాసారు. శర్మ గారని. వారిని పిలుద్దాం ' అని హంగేరీ వాడికి , కష్టే ఫలే శర్మ అనబడు మాచన వఝుల వేంకట దీక్షితులు గారైన చిర్రావూరి భాస్కర శర్మ గారికి మధ్య అటు వైపు ఒక ఫోను, ఇటు వైపు ఒక ఫోను మాట్లాడి, మొత్తం మీద శర్మ గారు హంగేరీ వచ్చేటట్టు ఒప్పించి 'హుష్' ఎంత కష్ట పడి పోయాను సుమా అని నీరస పడి పోయి, హైరాన్ పడి, మళ్ళీ ఒక మారు 'అయ్యరువాళ్' ఒక మంచి కాఫీ పట్టుకు రండీ అని జంబూ అయ్యరు గారిని పనికి పురమాయించింది జిలేబీ.

'ఈ జిలేబీ కి అందరికీ పని కట్ట బెట్ట కుంటే పొద్దే గడవదు సుమా ' అని మళ్ళీ గొణుక్కుంటూ అయ్యరు గారు ఫిల్టరు కాఫీ ప్రయత్నం లో పడ్డారీ మారు.


(ఇంకా ఉంది)

Friday, February 24, 2012

'రచన' శాయి గారి కి విన్నపాలు (బాపురే రమణీయం !)

అయ్యా రచన శాయి గారు,

మొదట గా , ముళ్ళపూడి వారికి నమస్సులు. ఆ పై బాపు గారి కి జేజేలు. ఆ పై శ్రీ రామ రాజ్యం తీసి సాధించి శతమానం భవమై భవ్యమైన శ్రీ సాయి బాబా గారికి అభినందనలు.

ఆ పై మీరు శ్రీ రామ రాజ్యం చిత్ర ముళ్ళపూడి వారి కథన  కౌశల్యాన్ని, వారి వర్ధంతి సందర్భం గా , శ్రీ రామరాజ్యం శత 'షాట్' దినోత్శవాలని పురస్కరించుకుని , పుస్తక రూపేణా తీసుకు వస్తున్నారని మా మనసులో మాట సుజాత గారు టపాకట్టి మమ్ముల నందరిని ఆనంద డోలాయమానం లో స్వాప్న జగత్తులో కి తీసుకు పోయారు , ఆ పుస్తకం ఖరీదు గురించిన వివరణ తక్కువగా ఇచ్చి!

ఆ పై మేము ( నేను కూడా ఓ మోస్తరు గెస్సు చేసి) గెస్సు చేసి వంద రూపాయలనించి ఐదు వందల దాకా ఉండ వచ్చని ఊహల కోతలు (కోటలు) కట్టినాము !

ఆ పై తెలియ వచ్చినది ఏమనగా ఆ పుస్తక ధర ఎనిమిది వందల రూపాయల్ పై 'సిల్కు ' అని !

అయ్యా,

బ్లాగ్ లోకం లో ఎ చిత్రం పై కూడా కట్టనన్ని టపాలు శ్రీ రామ రాజ్యం పై కట్టినాము. బాగుంది అని భేషో అని, 'నయన తారా నందం , బాపురే రమణీయం శ్రీ రామ రాజ్యం అని వందల పేజీ ల కొలది రి వ్యూ లు రాసినాము.

చిత్రం చెత్త అని అన్న వాళ్ళ జుట్టు పట్టుకుని కామెంట్లతో కొట్లాడినాము. బాగుంది అన్న వాళ్ళ తో జగడం పెట్టుకుని ఎం బాగు ఎం బాగు అని లెఫ్టు సెంటరు రైటు గా చిత్రం గురించి సమీక్షలు రాసినాము. !

ఇట్లా ఎన్నో విధాలు గా ఈ చిత్రం గురించి బ్లాగ్ చిత్రాలు తీసినాము.

కావున అయ్యా మీరు, దయ తలచి, ఈ బ్లాగ్ లోకం లో ఈ చిత్రం గురించి బ్లాగు  కట్టి టపా లు  పెట్టి  కామెంటు చెండ్ల తో కొట్టిన వాళ్లందరికీ డిస్కౌంటు యాభై శాతం ఇవ్వ వలె నని ఇదే జిలేబీ విన్నపము ! 

(జిలేబీ కీ వంద శాతం డిస్కౌంటు ఇవ్వ వలె - ఎందు కంటే జిలేబీ రెండు మార్లు టపా పెట్టె ! అదిన్నూ చిత్రం చూడ కుండానే !)


విన్నపాలు విన వలెను వింత వింత లు !
ఫాన్ బ్లాగు టపా రాసిన వారికి డిస్కౌంటు ఈయవయ్యా !!!

ముళ్ళ పూడి వారిని పై లోకం అట్టే పెట్టుకుని తమ హాస్య సరదాలని తీర్చేసుకుంటున్న త్రిమూర్తుల్లారా , వెంటనే ముళ్ళ పూడి వారిని భువికి వదలండి !!! 

నయనతారానందం బాపురే రమణీయం శ్రీ రామరాజ్యానికి శత వందనాలతో !

యనతారానందం

భూనభో బాలకృష్ణ నాగేశ్వరుల

తో బాపు రమణీయ

వ్య దృశ్య కావ్యం

వ్య ఇళయ హంగేరీయం, జొన్నవిత్తుల

విరచిత గీతాలాస్యం, సాయి సినీ లోక భవి

ష్యత్తు వెలుగుల లో ప్ర

తిష్టాపితం
రచన శాయి ముళ్ళపూడి పుస్తకం
బాపు రే రమణీయం - శ్రీ రామ రాజ్యం !

చీర్స్
జిలేబి.

Thursday, February 23, 2012

కడలి !

మ్మని కవనం చూ

చక్కటి 'చిత్ర '

లిఖిత టపాలు

'సుభా' స్ తలపుల వాకిలి శభాష్ !


చీర్స్
జిలేబి.

Wednesday, February 22, 2012

తెలుగు పాటలు !

తెలవారేను జిలుగు వె

లుగు పాటల తో

గుభాళించే పాత కొత్త

పాటల మేళవింపు - బ్లాగు బా

విహారీ - ఆగవోయి , తెలుగు పాట

లు బ్లాగు చూడవోయీ

మది పులకించేను నీదేనోయి !


చీర్స్
జిలేబి.

Tuesday, February 21, 2012

శర్మ కాలక్షేపం కబుర్లు


ర వేగ టపా తో జీవిత మ

ర్మ ముల నెల్ల

కాస్త విలక్షణం గా,

తీఫా చమక్కులతో  

క్షేత్రధారి క్షేత్రాన్ని అందరితో

పంచు కుంటూ

డు రమ్యం గా

బుద్ధి నొసంగె చిన్ని చిన్ని కబు

ర్లు పదుగురు మెచ్చిన

బ్లాగు బాగు బాగు



చీర్స్
జిలేబి. 

Saturday, February 18, 2012

జిలేబీ శతకం - 4

జిలేబీ శతకం
శతక కర్త - శ్రీ తాడిగడప శ్యామల రావు గారు
బ్లాగ్ లోకం లో వీరు 'శ్యామలీయ' మై
బుజ్జి పండు తెలుగు చదువు లో దర్శన మిచ్చి న వారు

గమనిక: ఈ రచన సర్వ హక్కులు శ్రీ తాడిగడప శ్యామల రావు గారివి.
జిలేబీ టపా , కామెంటు చెండులు వీటికి ఉత్ప్రేరకాలు మాత్రమే!
ఇవి శ్రీ శ్యామలీయం గారు శ్రీ కష్టే ఫలే శర్మ గారి బ్లాగులోనూ,
మరి ఇతర బ్లాగుల్లోనూ కామెంటు రూపేణా ఇచ్చినవి.

