Wednesday, January 30, 2013

'బ్లాగ్ రత్న' ఫార్ జిలేబి!


రాబోయే కాలం లో బ్లాగ్ 'రత్తాలు', బ్లాగ్ 'v' భో షా ణా లు , బ్లాగ్ భో షా ణా లు, బ్లాగ్ శ్రీ లు రావచ్చు.

ఆ కాలం లో పొస్తమస్ గా నా కేవ్వరైనా బ్లాగ్ శ్రీ లాంటివి, బ్లాగ్ 'భో షా ణం '  ఇస్తే బ్లాగ్ లోకం లో అప్పుడున్న బ్లాగ్ మణులు, మాన్యులు 'జిలేబీ నీకు శ్రీ తగదు, 'భో షా ణం ' తక్కువ అని టపాలు కట్టి, జిలేబీ ని వాయ గొట్ట వచ్చు!

అప్పుడు నాకు వారికి సై అనడా నీకో, వారి మన్ననలు పొంద డానికో అవకాశం ఉండదు కదా!

పై నించి చూసి, మా నాన్నే, మా బంగారమే, నేను బ్లాగులు రాస్తున్న సమయం లో మీరంతా 'బుడతలు', బుడ్డీ లు రా ! నా గురించి ఇంత గా మీరు కొట్లా డొ ద్దు! ఏమి మీ అపార ప్రేమ జిలేబీ మీద అని 'అనాధ' భాష్పాలు చిందించి నా వారికి తెలిసే అవకాశం లేదు గా మరి.

అంతే గాక, ఆ రాబోవు కాలం లో మీరు నాకు 'భోషాణం' ఇచ్చి, ఛ ,ఛ , నా కిది వద్దు పో ఇది చాలా తక్కువ అని జెప్పలేను కూడా .

పోస్తు మస్సు గా ఇస్తే, భోషాణం వద్దంటుంది ఈ జిలేబీ అని మీరు ఆవేశ పడి పోయి మళ్ళీ మరో వంద టపాలు టప టప  లాడిస్తారు . ఎందుకు ఇన్ని భేషజాలు చెప్పండి?

అందుకే, ఇప్పుడే మీ కందరికీ చెబ్తా ఉండా , జిలేబీ కి 'బలాగు' రత్తాలు' మాత్రమే  సుమీ ! కాబట్టి ఇప్పటికిప్పుడే నాకు నేనే 'బలాగు' రత్నం అని ప్రకటించు కుంటూం డా !

ఓ మారు జిలేబీ 'బాలా' గు బ్లాగ్ 'రత్తాలు' కి జే  జే కొట్టుడీ మరి ! జై ;బాలా, (గు) రత్నా ! జిలేబీ !


ఇట్లు
బలాగు రత్నం
'సహీ' రత్న'
జిలేబి.

Tuesday, January 29, 2013

'బామ్మ' ఒళ్లో అ ఆ ఇ ఈ నేర్చు కున్నా !


బలపం పట్టి భామ వొళ్ళో అ ఆ ఇ ఈ నేర్చు కున్నా అని కవి (కని పించక పోయినా, వినిపిస్తున్న వాడు కవి- కొత్త నిర్వచనం!)  'ఆడలేడీసు ' మహాత్మ్యాన్ని చాటేడు .

ఇంత కథ ఉందన్న మాట ఈ అ ఆ ఇ ఈ ల కి.

అంటే, అమ్మ, ఆవు ఇల్లు ఈగ అని చిన్నప్పుడు చదువు కున్నాం చూడం డీ దాని గురించి చెబ్తున్నా.

ఇప్పటి కి మా మనవడి కాలం కూడా దాటి పోయింది కాబట్టి, 'ఇస్కూలు' వాళ్ళు అ ఆ ఇ ఈ ఇంకా నేర్పిస్తున్నారా అన్నది తెలీదు. నేర్పించినా, అదే అమ్మ ఆవు ఇల్లూ ఈగా అని చెబ్తున్నారా అదీ ను తెలీదు.

ఈ విషయం కూడా తెలీకుండా ఇట్లా టప్పు టప్పు లాడిస్తే ఎట్లా జిలేబీ అంటా రా?

మరి, టప్పు టప్పు లాడించే టప్పుడు మరి ఏ సబ్జెక్టు లేకుండా ఎట్లా టపు టపు లాడించ వలె అని జిలేబీ చాలా కాలం మునుపే టపాయించిందాయె మరి.!