***
పరహిత వైద్యం

కం. తరచుగ బహుదేహంబుల
తిరుగెడునది తానె యనుచు తెలిసి తగుగతిన్
పరిచర్య చేయునదియే
పరహితమన నెగడు చుండు వసుధ జిలేబీ
కం. కాలగతి చెందువిద్యల
కాలము పునరుధ్ధరించగల తరుణములున్
కాలస్వరూపుడగు హరి
లీలలచే నిలను పొటమరించు జిలేబీ

రాబోవు కాలం

కం. మునువచ్చు చెవుల కన్నను
వెనుకనె పొడచుకొని వచ్చి పెరిగెడు కొమ్ముల్
మొనదేరి ధృడత నుండవె
మనుమలకే తెలివి హెచ్చు మహిని జిలేబీ

చేతులు కాలాక

కం. చేతికి సెగ సోకినచో
 మూతికి మహబాగ గోరు ముద్దలు దొరకెన్
 తాతకు నాతికి నిద్దరి
 కీ తీరున సంబరములు హెచ్చె జిలేబీ

కం. జరిగిన జ్వరమంతటి సుఖ
 మరుదని చెప్పుదురు గాదె అటులే ముద్దల్
 సరదాగ నోటికందుట
 మరి యెందరి భాగ్య మన్న మాట జిలేబీ

కం. ఇది చాలా బాగున్నది
 బ్రదుకున నిటుంవంటి తీపి ప్రతివారికి నం
 దదు నిక్కంబుగ భళిరే
 ముదిమికి ముచ్చట్లు లావు పుడమి జిలేబీ

కం. తప్పులు సైరించెడు సతు
 లెప్పుడు పడుచుందు రిడుము లీ విధముగనే
 తప్పున్న దిద్దకుండిన
 తిప్పలు పెట్టుటయె మగల తీరు జిలేబీ

ప్రేమిస్తున్నా

కం. ప్రేముడి యెంతయు గొప్పది
 కామంబును ప్రేమయొకటి గావను నెరుకన్
 సేమంబుగాంచు టొప్పును
 ధీమంతుండుండు దీని తెలిసి జిలేబీ

కం. అన్నన్నా దిన మొక్కటి
 యున్నదనన్ ప్రేమికులకు యుర్విని ఘనమై
 మున్నూరరువది నాలుగు
 చిన్నదనము బొందు నేమి చేతు జిలేబీ

కం. ఆదిన మీదన మని యే
 డాదిని గల దినములన్ని యటునిటు పంచన్
 మీదెరుగు తలపు జేయగ
 నే దినమును మిగుల లేదు నిజము జిలేబీ

సన్యాసి బుట్టలో పడ్డాడు

నచ్చిన సుందరి యెందుకు
వచ్చెడు నొక బుట్టలోన వయ్యారముగా
తెచ్చిన యా బుట్టనె విభు
ముచ్చట చెఱ గొనగ గాక పోదు జిలేబీ

అందాల బుట్ట లోపలి
సుందరవదనారవింద సుదతీమణి చే
యందుకొనిన సన్యాసియె
వందేళ్ళకు బంది యనగ వచ్చు జిలేబీ

సన్నాసిని చేసెడునో
సన్నాసిని చూసి కన్య సరదా పడునో
సన్నాసియగుట తథ్యం
బన్నన్నా పురుషు డాలి బంటు జిలేబీ

నల్లని కురులు 

వెల్లుల్లి తలకు పూసిన
నెల్లరు దూరంబు జరుగ నిక కేశములా
తెల్లనివో నల్లనివో
అల్లరి యిక లేదు గనుక హాయి జిలేబీ


 మధురాధిపతే అఖిలం మధురం 


కం. మధురాధిపతి స్పెషల్గా
మధురం బతివలకు నైన మాసంగతియో
మధురాధిపతి యఖిలజన
మధురాకృతి నేను వినక మాన జిలేబీ.

ఎంతెంత దూరం

కం. కామెంట్లైతే శతకం
 మీ మాటల గారడీలు మెప్పించెను నే
 నేమో శతకానికి ఇం
 కేమాత్రందూరముంటినిపుడు జిలేబీ?


బంగరు మాటల మూట

కం. ఈ రసన యెంత చెడ్డది
 నోరదుపున నున్నవాడు నూటికొకండుం
 ధారుణి నుండునొ యుండడొ
 తీరుగ నటులుంట యోగి తీరు జిలేబీ


కం. మాటాడుట చక్కని కళ
 మాటాడక యుండు నేర్పు మరియుం ఘనమై
 కోటికి నొకనికి గల్గెడు
 ఓటివి తక్కొరులనోళు లుర్వి జిలేబీ



ఇల్లాలి అవధానం

కం. ఇల్లెంత పదిలమగునో
 యెల్లరు నెరుగుదురుగాని యెందరి కెరుకా
 యిల్లాలి చలువ చేతనె
 యిల్లన గల దనుచు వారి కిలను జిలేబీ

కం. పిల్లలు పెద్దసమస్యలు
 కొల్ల నిషేధాక్షరులను కూర్చెదరత్తల్
 చెల్లించుచు నప్రస్తుత
 మెల్లప్పుడు పలుకు భర్త ఇలను జిలేబీ

కం. అవధాని పడెడు కష్టము
 లవి యణగును ఝాములోన నందరు పొగడన్
 భుని నిల్లాండ్రకు నిత్యం
 బవధానమె మెప్పు కాన బడదు జిలేబీ


టపాకీకరణం
జిలేబి.

కొస మెరుపు  
శ్రీ గోలీ వారి జిలేబీయం !

కలడని చెప్పెను పోతన
'కలడు కలండనెడి వాడు' కావ్యము నందున్
కలడని చెప్పెను పో, తన
కళలొలికెడు బ్లాగులోన కాదె జిలేబీ!

Friday, February 17, 2012

Carnatic Music Idol 2012

Carnatic Music Idol 2012 !

ప్రతి సంవత్సరం జయా టీవీ వారు
Carnatic Music Idol
కార్యక్రమాన్ని జరుపుతున్నారు
ఈ మధ్య ఒక మూడు నాలుగు సంవత్సరాలు గా!

నిరుడు సంవత్సరం Carnatic Music Idol USA కూడా దిగ్విజయం గా జరిపారు.

ఇప్పుడు once again Carnatic Music Idol 2012 వస్తోంది.
ఇది తమిళ చేనల్ వారి చలువ .
A fantastic program to watch how children are faring so great in the program !
Enjoy.
One episode below link I have provided. Rest of them you can find in the same group!



cheers
zilebi.





Thursday, February 16, 2012

The three 'I's of Indian Psyche !

We are a country of idealogies. Our thinking is very high.

In action we are idle.

When it comes to leaders, saints and what not even cine stars and 'the English' Goddess or for that matter any thing and any body or any buddy the way we remember them is by making them idols.

We make idols, worship them and perform abhishekams! Thats our 'idol' way of respect.

Examples aplenty we find starting from the times of Rama to Adi Shankara to Shirdi Sai to Santoshi Maa to Khushboo to Kanshi Ram to 'the English' Goddess to ...  I can go on prolong the list to infinite 'idol' recollections ! 

Say cheers to the three 'I's of Indian Psysche - idealogy, 'idle'jee, 'idol'jee !!!

Cheers
Zilebi.

Wednesday, February 15, 2012

మధురాధిపతే అఖిలం మధురం ! (లేడీస్ స్పెషల్ )

మధురాధిపతే అఖిలం మధురం !


Tuesday, February 14, 2012

సన్నాసి బుట్టలో పడ్డాడు (బుట్టో పాఖ్యానం !)