ఇక అ ఆ ఇ ఈ ల విషయానికి వస్తే, ఈ నాలుగు అక్షరాలలో భువి దివి ఆ మాట కొస్తే 'విశ్వం' మొత్తం ఇమిడి ఉందని పిస్తుంది.

అందమైన ఆకాశాన్ని అలా చూస్తూ ఉంటే ఏమని పిస్తుంది మీకు? ఓ పది నిమిషాలు అట్లా తదేకం గా చూడండి, మీ ఆలోచనలన్నీ మటు మాయ మై పోతాయి. ఓ లాంటి బ్లాంక్ నెస్ వస్తుంది.

(సైడు కథ, ఇది జిడ్డు వారిది-  అట్లా ఆకాశాన్ని చూస్తూ నడిచే వారట, క్రిందా, ముందూ ఏముందో కూడా చూడ కుండా నది వెంబడి అట్లా నడిచే వారట)

ఇక ఈ e-లోకం చూడండీ. ఇందులో తల పెడితే ఇక బయటకు వచ్చే సమస్యే లేదు.

ఎంతో మంది ఈ e-లోకం లో నే జీవితం గడి పే స్తున్నా రాయే!

సో, అందమైన ఆకాశం ప్రకృతి లో మమేకం. ఈ  e-లోకం లో మనం మమేకం.

వెరసి 'ఏది' అదో అది' (తత్వమసి!) లో   మమేకం కాకుంటే మనమే ఏకం!

 'మమ ' ఏకమా  ? కాకుంటే మమేకమా అన్నది మన చేతల బట్టి ఉంటుందన్న మాట.

(పద్మ కోశ ప్రతీకాశమ్ హృదయం చా ప్యధొ ముఖం!- తిరగ బడ్డ పద్మం లా హృదయం లో ఉంటుం దట , ఏమిటది? btw, ఊర్ధ్వ మూలం అధః శాఖమ్ , అధొ ముఖ పద్మ కోశం ?)

సో, ఇవ్వాళ్టి కి మీరు, కూడా చెప్పొచ్చు- ఈ టపా చదివాక ! బామ్మ ఒళ్లో అ ఆ ఇ ఈ నేర్చుకున్నా అని !

శుభోదయం!

చీర్స్
జిలేబి.

Sunday, January 27, 2013

బాడ్, మా సిరి !

బాడ్, మా సిరి
 
(పద్మశ్రీ!)
 
మన తక్దీర్ బాగో కుంటే వేరే వాళ్ళని అని ఏమి ప్రయోజనం ?
 
అరవ పోడు  చెళ్ళు మని పించాడు మరో మారు
 
మన సిరి ని మనం ఎప్పుడూ గుర్తించం.
 
బాడ్, మా సిరి.
 
అంతే అనుకోవాలిస్మీ 
 
(జీ, లే)
జిలేబి.
(మత్తు వదలరా, నిద్దుర మత్తు వదలరా)

Saturday, January 26, 2013

ఐటము సాంగ్సు - జిలేబీ ల జన్మ రహస్యం


ఇంద్ర సభకు అర్జునుడు వచ్చాడు.

ఇంద్రునికి కొంత బెరుకు పుట్టుకుంది. తన పదవి డాం అని పోతుందేమో అని.

వెంటనే రంభా ఊర్వశీ తిలోత్తమా అంటూ ఇంద్రుడు వాళ్ళని పిలిచి అర్జునిని 'ఎంటర్ టైన్ మెంట్ ' చెయ్య మన్నాడు.

అర్జునుడు తక్కువైన వాడా?  ఎంటర్ టైన్ మెంట్ తనకు కావలసింది ఏమిటో ఇంద్రునికి చెప్పి డిమాండు చేసాడు.

ఇట్లాంటి ఫెసిలిటీ యమధర్మ రాజుకి ఏమీ లేకుండా పోయింది. పాపం.

చిత్రగుప్తుడు బుర్ర పెట్టాడు.

'స్వామీ' భారతావని లో సినీమా లోకం ఒకటి ఉంది. మనలోకాని కొచ్చే జనాభా లో చాలా మంది ఆ అవని నించే వచ్చే వాళ్ళు ఎక్కువ. ప్చ్ ఇక్కడి కొచ్చాక వాళ్లకి మనం ఎట్లాంటి ఎంటర్ టైన్ మెంటు ఇవ్వలేక పోతున్నాం.

అదే, ఇంద్రుల వారి సభ చూడండీ, 'సకల'కళా పర్వం గా ఉన్నది.