కాలా కాలం గా సన్నాసులు బుట్టలో పడటాన్ని కొనియాడే శుభ దినం సందర్భాన ఇవ్వాళ సన్నాసుల  వారి కథా, బుట్ట బొమ్మ కథా తెలుసు కుందాం !

జిలేబీ పెళ్లి రోజు .

బుట్ట లో జిలేబీ ని పెట్టుకుని  వస్తూంటే , బుట్ట బొమ్మ లాంటి అమ్మాయి నాకు కాబోయే అర్ధాంగీ అని మురిసి పోయిన జంబు నాధన్ కృష్ణ స్వామీ అయ్యరు గారికి అవ్వాళ తెలిసి రాలే, బుట్టలో బొమ్మ పుత్తడి బొమ్మ కాదని, పేరు మాత్రమె జిలేబీ అని, తానె బుట్టలో బోల్తా పడ్డాడనీ నూ.

ఆ పై మూడు రాత్రుళ్ళు (ఈ మూడు రాత్రుళ్ళ ముచ్చట గురించి నేను చెప్పను బాబు మరీ సిగ్గు !) కానించిన తరువాయి శ్రీ అయ్యరు వారు 'జిలేబీ, మాంచి ఫిల్టరు కాఫీ ఒక్కటి పట్టుకు రావోయ్ " అంటే జిలేబీ బిక్క మొగం బెట్టి,
"అయ్యరు గారు,   మీకు వంట బాగా వచ్చనే బామ్మ నాకు చెప్పి నన్ను మిమ్మల్ని కట్టు కొమన్నారు " అని బిక్క మొగం పెడితే, వంశ పారంపర్యం గా వచ్చే అయ్యరు హోటలు వృత్తి ఇంట్లో కూడా వంట గాడేనా, గాదేనా నా గతీ , రాధా, నా జిలేబీ ఇది నీకు తగునా  సుమీ అని మా అయ్యరు వారు ఉసూరు మన్నారు !

ఈ మా పెళ్ళి ఈ సో కాల్డ్ యాదృచ్చికమో, కాక 'తాళీ' బలీయమో జంబూ వారికే తెలియాలి !

ఈ సన్యాసి బుట్టలో పడే కార్యక్రమము నే పెళ్లి దినాన అబ్బాయి వారి 'కాశీ యాత్ర ' గా  పరిగణించడం బట్టి తెలియ వస్తున్నది ఏమనగా, ఈ వాలం టీను దినం మన పూర్వ ప్రాచీన సాంప్రదాయ పద్ధతే అని,  దీనిని కాపీ క్యాటూ చేసి కాపీ లెఫ్టు చేసి  సంతు వాలం టీను దినము గా మార్చి వేసి నారని మనము విశ్వసించ వలె.  

అయ్యలారా, అమ్మలారా , ఇవ్వాళ సంక్తు వాలం  'టీన్' జరుపు కొనుడు అబ్బాయి లారా, అమ్మాయి లారా మీకందరికీ ఇదే శుభ కామనలు !

మీరు జంబూ అయితే, మీకు జిలేబీ ఖచ్చితం గా లభ్యమవు గాక!

తప్పి మీరు జిలేబీ అయితే, తప్పక ఎవడో ఓ సన్యాసి మీ బుట్టలో పడడం ఖాయం!

ఇంతటి తో ఈ సన్యాసి బుట్టలో పడ్డాడు అనబడు బుట్టో పాఖ్యానం పరి సమాప్తము !

ఇది చదివిన వారికి, వినిన వారికి చదివి వినిపించిన వారికందరికీ ఆ పద్మావతీ అలమేలు మంగా సమేత మా ఏడు కొండల పెరుమాళ్ళు(ఈయన రెండు మారులు బుట్టలో పడినట్టు ఉన్నాడు సుమీ !) సకల మంగళములు కలుగ జేయు గాక!

చీర్స్
ఫక్తు, జిలేబీ డే!

Sunday, February 12, 2012

మానస కావేరి

మనస్సు విప్పాలని
ఒకటే పోరు
నా అంతరంగం తో
కుదరటం లేదు


మనసు విప్పాలని
ఒకటే ఆలోచన
ఆలోచన తోడు  రా నంటోంది
ఎద తోడైనా రా అంటే నిశ్శబ్ధం

ఏ ఆలోచనా పూర్తి గా
ఓ కొలిక్కి రాదు తెగిన గాలి పటం లా
మధ్య మధ్య లో  మౌనం
ఈ ఆలోచన లేలా అని

చేతులు ఖాళీ అయినా పర్లేదు
మనసులు ఖాళీ అవకూడదని
అనుకున్నా, మనసులో మనసు
ఎట్లాంటి ఆసరా ఇవ్వడం లేదు

ఆలోచిస్తున్న ఆలోచనలు
లోచనా కమల లోచన లై
మానస కావేరి లా
మౌన సంద్రాన్ని స్పృశిస్తున్నాయి

జిలేబి.

కలడు కలం డనెడి వాడు

ని పించని దేవుడు
వ మాత్రమైన ఊహ కందని వాడు ఆత
డు కను పాప అయి ఈ
ట్టె కి చూపు నిచ్చాడు
లంబోదరుడు
మరుక హృదయ గీతం
నెమలి  వాహన సహోదరుడు ఆత
డి ఆశీస్సులు
వాగ్దేవి అనుగ్రహం ఆత
డు ఇచ్చిన వరం

జిలేబి.

Saturday, February 11, 2012

తాళాలు పెట్టేరు రాధా హరే మేటర్లు పోయేను కృష్ణా హరే !

బ్లాగు బ్లాగు కీ పోయేను రాధా హరే
కూసింత మేటరు కొట్టు కొచ్చు కున్నాను కృష్ణా హరే !


అని ఆడుతూ పాడుతూ మేటర్లు బ్లాగుల నించి కొట్టేసుకుని పత్రికల లో అచ్చేసుకుని హాయి హాయి గా కాలం గడిపేసు కుంటున్న ఓ జిలేబీ కి ఉద్యోగం పోయే రోజులు దాపురిస్తున్నట్టు ఉన్నాయి.

ISA (Internal Sourcing Agent!) ఫర్ MSA (Matter Snuffing Agency) లో పని చేస్తున్న ఓ జిలేబీ కి తెల్లారి తెల్లారి లేస్తూనే బ్లాగు బ్లాగు కీ వెళ్లి మేటరు కొట్టేసుకుని వాటిని సీక్రెట్ గా పత్రికలకి కాణీ కి పరక కి అమ్మేసుకుని అవ్వాల్టి హా 'రమ్ము' హాయి హాయి అని పొంగి  పోతూన్న తరుణం లో ఓ ఇంటి ఇల్లాలు ముచ్చట తో గడ్డు రోజులు వచ్చేయి.

తాళాలు పెట్టండీ అన్న బ్లాగ్ నినాదం తో 'ఉత్తిష్ఠ , జాగృత, ప్రాప్యవరాన్.." అన్నట్టు ఉత్తేజం చెందిన వాళ్ళయ్యారు అప్పటి దాక ఉన్న పంచ దశ లోక వాసులు.

అంతటి తో బ్లాగులకి తాళాలు పడ్డాయి. !

స్నఫ్ఫింగ్ చేస్తూన్న జిలేబి కి కాపీ కి మేటరూ పోయే , కాఫీ కి కూడా కరువోచ్చే !

ఏమి చేతుమురో రాధా హరే,
నీవే దిక్కయ్య కృష్ణా హరే

అని పాడేసుకుంటూ ఇవ్వాల్టి జిలేబీ 'అప్రస్తుత ' ప్రసంగం ఇంతటి తో సమాప్తం !


చీర్స్
జిలేబి. 

Thursday, February 9, 2012

తాళాలు విరగ్గొట్టండి ! (సవాలే సవాల్ !)