యముండ అన్నాడు యముడు. 'ఎం చేద్దా మంటావ్ గుప్తా' అన్నాడు. మన లోకం లోకి వచ్చే వాళ్లకి కూడా ఇట్లాంటి ఫీచర్ పెట్టాలి ఇక్కడ పెట్టక పోయినా, ఇక్కడి కి రాక మునుపే వాళ్లకి మస్తుగా ఇట్లాంటి ఫీచర్ , సౌకర్యం కలగాలి.

యముడు ఆర్డర్ వేసాడు.

రంభ, ఊర్వశీ, తిలొత్తమ  ల తో గుప్తా రహస్య ఒడంబడిక కుదుర్చుకున్నాడు.

వారి అంశ ల తో ఐటం సాంగ్స్ లో రాణిం చ డానికి  పోలో మని జిలేబీ లు హాట్ హాట్ రా రావటం మొదలెట్టేరు, భారతావని లో.

దానికి పూర్వాపరం గా, సైట్  విజిట్ కి రామారావు యమ గోల మొదలెట్టేడు.

ఆ పై అంతా జిలేబీ ల ఐటం సాంగ్స్ మయమే!

(ఈ మధ్య ఏదో ఒక సినిమా లో ఇద్దరు హీరో లట , కాబట్టి మినిమమ్ రెండు ఐటం సాంగ్స్ ఉంటా యని 'సాంగో పాంగం' గా ఎవరో . Modesty is by far my best Quality అని అంటేను ... !)


చీర్స్
జిలేబి
 

Friday, January 25, 2013

ఆకసాన మేఘం

అదివో అల్లదివో ఆకసాన మేఘం 
 
పు న్నమి రాబోతున్నది 
అయినా ఎందుకో కటిక చీకటి 
హృదయాం త రాలలో భయం 
 
అదివో అల్లదివో ఆకసాన మేఘం 
 
పున్నమి వచ్చినా
చీకటి పోతుందో తెలీదు
అసలు చీకటి ఉందా?
ఇది మనో వైకల్యమా ?
 
అదివో అల్లదివో ఆకసాన మేఘం 
 
పున్నమి రేయి రావోయి 
కటిక చేకటి అనుకున్న నన్ను
చేర దీయ వోయి
చెర విడిపించ వోయి
 
 
జిలేబి.
 

Thursday, January 24, 2013

సీతమ్మ అగ్ని ప్రవేశం చేసి సాధించినది ఏమిటి ?


"సీతమ్మ అగ్ని ప్రవేశం చేసి సాధించినది ఏమిటి ? ఒక్క పదం  లో చెప్పా లంటే సింపతీ. తల్లి ఏట్లో దూకుంటే సంద్రం లో దూకుంటే ఆత్మ హత్య అనేవారు. అగ్ని ప్రవేశం చేసి సింపతీ కొట్టేసింది." అన్నా మా అయ్యరు  గారితో.

మా అయ్యరు  గారు సీరియస్ గా లుక్కి చ్చేరు  ఇదేదో విపరీతం ముంచు కోస్తోందేమో అనుకుంటూ.

మిమ్మల్ని ఏమీ అనటం లేదండీ అన్నా. 'మిమ్మల్ని అని నొక్కి చెప్పడం లో 'మీ 'మగోళ్ళ ని ' అని అర్థం ధ్వనిం చేలా.

హమ్మయ్య అనుకుంటూ కొంత సేద బడ్డారు అయ్యరు గారు.

ఇంతకీ ఏమం టావ్ ? అన్నట్టు చూసేరు.

ఏమీ లేదండీ శంకరా భరణం లో ఓ కామెంటు కొట్టేను ఎప్పట్లా.  చెప్పా.

ఏమని కొట్టా వేమిటి అడిగారు మా అయ్యరు గారు సీరియస్ గా.

"ఏ కాలమైనా తన కాలం కాని స్త్రీ
నాడు రామాయణం లో అగ్ని ప్రవేశం
మొన్న ఇంద్రప్రస్థం లో అగ్గి బరాటా
రేపు మరి ఎక్కడో ఈ ప్రకృతి కి బుగ్గి ?"
 

అట్లా ఎందుకు రాసావ్ జిలేబీ అన్నారు.

ఆ ఏముందీ, శ్యామలీయం వారి మస్కా శ్యామరామీయం రామప్రభో పాహిమాం పాహిమాం చదివా. ఆ పై కంది వారి టపా లో ఓ ఫోటో పెట్టి పద్యం కొట్టండి అంటే, ఫోటో చూస్తే అందులో ఒకావిడ అగ్ని వైపు వెళ్తోంది. మరో ఇద్దరు చూస్తున్నారు.