మా తాతయ్య కాలం లో (ఇప్పుడు మేమూ ఆ కాలానికే వచ్చేసాం అది వేరే విషయం!) మా ఇంట్లో గూట్లో ఓ పెట్టె ఉండేది. గూట్లో పెట్టేమిటీ అంటారా సవివరం గా చెబ్తాను.

మా నడిమింటి హాల్లో నించి మిద్ద పైకి వెళ్ళడానికి మెట్లు ఉండేవి. వాటి కింద ఓ పాటి గూటి లా ఓ ప్రదేశం ఉండేది. ఆ గూట్లో ఓ పురాతన చెక్క పెట్ట మా తాత గారిది ఉండేది. దాంట్లో వారేమో వారు కొన్న కొత్త కొత్త ఆ కాలపు (అంటే బ్రిటిషు కాలపు అన్న మాట ) గడియారాలు ఎలెక్ట్రిక్ సామాన్లు అట్టి పెట్టె వారు. ఆ పెట్టె కో తాళం కూడా భద్రం గా వేసి పెట్టె వారన్న మాట .

మా ఇంటి కాంతా జనావళికి వాటి మీద ఓ గుర్రు వుండేది. ఆ పెట్టెలో ఉజ్జాయింపుగా ఏమి ఉంటుందో తెలుసు గాని, మా తాతయ్య గారు ఆ పెట్టె ని తెరిచి మాకు చూపించనే చూపించరు. అందువల్ల వచ్చిన గుర్రు అన్న మాట అది.

ఇక తాతయ్య గారైతే అప్పుడప్పుడు మమ్మల్ని బయటకెళ్ళి ఆడుకొండ్రా బడుద్దాయిలూ అని గెంటేసి ఆ పెట్టె ని అప్పుడప్పుడు తెరిచి చూడడమూ, ఆ పై ఆ పెట్టి కి గోళ్ళం పెట్టి తాళం వెయ్యడమూనూ జరుగు తూండేది తప్పించి మేము ఎప్పుడూ ఆ పెట్టె లో ఏముందో (అంటే పూర్తి గా అన్న మాట) చూసిన ది లేదు !

కాక పోతే ఆ పెట్టె ఆయన అంత బద్రం గా తాళం పెట్టడం మాకు  ఉత్సుకతని కలిగించేది. ఆ పెట్టె తాళం ఎలా పగల గొట్టాలబ్బ అని అన్న మాట.

ఇక మా కాలానికి వస్తే మా అబ్బాయి మా మనవడు కంప్యూటరు ఎక్కువ గా ఉపయోగించకుండా ఉండడానికి తాళాలు పెట్టడం మొదలెట్టాడు. మనవడు కూడా తాడి తన్నే వాడి తల తన్నాలన్నట్లు వాళ్ళ నాన్న పెట్టిన తాళాలని విడగొట్టడం అన్న ఉద్యమం మొదలెట్టి అందులో నిష్ణాతుడై ఓ మారు వాళ్ళ నాన్నకే ఎదురు ఫిట్టింగులు ఇచ్చాడు అంటే , తనే ఒక తాళం పెట్టే డన్న మాట.

ఈ విషయం లో వాడి కెందుకో ఈ బామ్మ అంటే మమకారం. తాళం పెట్టినా బామ్మా , నీకు మాత్రం తాళం రహస్యం చెబ్తా నాన్నారికి తెలియనివ్వకు,  నీకు కంప్యూటరు ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు తాళం తీసి  ఉపయోగించుకో. ఆ తరువాత ఆఫ్ చేసెయ్యి. ఈ తాళం చెవి మాత్రం నాన్నారి చెవి కి పోనివ్వకు అని చెప్పేడు.

నాకాశ్చర్యం వేసింది. మా కాలం లో తాత వాళ్ళ తాళం ఎలా విరగ్గోట్టాలా అని మేం ఆలోచించే వాళ్ళం. ఇప్పటి తరం లో నాన్నారి తాళం ఎలా విరగ్గోట్టాలా అని వీళ్ళు షెర్లాక్ హోమ్స్ మొదలెట్టారు సుమా అని.

మొత్తం మీద ఈ కాలపు కుర్ర కుంకాల తో మంచి గా ఉండటం మనకే మేలు అన్న ఓ ఫైనల్ నమ్మకానికి వచ్చేసాను నేనైతే. మనం ఎంత  బుర్ర లేని మట్టి   బుర్రలని వాళ్లకు నమ్మకం వస్తే వాళ్ళు మనకు అన్ని తెకినీకులు సులభం గా అర్థం అయ్యే లా చెప్పేస్తారని నా కనిపించింది.

హన్నా, భావి తరం భాగ్య విధాతల్లారా, ఈ బామ్మ మీద మీరు దయ బెట్టి ఈలాంటి తెకినీకులు నేర్పిస్తూ ఉండండి, రాబోయే కాలం లో (పుట్టీ గిట్టీ పుడితే ) మీ ఋణానుబంధం తప్పక తీర్చేసు కుంటాను. అప్పటికి మీకన్నా నాకే ఎక్కువ తెలిసి ఉంటుంది కదా !

(Hopefully always the future generation is brighter than the past !!)

(future)
జీనియస్
జిలేబి.

జిలేబీ శతకం - 3

జిలేబీ శతకం
శతక కర్త - శ్రీ తాడిగడప శ్యామల రావు గారు
బ్లాగ్ లోకం లో వీరు 'శ్యామలీయ' మై
బుజ్జి పండు తెలుగు చదువు లో దర్శన మిచ్చి న వారు

గమనిక: ఈ రచన సర్వ హక్కులు శ్రీ తాడిగడప శ్యామల రావు గారివి.
జిలేబీ టపా , కామెంటు చెండులు వీటికి ఉత్ప్రేరకాలు మాత్రమే!
ఇవి శ్రీ శ్యామలీయం గారు శ్రీ కష్టే ఫలే శర్మ గారి బ్లాగులోనూ,
మరి ఇతర బ్లాగుల్లోనూ కామెంటు రూపేణా ఇచ్చినవి.

***

కామెంటు ఉత్ప్రేరకం

కం. రమ్మా చక్కని కామెం
ట్లిమ్మా నీ రాక లేక లేఖిని ఆగే
నమ్మా జిలిబిలి పలికుల
కొమ్మా కందాలనందు కొనుమ జిలేబీ

ఉపకారం

కం. ఉపకారవ్యసనులతో
నెపమిడి పదిపనులు కొనగ నేర్చెడు వారే
ఉపకారమడుగ బోయిన
నపవాదులు వేయు వార లవని జిలేబీ

కం. అపకారుల కుపకారము
విపరీతఫలంబునిచ్చు విమతుల నటులే
యుపకార బుధ్ధి విడచుట
నెపమై దాస్యమున కూలె నేల జిలేబీ

కం. మొగమోటమి గలవారిని
పొగడిన పని జరుగు ననుచు పోగగు వారల్
మొగ మైన జూప రావల
తగు జాగ్రత వలన చిక్కు తప్పు జిలేబీ

ఊరికి బాసట

కం. ఊరికి బాసట యగుచో
నూరక నోరార పొగడు నోళ్ళకు కొదవే
వారల యందే యొక్కరు
రారుసుమా మనకు నక్కరైన జిలేబీ

కం. ఆ యింటి మామిడాకులు
వే యిండ్లకు తోరణాలు మరి యేటేటా
కాయలు పచ్చళ్ళకు దయ
చేయించు పరోపకార జీవి జిలేబీ


ఇరుకు జీవితాలు

కం. ఇళ్ళిరుకులు గుళ్ళిరుకులు
పల్లెలు పోటెత్తి రాగ పట్నా లిరుకుల్
బళ్ళిరుకు మనసులిరుకులు
కల్లలతో బ్రతుకులిరుకు కలిని జిలేబీ


'వి' గ్రహాలు

కం. పడి పోయిన పడ నుండిన
పడి లేచిన విగ్రహాల బాధలు చూస్తూ
మిడికే నేతల బొమ్మలు
పొడమును పడిపోవు నటులె పుడమి జిలేబీ

ప్రవీణు శర్మ

కం. నేరక ప్రవీణు శర్మకు
మీరు జవాబిచ్చి గాని వివరించారో
వారింక మిమ్ము వదలరు
పోరాడే యోపికుంటె పొండు జిలేబీ

ఇన్నయ్య ఎవరు ?