మనకి సింబాలిక్ గా, అగ్గి, స్త్రీ కనిపిస్తే తటాలు మని తట్టేది ఏమిటి? సీతమ్మ వారి అగ్ని ప్రవేశ ఘట్టమే కదా ? అంటే, అమ్మ వారి అగ్ని ప్రవేశానికి అంత మహత్వం ఉన్న దన్న మాట. కాదామరి ఇది 'సింపతీ వేవ్'? అన్నా.

ఈ మారు అయ్యరు  గారు ఏమీ చెప్పక ఏ వైపు చెబ్తే ఏమి తంటా వచ్చునో అని ఊరుకున్నారు.

అబ్బా, ఎంతైనా లేడీస్ తెలివి వీళ్ళకు వచ్చునా అని మురిసి పోయా.

ఆల్వేస్ జిలేబీస్ ఆర్ గ్రేట్. జాంగ్రీ స్ ఆర్ నెక్స్ట్ ఓన్లీ  టు జిలేబీస్ యు నో?

చీర్స్
జిలేబి.

 

Tuesday, January 22, 2013

రండి, తెలుగలో ముచ్చట్లాడు కుందాం !

హాయ్ మమ్మీ!
 
బుజ్జి కన్నా హోవార్యు రా !
 
యు నో, నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందోచ్ !
 
డాడీ, ఐస్క్రీం.
 
నో నో.
 
ఏమిబా ఉండావా , పూడ్సినావా ?
 
చమడా వోలిచేస్తా, ఏమ్దిబే గట్లా  కిరికిరీలు చేస్తా గుండావు ?
 
తెలుగు పదాలు ... Rubbish?
 
నాయక్ చిత్రం లో టెల్గూ దనం !
 
జిలేబీ ఈ పేరు టెల్గూ నా?
 
నాకూ టెల్గూ కొంచెం, కొంచెం 'ఆటా' హాయ్!
 
హే రాజన్! వీళ్ళు 'తానా' అంటే, 'ఆటా' అంటున్నారు !
 
This is telugu blog!
 
రండి,  తెలుగులో ముచ్చట్లా డు కుందాం!
 
జీవనది లో అన్నీ మమేకం!
మమేకం కాకుంటే అది తాలాబ్!
 
చీర్స్
(మళ్ళీ టెల్గూ !)
జిలేబి
(మళ్ళీ మళ్ళీ టెల్గూ )
 
Forum is open to all! వెల్కం 'తో '
శుభోదయం (గుడ్ మార్నింగ్!)
 
 

Sunday, January 20, 2013

కామెంటు కొట్టుటకు సరికొత్త 'కామెంటు'దారులు కావలయును !

 
ప్రకటన!
 
మా బ్లాగుకు కామెంటు కొట్టుటకు సరికొత్త 
 
'కామెంటు' దారులు కావలెను.
 
ఆలశించిన ఆశా భంగం.
 
త్వర పడండి ! వేగిర పడండి !
 
కామెంటు కో కాణీ మీకు ఇనాము !
 
భలే మంచి చౌక బేరము !
 
పది కామెంటు కొట్టు వారలకు ఒక కొత్త టపా ఉచితం!
 
కామెంటు దారుల పేరుతొ 'బ్లాగు' దేవునికి లక్షార్చన !
 
(ఇది కొత్త కామెంటు దారలకు జిలేబీ అందించు సరికొత్త జాయినెర్స్ ఫ్రీబీ!)
 
 
ఈ సదుపాయము  జిలేబీ టపా లకు కామెంటు కొట్టిన వాళ్ళకు మాత్రమే !
 
 
(అబ్బా అన్నీ కొత్తవి వచ్చేసాయి, ఈ కామెంటు దారులు మాత్రం పాతవారేనా మరి?)
 
ఇంతకు మునుపు టపా కి కామెంటు కొట్టినవాళ్ళు కొత్తగా కామెంటు కొడితే,
 
వారికి కామెంటు కు పది కాణీ లు బకాయ్!
 
(ఇది పాత కామెంటు దారులకు జిలేబీ'స్ స్పెషల్ లాయల్టీ ప్రోగ్రాం!)
 
చీర్స్ 
జిలేబి.

Friday, January 18, 2013

కుమారీ!సు'కు'మారీ !


 
కుమారీ!సు'కు'మారీ !
 
అక్కు న చేర్చు అమ్మ 
ఉరుక్కు హిరణ్యమయి 
రుక్కు 'కృష్ణ' ప్రేమీయం 
 
గక్కున ముక్కులెగురు 
చక్కు చెక్కు చిక్కు చమక్కు 
టకు టకు టెక్కు 
 
ఫక్కు   న నగవు 
భక్కు న మండు 
మక్కున పండు 
 
రక్కున నవ్య రసిక 
లక్కు దేవుడిచ్చిన వరం 
వెక్కు  అకారణం 
 
సెగగక్కు అప్రియం 
హక్కు న మోర్చా 
చమక్కుల జిలేబి!
 
 

Sunday, January 13, 2013

అమెరికా బుజ్జిపండు - ఆంధ్రా బుడుగు - భాగం 2


అమెరికా బుజ్జిపండూ - ఆంధ్రా బుడుగు - భాగం 1

(తరువాయి)

ఆ గుడారాల వైపు వెళుతున్న బుజ్జి పండుకి తన వెనుకే ఎవరో వస్తున్నట్టై అనిపించి తటాల్మని నిలిచాడు.

వెనుక వస్తున్న అడుగుల సవ్వడి కూడా ఆగి పోయింది.

కొంత సేపాగి మళ్ళీ నడక మొదలెట్టాడు బుజ్జి పండు. మళ్ళీ నడక సవ్వడి వెనుక నించి వినపడ్డది.

ఈమారు భయం పట్టుకుంది బుజ్జి పండుకి.
తన వెనుకే ఎవరో వస్తున్నారు.
తాను ఒంటరి గా ఉన్నాడు.
గుక్క పట్టి ఏడుపుని దిగ మింగు కుంటూ మళ్ళీ నిలబడ్డాడు.
అడుగుల సవ్వడి మళ్ళీ  మాయం..

ఈ మారు ఏడుపుని దిగ మింగు కుని వెనుక ఎవరోస్తున్నారో చూద్దామని తల కొద్దిగా తిప్పి చూసాడు.

గోచీ పెట్టుకుని తన ఈడు వాడె ఎవడో తన వెనుక ఉన్నాడు!

బుజ్జి పండు కి ఊరట కలిగి ధైర్యం వచ్చింది.  'whats your name? I am buzzi' చెప్పాడు బుజ్జి పండు ఈ మారు బ్రేవ్ గా.

ఆ వెనుక వస్తున్న గోచీ పెట్టిన బుడతడు అయోమయం గా చూసేడు. అర్థం కాలేదు బుజ్జి పండు ఏమన్నాడో అన్నట్టు నిలబడ్డాడు.

బుజ్జి పండు ఈ మారు తెలుగులో చెప్పాడు ' నీ పేరేంటి?'

ఈ మారు ఆ బుడతడు సన్నగా నవ్వి, 'నా పేరు 'అప్పల్సామీ' అన్నాడు.

'హి హి అని నవ్వ బోయి, నవ్వితే బాగోదనుకుని బుజ్జి పండు 'హాయ్ అప్పల్సామీ ' అన్నాడు చేయి చాపి.

అప్పల్సామీ నవ్వాడు స్నేహ పూర్వకం గా. 'ఎక్కడి కి పయనం? అడిగాడు

బుజ్జి పండు ఈ మారు విచారం గా ముఖం పెట్టేడు. 'నాది అమెరికా. నేనెట్లా ఇక్కడున్నానో నాకే తెలీలేదు'

'అమెరికా?  అదెక్కడ ఉందీ?' తెలీనట్టు అడిగాడు అప్పల్సామి వచ్చే నవ్వుని దాచుకుంటూ. బుజ్జి పండు అమెరికా అని సాగ దీసి చెప్పటం మరీ అతనికి నవ్వు తెప్పించింది.

బుజ్జి పండు ఈ మారు అప్పల్సామిని ఆశ్చర్యం గా చూసాడు. 'అమెరికా తీలిని వాళ్ళు కూడా ఉంటారా ' అన్నట్టు ముఖం పెట్టి,

'అమెరికా తెలీదా! నేనక్కడే ఉంటా చెప్పాడు బుజ్జిపండు.

అప్పల్సామీ తెలీనట్టు తలూపాడు అడ్డంగా.

'నేనెక్కడ ఉంటానో అదీ అమెరికా అన్న మాట. చెప్పాడు బుజ్జి పండు.'

'నువ్విప్పుడు ఇక్కడ ఉన్నావు. ఇది అమెరకా కాదే మరి ? అడిగాడు అప్పల్సామి.