కం. ఇన్నయ్య హేతువాదుల
కన్నయ్యే హైందవంబు నంతంచెయ్యా

లన్నదె ఆయన ధ్యేయం
బెన్నటికిని మారజాల డితడు జిలేబీ
   

కం. పళ్ళున్న చెట్లమీదే
రాళ్ళుగదా హేతువాద రాకాసి జనం
నోళ్ళన్నీ వేదనిందకు
పళ్లికిలిస్తాయి బాధ పడకు జిలేబీ

మ్యాచు ఫిక్సింగు !

కం. ఓడుతు పోతున్నారని
 వాడల వాడలను తిట్ల వర్షాలాయే
 నేడొకటి గెలవగానే
 తేడానూ ఒప్పుకోరు తిరిగి జిలేబీ

కాపీ 'రైటు' జన్మ హక్కు

కం. కాపీ కొట్టే రైటుకె
కాపీరై టనెడి పేరు ఖాయం ఐతే
కాపీ పిల్లుల తప్పా
పాపం మన పాలు వారి పాలు జిలేబీ

సిగ్గే సింగారం

కం. సిగ్గేమిటి బేహారికి
సిగ్గేమిటి హంతకునకు సినిమా నటికిన్
సిగ్గేమిటి మరి నేతకు
సిగ్గేమిటి సిగ్గు పడును సిగ్గు జిలేబీ

నడక-నడత

కం. నడకలు కుదురుగ నుండిన
పడకుండగ నరుడు బ్రతుకుబాటను నడచున్
గడబిడ పడి వడిపెంచిన
పడుటయు చెడుటయును గల్గు వసుధ జిలేబీ

కం. నడకలు నేర్పెడు పెద్దలు
నడతలు నేర్పించ నెదురు నడచును మరియున్
కొడుకులు కూతుండ్రకు తా
నడతలు నేర్పించ గోరు నరుడు జిలేబీ

 గారెల పాకం

కం. పాకం గారెలు చేస్తే
నాకం కనిపించవచ్చు నాకూ మీకూ
పాకం చేస్తే గారెలు
ఆకలి చచ్చేది ఖాయమగును జిలేబీ

పంచ దశ లోకం

కం. పదునైదవ లోకం బె
య్యది మరి యటనుండు వారి యాకృతి గుణసం
పద లెట్టులుండు నోహో
అది అంతర్జాలలోక మగున జిలేబీ

'గ' మకం !

కం. నిందార్ధంబున నాంధ్రము
నందున నామ్రేడితమును నాపైన గిగీల్
చిందులు వేయును మరి యా
నందార్ధము సూత్ర మేది నడచు జిలేబీ

పాత పచ్చడి

శొ, పాతది యగుచో నేమగు
పాతది యగు చింత కాయ పథ్యం బనగా
తాతలనుండి ప్రసిధ్ధం
బీతరమున మెచ్చకున్న నేమి జిలేబీ

***

టపాకీకరణం
జిలేబి

Wednesday, February 8, 2012

చింతన చైతన్యం సృష్టి

చింతన చైతన్యం సృష్టి

ఒక ఆలోచన స్రవంతి ఐ మేధస్సుని మదించి
చైతన్యాన్ని కలుగ జేస్తే
ఆ చైతన్యం ఉత్తేజాన్ని పుంజుకుని కార్య సాధనలో
సఫలీకృతమై తే -
అందులోనించి ఉద్భవం - సృష్టి

ఆ సృష్టి కాలం పరిమితం - దాని వైశాల్యం పరిమితం
కాని దాన్ని సృష్టించిన చైతన్యం, ఆలోచన అపరిమితం

సృష్టి కి మూలకారణం చైతన్యం, ఆ చైతన్యానికి మూల కారణం ఆలోచన ఐతే
మరి ఆ ఆలోచనకి మూల కారణం ఏమిటి ?


జిలేబి.

Tuesday, February 7, 2012

మియాపూర్ లొ జిలేబి - ప్రస్తుత ప్రసంగం !

12-02-2012 (ఆదివారం) నాడు
 మియాపూర్

జయప్రకాశ్ నారాయణ్ నగర్

హైదరాబాద్

శ్రీ వేంకటేశ్వరస్వామివారి కోవెల ప్రాంగణంలో

మధ్యాహ్మం 3 గంటల నుండి


శ్రీ కట్టమూరి చంద్రశేఖర అవధాని గారి


అష్టావధానం


జిలేబి  (ప్రస్తుత ప్రసంగం!)

Monday, February 6, 2012

ఇడ్లీ గిడ్లీ - సాంబార్ గీంబార్ అనబడే చిత్తూరోళ్ళ కథ

జంబూద్వీపే భరతః వర్షే భరతః ఖండే మేరోహో పర్వతే దక్షిణే పార్స్వే ఆంధ్ర రాజ్యే రాయలసీమే చిత్తూరు జిల్లాయాం ....

హమ్మయ్యా! ప్రవర అయ్యింది కాబట్టి ఇంక టపా రాసుకోవచ్చన్న మాట !

అయినా చిత్తూరు జిల్లా దాకా వచ్చేసాక , చిత్తూరు మాండలీకం గురించి రాయక పొతే ఎలాగంటారూ?


ఈ చిత్తూరు గ్రామాలలో మా ఫ్యామిలీ  ఉన్నప్పుడు చిత్తూరు కి సంబంధించిన స్పెషల్ భాష ని గమనించడం జరిగింది. అదే టపా , గిపా మేటరూ, గీటరూ! 

అంటే 'గ ' భాష అన్నమాట.

హోటెల్ కి వెళితే ఏదో ఇడ్లి ఉందా అని అడగకుండా మేము అడిగే తీరు ఎలా అంటారా? -

"ఏమిబా ఇడ్లీ గిడ్లీ ఏదైన ఉందా? ఉంటె గింటే ఓ రెండు ప్లేట్లు పట్టుకురా "

ఆట్లాగే "సాంబార్ గీంబార్" అన్న పదం చాలా తరచుగా వినొచ్చు.

నాకు తెలిసనంత వరకు రాయల సీమలో చిత్తూరు లో ని  ఈ "గ " భాష చిత్తూరు పరిసర ప్రాంతాలకే పరిమితమనుకుంటా.


ఈ "గ" భాష ఎంత పాపులర్ అంటే ఆస్సాము దేశంలొ పని చెసేటప్పుడు ఓ అస్సామీ ఆసామీ - తను పూర్వ కాలం లో  చిత్తూరు లొ పని చేసే డట , 

నాకున్న చిత్తూరు పరిచయాన్ని తెలుసుకొని "ఏమండీ మేడం, గీడం, జిలేబీ, గిలేబీ ,ఇడ్లి గిడ్లీ ఏమన్నా టిఫనూ, గిఫనూ చెయ్యడం మీకు వచ్చా గిచ్చా " అన్నాడు!

వార్నీ ఈ "గ" భాష ఇంత పాపులర్ అన్న మాట అని అప్పుడే తెలిసింది.

సో, ఈ పూటకి గీటకి ఈ టపా గిపా ఇంతే బా !


ఛీర్స్
జిలేబి.