 ' ప్చ్. కానీ నేనిప్పుడు ఎక్కడున్నానో నాకే తెలీటం లేదు. ఇంతకీ నేనెక్కడున్నానో మరి ' అప్పల్సామీ అన్న మాటలు అర్థం కాక చెప్పాడు బుజ్జి పండు.

'ఓ' చెప్పాడు అప్పల్సామి.

కొంత దూరం నడిచాక, మళ్ళీ అడిగాడు బుజ్జి పండు 'అప్పల్స్' అన్నాడు 'ఇదేమి సిటీ?'

'అప్పల్స్' ఎవరూ? అడిగాడు అప్పల్సామి.

'ఓ, మా ఊళ్ళో అందర్నీ 'షార్ట్' నేమ్తో పిలుస్తాం. అట్లా నిన్ను పిలిచా, అప్పల్స్ అని ' చెప్పాడు బుజ్జి పండు.

అప్పల్సామి నవ్వాడు 'అప్పల్స్! బాగుందే పేరు ' అనుకుని , అప్పల్స్, అప్పల్స్ అని నాలుగైదు మార్లు అనుకున్నాడు. 

'మీ ఊరి పేరేమిటి ? అడిగాడు బుజ్జి పండు ఈ మారు, సిటీ అంటే ఈ అప్పల్స్ కి తెలీదేమో అనుకుంటూ. అమ్మ చెప్పిందిగా చాలా మందికి తమ ఊరు తప్పించి వేరే ఏదీ తెలీదని అనుకుంటూ.

ఈ ఊరి పేరా ? అని ఒక్క నిమిషం ఆలోచించి చెప్పాడు అప్పల్సామి 'సత్పురం'

'సత్పురం! అబ్బా ఊరి పేర్లు ఇట్లా గూడా ఉంటాయా? మా ఊరి పేరేంటో తెలుసా ? టెక్సాస్ చెప్పాడు బుజ్జి పండు.

అప్పల్సామి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు , తెలీదన్నట్టు తలూపుతూ.

ఈ అప్పల్సామి కి ఏమీ తెలీదు. ఏదడిగినా తెలీదంటాడు మరి.' అని బుజ్జి పండు నిట్టూర్చి 'ప్చ్, అప్పల్సామి అమెరికా లో ఉంటే అసలు ఎట్లా బతుకు తాడో సుమీ? అమెరికా లో అందరికీ అన్ని తెల్సు మరి ' అని బాధ పడి పోయాడు.

'మరి ఆ గుడారాలేమిటీ?' దూరం గా కనిపించే గుడారాలని చూపిస్తూ అప్పల్సామిని అడిగాడు బుజ్జి పండు.

'ఆ గుడారాలా? అక్కడో స్వామీ వారు బెంగాల్ నించి వచ్చి ఉన్నారు. స్వామీ వివేకానందా అని ' చెప్పాడు అప్పల్సామి.

'ఓ, నాకు తెలుసు. మా అమ్మ చెప్పింది. స్వామీ వివేకానందా మా చికాగోలో ప్రపంచ సభ లో మాట్లాడారు కదా , వారి మాటలు మొత్తం నాకు కంటస్థం వచ్చు తెలుసా ?'  చెప్పాడు గర్వం గా బుజ్జి పండు.

ఫక్కున నవ్వాడు అప్పల్సామి. 'చికాగో నా అదేక్కడుందీ?'

'అప్పల్స్, నీకు చికాగో తెలీదా, పద, స్వామీ వారి తో నే చెప్పిస్తా నీకు చికాగో ఎక్కడోఅన్నాడు'

ఎక్కడుందో చికాగో మరి ? సీకాకులాన్ని చికాగో అంటున్నావా ?  అడిగాడు అప్పల్సామి నవ్వుతూ.

అంతట్లో వారి మాటల్లోనే ఆ గుడారాల దగ్గిరికి వాళ్ళు వచ్చేరు.

అప్పల్సామి బుజ్జి పండు ని స్వామీ వివేకానందా వారి ముందుకు తీసుకెళ్ళి, 'స్వామీ' ఈ అబ్బాయేదో అంటున్నాడు చూడండి మరి' అన్నాడు నమస్కరిస్తూ.

బుజ్జి పండు స్వామీ వారిని చూసేడు. అబ్బ ఆ ఫోటో లో చూసినట్టే ఉన్నాడు సుమా. నిండుగా ఉన్నాడు కూడాను అనుకున్నాడు.