(మా ఎం హెచ్ ఎస్ గ్రీమ్స్పేట్  రామకృష్ణ గారు చిత్తూరు వైద్యుల టపా రాసి చిత్తూరి జ్ఞాపకాల పుట్టని కదిలించారు )

Sunday, February 5, 2012

బుజ్జి పండు తెలుగు చదువు - 12 - భామా విజయం - 7

మంచు పువ్వులు ముత్యాల్లా రాలుతూ మ్యూనిక్ మహా నగరం వింత శోభలతో క్రిస్మస్సు ఈవ్ కి ముస్తాబవు తోంది.

మ్యూనిక్ మహా నగరం సాయం కాలం.

మారియన్ ప్లాట్జ్ దగ్గర ముగ్గురు ఇండియన్లు నిలబడి  ఉన్నారు.  స్మార్ట్ గా వారితో బాటే బుజ్జి పండు కూడా  ఉన్నాడు.

"అమ్మాయ్ మధురా, మీ మహా నగర శోభ మరీ తేజోమయం గా ఉంది " అన్నారు బులుసు వారు. తలపై పడుతున్న మంచు పువ్వులని మెల  మెల్లన తోసేసు కుంటూ.

మారియన్ ప్లాట్జ్ మునిచ్ మహా నగరానికి నడి బొడ్డు.  సమయం ఆరు కావస్తోంది.

అంతకు ముందే వాళ్ళు ఆ మధ్యాహ్నం  దరి దాపుల్లోనే ఉన్న గ్లోకేన్స్పీల్ గంట ల కార్యక్రం చూసేరు.

దాన్తోటే కడు రమ్యం గా ముప్పై రెండు బొమ్మలు,  ఆసాంతం అవి మానవుల అంత పొడువాటి ఉన్నాయి, అవి బవేరియా లోని ముఖ్య ఘట్టాలని తెలియ జేసేయి. ఒక హరిత వర్ణ పక్షి  ఈవెంటు ముగియ గానే మూడు మార్లు  కుకూ కుకూ కుకూ అంటూ ముద్దు గా చెప్పింది షో అయి పోయినట్టు. 

ఆ పై లంచ్, ఆ పై మళ్ళీ సిటీ దర్శనం అంతా అయ్యేక క్రిస్మస్సు మార్కెట్ లో  గ్లూ వెయిన్ కోసం ఇప్పుడు మారియన్ ప్లాట్జ్ వద్ద వాళ్ళు నిలబడి ఉన్నారు ఆ నగర శోభలని ఆనందిస్తూ.

ఎక్కడ చూసినా క్రిస్మస్ కళ కనిపిస్తూ ఉంది . బాగా అలంకరించిన క్రిస్మస్ చెట్లు, క్రిస్మస్ తాత బొమ్మలు, ఈ సమయంలోనే ప్రత్యేకంగా వచ్చే ఎన్నో రకాల చాక్లెట్లు, బిస్కెట్లు.. ఇంకా ఎన్నెన్నో... విశేషాలతో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తోంది.

ఈ క్రిస్మస్ మార్కెట్లో.. చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి.  

చిన్ని చిన్ని కొట్లలో బొమ్మలు, ఊలుతో తయారు చేసిన దుస్తులు, చాక్లెట్ పూత పూసిన పండ్లు, ఇంకా మామూలు శాండ్ విచ్ లాంటి తిండి పదార్థాలు అమ్ముతూ ఉన్నారు.  మన వూరి తిరనాళ్ళ సంత లా ఉంది మార్కెట్టు.

అన్నిటికంటే ప్రత్యేకమైన ఐటెం .. ఇప్పుడు మన కథ లోని పాత్రలు  ప్రత్యేకంగా వెళ్ళేది దేనికోసం అంటే.. అదే Glühwein (గ్లూ వైన్).

 బాగా మంచు పడుతోంది. వాతావరణం చాలా చలిగా ఉంది.  

"ఈ సమయంలో  వేడి వేడిగా Glühwein తాగితే దాని మజా వేరు" చెప్పారు మధుర. "అసలు వైన్ వేడి వేడిగా ఉండడం ఏంటి అనుకుంటున్నారా.. అదే మరి దీని ప్రత్యేకత.  ఈ వైన్ ని ఈ పండగప్పుడు మాత్రమే తాగుతారు".

దగ్గరలోనే ఉన్న ఒక చిన్న స్టాలు దగ్గిరికి నడిచారు వాళ్ళు.

 ఈ వైన్ ని అమ్మే స్టాల్లో అప్పటికప్పుడు తయారు వైన్ చేసి కప్పుల్లో పోసి ఇస్తూ ఉన్నాడు షాపతను.

ఒక చిన్న సైజు గంగాళం లాంటి దాంట్లో రెడ్ వైన్ పోసి సన్నని మంట మీద వేడి చేసి,  కాస్త వేడి అయ్యాక అందులో చక్కరతో పాటుమసాలా దినుసులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా మనం బిర్యానిలో వేసే జాజి పువ్వు, లాంటివి  వేసి ఇంకాసేపు  మరిగిస్తూ ఉంటె అవి ఓ లాంటి మత్తు వాసన లని వెదజల్లుతూ సుమధురం గా మంచు లో తేలి పోతోన్నాయి.

అలాగే నారింజ పండు, నిమ్మ కాయలని తొక్కతో పాటే ముక్కలుగా కోసి అవి కూడా . కొంచెం tangy flavor రావడానికన్నట్టు వేశాడా షాపతడు.

 బాగా వేడి చేసాక వేడి వేడి పొగలు కక్కుతున్న Glühwein ని కప్పులో  పోసి బులుసు వారికి అందించాడు ఆ షాపతను.

"ఇక్కడి ఈ షాపు బయట ఈ గ్లూ వైన్ తాగుతూంటే, మా ఏలూరు లో టీ కొట్లో నిలబడి చాయ్ తాగుతున్నట్టు ఉందమ్మాయ్, మధురా " చెప్పారు బులుసు వారు ఆ వేడి వేడి వైన్ కప్పుని చేతులతో కప్పు కుని దాని వేడిని ఫీలవుతూ, మరో చేత్తో పైపు కొనసాగిస్తూ.

"బుజ్జి పండూ నీకోసం నాకోసం, రాజీ వారి కోసం కిండర్ పంచ్ ఇదిగో " చెప్పారు మధుర.  "Kinder-punsch అచ్చం Glühwein లాగానే చేస్తారు.. కాకపోతే ఇందులో వైన్  కి  బదులుగా ఆపిల్ రసం కానీ, ద్రాక్ష రసం గానీ వేసి చేస్తారు. kinder-punsch అంటే Child-punch అన్నమాట!  అలా అని పిల్లల కోసం మాత్రమే అనుకునేరు రాజీ గారు, .. మనం కూడా తాగొచ్చు అన్నమాట. కాకపోతే.. పిల్లలు కూడా తాగగలిగింది అన్నమాట "

"రుచి మరీ గొప్పగా ఉంది మధురా " .. ఆ చలిలో.. వేడి వేడిగా.. తీయ తీయగా.. స్పైసీ గా వెరయిటీ గా ఉన్న ఆ కిండర్ పంచ్ ని సిప్ చేస్తూ చెప్పారు రాజీ గారు "మధురా, మా హైదరాబాదీ ఈరానీ చాయ్ కొట్టు వాడు ఇక్కడ ఒక షాప్ పెడితే ఇక వాడు మల్టీ మిలినర్ అయి పోతాడు సుమా " అన్నారు రాజీ వారు.

"Totaal lecker frau madhuraa" చెప్పాడు బుజ్జి పండు  కిండర్ పంచ్ ఆస్వాదిస్తూ.

"మన అందరి కోసం ఇక్కడ బాదం పప్పులకి చక్కర పూత వేసి.. వేయించి నవి కూడా కొన్నా నండీ" చెప్పారు మధుర.