స్వామీ వారు బుజ్జి పండు ని అప్పల్సామి ని మందస్మిత వదనార విందులై చూసారు.

ఆ క్షణం స్వామీ వారికి గాని, బుజ్జి పండు కి గాని తెలియని ఒక అపూర్వ క్షణం.

రాబోయే కొన్ని నెలల్లో స్వామీ వారు చికాగో కి వెళ్తారని అక్కడ వారి సంభాషణ కి మూలం ఈ 'ఫ్యూచర్ జనరేషన్' నించి కాల వాహిని లో పయనించి వచ్చిన బుజ్జి పండు కారణభూతుడు అవుతాడు అని వారికి తెలియని, ఒక్క అప్పల్సామి కి మాత్రమే తెలిసిన విషయం.

అప్పల్సామి నవ్వుతూ నిలబడ్డాడు.

స్వామీ వారి వెనుక గూడారం గోడకి ఓ కాలెండరు వేలాడు తోంది.

తారీకు అందులో 'January 12, 1893' అని  కనిపిస్తోంది.

(సశేషం)
జిలేబి.

Friday, January 11, 2013

అమెరికా బుజ్జి పండు - ఆంధ్రా బుడుగు

అమెరికా బుజ్జి పండు, అక్కయ్య అమ్మా నాన్నలతో గుడికెళ్ళి పులిహోర కానిచ్చాక ఎందుకో అట్లా తల తిప్పి చూసాడు.

అంతా కొత్తగా కనిపించింది గుడి.

అబ్బా తెల్లారి వచ్చినప్పుడు వేరేలా గుడి ఉండిందే? ఇప్పుడు వేరేలా ఉందేమి చెప్మా అని చెంపకు చెయ్యి ఆనించి చూసాడు.

తెల్లారి పైజమా లాల్చీ తో కదా, ఇప్పుడేమో, అర నిజారు పొట్టి చేతుల చొక్కాతో ఉన్నానేమిటి అని ఆశ్చర్య పోయాడు తన్ను తాను చూసుకుని.

ఏమయ్యిందో ఆతనికి అస్సలు అర్థం కాలేదు.

అమ్మా నాన్నలు తన ప్రక్కనే గదా ఉండాలి అని కలయ తిరిగి చూస్తే, అసలు వాళ్ళిద్దరూ కనిపించలే.

కొద్ది దూరం లో అక్కయ్య లా ఓ అమ్మాయి కనిపించింది. అచ్చు అక్క పోలికలో నే ఉంది. అయినా ఎందుకో సందేహం వచ్చింది అమ్మాయి తన అక్కయ్య కాదేమో అని. తెల్లారి పట్టు పరికిణీ లో ఉండింది
మరి ఇప్పుడేమో అదేదో గొట్టం ప్యాంటూ, పై తన లాల్చీ లా ఉన్న చొక్కాయి, ఆ పై ఓ దుపట్టా - అబ్బా, ఇట్లా అప్పుడప్పుడు అమ్మే కదా వేసుకునేది, ఇట్లా అక్క ఎందుకు వేసుకుని ఉంది అని

'అక్కా అని పిలిచాడు.

ఆ అమ్మాయి తిరిగి చూళ్ళేదు.

మరో మారు అక్కా అన్నాడు.

ఊహూ , జవాబు లేదు

వేరే ఎవరైనా ఏమో అనుకుని మళ్ళీ గుడి వైపు చూసాడు.

గుడి మరీ పాత కాలం గుడి లా ఉంది.

అబ్బే, తెల్లారి గుడి అంత శుభ్రం గా, మంచి కళ తో, కొత్తగా వెల్ల వేయబడి ఉండిందే మరి ? ఇప్పుడేమి ఇట్లా వెల వెల బోతోందీ  అని అనుకున్నాడు.

అసలే అమ్మా నాన్నలేక్కడా కనిపించడం లేదాయే. మరి అక్కయ్య లా ఉన్న అమ్మాయి కూడా అసలు తన వైపు చూడ్డం లేదు. తను పలకరిస్తే అసలు జవాబు ఇవ్వడం లేదు.

బుజ్జి పండు కి మొట్ట మొదటి సారి భయం వేసింది.

గుళ్ళో ఉన్న దేముడి వైపు చూసేడు. తెల్లారి కనిపించిన దేవుడిలా నే ఉన్నాడు (అమ్మ చెప్పింది గా ఉన్నాడు అని చెప్పొచ్చని , నా ఈడు వాడే అని ) ఈ మారు ధైర్యం గా అనుకున్నాడు, మరి ఈ దేవుడు ఇక్కడ ఇలా గోచీ తో ఉన్నాడే మిటి మరి? తెల్లారి ఎంత మా గొప్పగా అలంకారం తో ఉన్నాడే మరి ఇప్పుడెందుకు ఇలా పప్పీ షేం లా ఉన్నాడు చెప్మా అని మళ్ళీ చెంపకు చేయ్యేసు కున్నాడు.