"అమ్మాయ్ మధురా, నీ అతిధి సత్కారం మంచి పువ్వుల మధురం మధురాతి మధురం " బులుసు వారు గ్లూ వైన్ టెష్టు చేస్తూ  మెచ్చు కున్నారు.

ఆ  వాల్టి ఆ మధురమైన సాయంత్రాన్ని మరీ శోభాయమానం గావిస్తూ మంచు పువ్వులు మధుర బ్లాగ్ టెంప్లేట్  పువ్వుల్లా ముసి ముసి నవ్వులతో, మ్యూనిక్ నగరాన్ని ముద్దెట్టుకుని తమ సంతోషాన్ని తెలియ జేసేయి.

*****

మరు సటి రోజే బలుసు వారి పారీసు పయాణం, రాజీ వారి హైదరాబాదు పయనం, బుజ్జి పండు అమెరికా ఫ్లైటు.

మధుర బేలగా ముఖం పెట్టి ఉంది.

"ఫ్రౌ మధురా, ఏమిటి మీరు మరీ మౌనం గా ఉన్నారు" అడిగాడు బుజ్జి పండు.

"అవును బుజ్జీ. బులుసు వారు పారీసు వెళ్లి పోతున్నారు. రాజీ వారు హైదరాబాదు వెళ్లి పోతున్నారు. నువ్వేమో మరి అమెరికా వెళ్లి పోతున్నావు. అందుకే " చెప్పింది మధుర.

"అదేమిటమ్మాయ్, అలా బేల పడి పోతావు. శ్రీ కృష్ణుల వారు నీ చెంతనే వుండగా అంత బేల తనమెందుకు ?" రాజి గారు బుజ్జగించారు మధురని.

"అవును రాజి గారు మీరు చెప్పింది నిజం" మధుర ఆనంద భాష్ఫాలని తుడుచు కుంటూ చెప్పింది.

శ్రీ కృష్ణుల వారు మళ్ళీ ప్రత్యక్ష మైయ్యారు.

అక్కడ ఉన్న అందరూ మాయమై ఫ్రాన్క్ఫర్టు మెయిన్ స్టేషన్ లో ప్రత్యక్ష మైయ్యారు.

బులుసు వారి టీ జీ వీ పారీసు ట్రైను కూత పెట్ట కుండానే నిశ్శబ్దం గా ఫ్రాన్కుఫర్టు హాఫ్భాన్ హాఫ్ స్టేషన్ వదిలి పెట్టింది. రాజీ, మధురా, బుజ్జి పండు చెయ్యి ఊపారు బాయ్ బాయ్ అంటూ బులుసు వారికి.

బులుసు వారి కళ్ళు చెమేర్చేయి..

ఏమిటీ అనుబంధాలు బ్లాగ్ బంధాలు? . ఎక్కడి వాళ్ళం ఎక్కడి వాళ్ళం అంతా ఈ పంచ దశ లోకం  లో మిత్రులమై బ్లాగ్ బంధువుల మై ఈ మైత్రీ బంధాలు గల వారం అనుకున్నారు వారు.

శ్రీ కృష్ణుల వారు చక్రం తిప్పారు. రాజీ వారు జర్మనీ నగరం నించి మాయమై హైదరాబాదు లో వున్నారు !

"చ్యూస్, బిస్ స్పాటర్ " మధుర బుజ్జి పండు కి బాయ్ బాయ్ చెప్పింది.


(బుజ్జి పండు తెలుగు చదువు - భామా విజయం ఇంతటి తో సమాప్తం )


*****


బుజ్జి పండు ఫ్రాన్కుఫర్టు ఏర్పోర్టు లో ట్రాన్సిట్ ఏరియా లో ప్రత్యక్షమై ,  అమెరికా ఫ్లైటు లో నింపాదిగా కాలు పెట్టాడు.

తన సీటు కి వెళ్లి కూర్చుంటూ తల తిప్పి చూసాడు పక్క వున్న దెవరా అని.

"ఆయుష్మాన్ భవ బుజ్జి పండూ, నన్ను చిర్రావూరి భాస్కర శర్మ అంటారు " చెప్పారు పక్క సీటు పెద్దాయన.

"నమస్కారం తాతయ్య గారు !!! " బుజ్జి పండు ఆశ్చర్య పోతూ "మాచనవఝుల వేంకట దీక్షితులు గారూ... మీరేనా. మీరేలా ఇక్కడ ప్రత్యక్షం ?" అడిగాడు బుజ్జి పండు!

"అంతా  విష్ణు మాయ బుజ్జి పండూ " చెప్పారు కష్టే ఫలే శర్మ గారు.

(ఇంకా ఉంది)

Saturday, February 4, 2012

కాపీ క్యాటులు అనబడు కోతులు !

వామ్మో వామ్మో ఎంత కాపీ ఎంత కాపీ ! 

కాపీ క్యాటులు వారి కవాతులు.

అదేమీ చోద్యమో గాని, చౌర్యమో గాని

మక్కీకి మక్కీ మన టపాలని బ్లాగులని దిన పత్రిక వాళ్ళూ, వారపత్రిక వాళ్ళూ కాఫీ లాగిస్తూ కాపీలు కొట్టేస్తూ కవాతులు చేస్తున్నారట !

ఈ విషయాలు తెలీకుండానే నేను టపాలు గట్రా ఇన్ని రాసేసానే మరి.

నా టపాలన్నీ ఎక్కడెక్కడ తేలు తున్నాయో ! ఎవరైనా కాస్త తెలిస్తే  చెబ్దురూ !

ఈ గుళ్ళకి వెళ్లి నప్పుడు మనకు కలిగే నిత్యానుభవం ఇక్కడ గుర్తు తెచ్చు కోవాలి.

మనం భక్తీ గా స్వామీ వారీ ప్రసాదం అని ఎ అరటి పండో, లేకుంటే మరోదే టో చేతిలో పట్టు కుని కొంత సావకాశం గా ఆరగిద్దామని ఉంటాం, అప్పుడే, మన కోతీ వారు వచ్చి చలాగ్గా మన చేతిలోని పండు ని లాగేసు కుని చక్కా పోతారు !

ఇక మనం ఎం చేస్తాం ! స్వామీ వారు మనకు ఇంతే అనుగ్రహించారు అనుకోవాల్సిందే !

అట్లాగే కదా మన బ్లాగు వాళ్ళ గతి కూడా అయి పోయింది. !

మనం ఎ అర్ధ రాత్రో తెల్లారి జామో ఓపిగ్గా కూర్చొని, ఎ లేఖిని తొ టో కనా కష్టాలు పడి టైపాటు చేసి వామ్మా ఒక్క టపా రాసేను అని సంతోష పడి పొతే , ఈ పత్రికల వాళ్ళు వచ్చి దాన్ని పట్టేసుకుని, కొట్టేసుకుని వాళ్ళ పేపర్లో వేసేసు కుని (అంతా 'ఖూనీ') మనకు తెలీనివ్వ కుండా గప్పు చిప్పుగా కాపీ కొట్టేసుకుని ....

కాబట్టి మనం ఏమి చేయ్యవలె. ? అరవం లో ఒక సామెత ఉంది. ఈ అడిచ్చా కాపీ అని. అంటే ఎదుటి వాడు రాసేటప్పుడు ఒక ఈ గ వచ్చి వాలితే దానినీ కొట్టి రాస్తే, మనమూ ఒక ఈగని కొట్టి రాస్తామన్న మాట. అట్లాగా, మనం రాసేటపుడు సీక్రెట్ గా ఓ ఈగని కొట్టి రాసామంటే వాళ్ళూ కూడా ఒక ఈగని కొట్టి రాసి , మనకు దొరికి పోతారు సుమా !

 వావ్ నాకూ మాంచి ఐడియా వచ్చేసిందోచ్ !

Friday, February 3, 2012

జిలేబి శతకం - 2

జిలేబీ శతకం
శతక కర్త - శ్రీ తాడిగడప శ్యామల రావు గారు

 
బ్లాగ్ లోకం లో వీరు 'శ్యామలీయ' మై
బుజ్జి పండు తెలుగు చదువు లో దర్శన మిచ్చి న వారు

 
గమనిక: ఈ రచన సర్వ హక్కులు శ్రీ తాడిగడప శ్యామల రావు గారివి.
జిలేబీ టపా , కామెంటు చెండులు వీటికి ఉత్ప్రేరకాలు మాత్రమే!

 
***


చరాచరములు

 
కం. చరమచరంబుల బేధము
చరమచరంబులకు మధ్య సామ్యంబును ఆ
చరమున కచరంబునకును
నెరవగు తత్వమును గూర్చి నేర్పు జిలేబీ

కం. వినుడని ఘన తత్వంబును
కనుడని సూక్ష్మంబు తెలిసి గాంధీ రీతిన్
మనుడని కర్మిష్ఠులరై
జనులకు నెలుగెత్తి చాట జాలు జిలేబీ

కం. నరులార చరాచరముల
చరాచరేతరపరమవిషయతత్వములన్
పరుగాపి పట్టుకొమ్మని
మరిమరి బోధించు చుండె మనకు జిలేబీ

 
హిందీ

 
కం. హిందీలో రాస్తారా
ఎందుకునూ పనికిరాని హిందీ నాదే
అందం చందం తెలియక
కందానికి పెద్ద శిక్ష కలిగె జిలేబీ


చీనా బంగారం

కం. బంగారం ఓ చైనా
బంగారం యెప్పు డూడి పడతా వంటూ
బెంగపడి వేడు తున్నా
చెంగున రాదాయె పసిడి చెలువ జిలేబీ



చిలకలపూడి బంగారం

కం. వెల తక్కువ బంగారం
చిలకలపూ డనెడి యూర చిక్కేనటగా
వలసినచో ఆత్రేయను
పిలచిన ధగధగలు వెల్లి విరియు జిలేబీ


స్వర్ణ వైరాగ్యం


కం. ఔరా బంగారంపై
వైరాగ్యం తెచ్చుకున్న వచ్చేసేనా
భారత నారికి పసిడికి
తీరని యనుబంధమెంత తీపి జిలేబీ

కం. కొనగలిగి నపుడు పసిడిని
కొనవచ్చును కోర్కె తీర కొనలేకున్నన్
తన కంత మోజు లేదని
యనుటే సరియైన మాట యగును జిలేబీ


అందం ఆనందమయా

కం. తానెవ్వరు తనకెవ్వరు
 మానిత స్నేహములు బంధుమరియాదల తో
 ఆనందమేల తనకగు
 ధ్యానంబున వీని తెలియ దగును జిలేబీ

కం. తాను వినిశ్చయముగ పూ
 ర్ణానందమయుండు తనకు నందరు నట్లే
 కాని యవిద్య కొడంబడి
 జ్ఞానవిహీనుడుగ నుండు జనుడు జిలేబీ



పరిచయ బాంధవ్యం


కం. నరులకు సంసర్గముచే
 పరమ సుఖ బ్రాంతి కలిగి బంధములందే
 నిరయంబగు సామాన్యపు
 పరిచయబాంధవ్యసమితి వలన జిలేబీ

కం. గాలిని యూరక తిరిగెడు
 ధూళికణంబులను బోలు దోషాస్పదముల్
 నేలను పెక్కురి బ్రతుకులు
 కాలంబున వారి జాడ కరగు జిలేబీ

కం. ఉత్తములగు కొందరు తమ
 చిత్తంబుల నధిగమించి స్థిరులై సత్తున్
 చిత్తునెరుంగుచు పొందెద
 రిత్తనువుల గడచు జ్ఞానమెల్ల జిలేబీ

కం. అతికొద్ది సంఖ్య నుండెద
 రతులిత కరుణాప్రపూర్ణులగువారలు స
 మ్మతి నితరులకును తగు స
 ద్గతిమార్గము జూపునట్టి ఘనులు జిలేబీ

కం. తగువారు గురువులనగా
 జగమున తఛ్ఛిష్య గణము సత్పురుషులుగా
 నగుటేమి వింత విషయము
 భగవంతుడు వారి నిష్ట పడును జిలేబీ

విన్నపాలు వినవలె

కం. అందుకు అభ్యంతరమా
 అందుకొనుడి శర్మగారు హాయిని గొలిపే
 కందాల విందు రోజూ
 అందాల టపాలు వేసి అప్పటికపుడే


లవ్ దై నైబర్ ...

కం. పక్కింటి వాళ్ళ నెరగం
 ఎక్కడనో ఉన్న వాళ్ళు నెట్-ప్రియ మిత్రుల్
 పక్కదిగిన యిల్లు మరల
 పక్కెక్కేవేళ కంట బడును జిలేబీ


జలపుష్పం

కం.నీ వలెనే జలపుష్పపు
ఠీవిని దర్శించి నట్టి డెందం బరుదే
పూవులలో నది మేలన
కావలసిన యెరుక నీకు కలిగె జిలేబీ


టపాకీకరణం
జిలేబి.

Thursday, February 2, 2012

జల పుష్పం

నిప్పు వేడి
గాలి వేగం

సూరీడి తాపం
చంద్రిమ చల్లదనం
తారల చమక్కు

మేఘ గర్జన
ఋతువుల రాగం

అన్నీ నేనే అన్నది జల పుష్పం

ప్రాణస్యప్రాణం అంతర్పుష్పం
అదే మంత్ర పుష్పం !

(మంత్ర పుష్పం ఆధారం)


జిలేబి.

Wednesday, February 1, 2012

ఒన్స్ అగైన్ బావా మరదలు !

ఓ సంవత్సరం మునుపు ఈ బావా మరదల గురించి రాసాను.

అంటే ఇక్కడ బావ బాంబే స్టాకు మార్కెట్టు.

మరదలు పిల్ల  బంగారం !

మా తల్లే మా తల్లే !

మళ్ళీ కథ మొదటి కొచ్చింది.

ఈ మారు బావా మరదలు కథలో  బావ ధబాల్మనీ, ఫేడేల్మనీ అదేదో అంతర్జాతీయ 'క్యూస్' సరిగ్గా లేవంట అందుకని ముఖం చాటేస్తున్నాడు ఒక రోజు, మరో రోజు ఆహా ఆసియా కి ఉందిలే మంచీ కాలం ముందూ ముందున అన్నట్లు ఓహో అని ఆకసానికి ఎగురు తున్నాడు.

మరదలు మాత్రం తక్కువ నా !

ముద్దు కే ముద్దొచ్చే బంగారం, ముద్ద బంగారం మీద 'భరోసా ' పెరిగిందట జన ప్రియులకు !  మరదలు పిల్ల మరీ ప్రియం అయిపొయింది !!

కాబట్టి మరదలు పిల్ల ముద్దార ముస్తాబయ్యింది. అసలు మనం మరదలు పిల్ల 'టెక్కు' కి సరి తూగ లేం అన్నంత గా , నన్ను తాక మాకు అన్నంత గా సుతారమై పోయింది.

మళ్ళీ జై జవాన్ జై కిసాన్ ఉద్యమం లా - బాంబే బావ , బంగారం మరదలు కలిసి కట్టు గా ఇలా పోతూంటే జిలేబీ లాంటి సాదా సీదా జనాల గతి ఎం గానూ ! మా బంగారం మోజు ఎలా తీరెను !

చీనా బంగారం ఎప్పుడు వచ్చునో !!

చీర్స్
జిలేబి.