బుజ్జి పండు గుళ్ళో నించి కాలు బయటకు పెట్టాడు.

తారు రోడ్డు కనిపించడం లేదు. చుట్టూతా మట్టి దారి. కొంత దూరం లో పచ్చిక బయలు. ఆ పై దూరం గా విసిరేసి నట్టున్న గుడారాల్లా  ఉన్నాయి. ఏమిటబ్బా అవి అనుకుని ఆ వైపు వెళ్ళాడు బుజ్జి పండు.

గుళ్ళో ని దేవుడు ముసి ముసి నవ్వు చిందించాడు.

నిశ్శబ్దం గా ఆ అబ్బాయి వెంబడే మరో చిన్న పిల్లవాడిలా మారి బయటకు కాలు పెట్టేడు దేముడు కూడా.



(సశేషం)

జిలేబి.

Wednesday, January 9, 2013

జాజి మల్లి సౌరభాలు వీస్తున్నాయి ! మరి తేనెటీగలు ఎక్కడో?

జాజి మల్లి సౌరభాలు వీస్తున్నాయి !
 
మరి తేనెటీగలు ఎక్కడో?
 
ఆ పూదోటలో జాజిమల్లుల
సౌరభాలు మకరందాలు గుభాళిస్తున్నాయి.
 
మరి తేనెటీగలు ఎక్కడ ?
 
ఏమి చేస్తున్నాయో పాపం!
 
An active bee alone creates Honey
అని ఓ జిలేబీ సామెత.
 
బ్లాగ్ లోకపు ఆక్టివ్ బీస్ ఎక్కడో మరి?
 
బ్లాగ్ లోకాయ సుప్రజా రామా, సంధ్యా పూర్వా ప్రవర్తయే !
ఉత్తిష్ఠ 'బ్లాగ్'శార్దూలా కర్తవ్యమ్ 'ఏక' మాహ్నికమ్!
 
 
చీర్స్ 
జిలేబి.

Tuesday, January 8, 2013

మౌస్ కిచ్చే పాటి మర్యాద స్పౌస్ కి లేదా ?

బ్యాక్ ప్యాక్ బకరా బాబు ఉస్సూరు మని కూలబడ్డాడు ఇంటికి వస్తూ రాకనే.
 
వాడి పెండ్లాము బక్రీ బేబీ ఇంకా 'ఓఫీసు' నిండి ఇంటికి రాలే.
 
ఏమిరా ఈ లైఫు అని ఆలోచిద్దా మనుకుని ,
అబ్బే ఇట్లాంటి సెంటిమెంటు ఫిలోసోఫీ లో కి వెళ్తే
మరీ 'బేజారే' సుమీ అని సోఫాలో పడి గురక పెట్టి నిద్దుర పోయేడు.
 
అపరాత్రి తలుపు కిర్రుమంది.
 
బక్రీ బేబీ మరో కీ తో తలుపు తెరుచుకుని ఇంట్లో కి వచ్చింది.
 
బకరా బాబు సోఫాలో అడ్డంగా పడి నిదురోతున్నాడు.
 
చేతిలో లాపు టాపూ అట్లాగే 'ఆన్' లో ఉంది.మరో చేతిలో మౌసు !
 
చ, స్పౌసు కౌగిట్లో నిద్దుర పోవాల్సిన మానవుడు ఇట్లా మౌసు కౌగిట్లో నిద్దుర పోతున్నాడే
అని ఆలోచిద్దా మనుకుని ,
అబ్బే, ఇట్లాంటి సెంటిమెంటు ఫిలోసోఫీ కి వెళ్తే మరీ బెజారే సుమీ
అని మరో సోఫాలో పడి బక్రీ బేబీ కూడా నిదుర పోయింది.
 
కథ స్వప్న లోకానికి, మనం మళ్ళీ మరో రోజుకి !
 
శుభోదయం.
 
జిలేబి 
(బక్రీ  Musings)
(My wife dresses to kill. She cooks the same way!).

Sunday, January 6, 2013

అయ్యరు గారితో మిథునం!

ఏమండీ అయ్యరు వాళ్ , మిథునం అని మాంచి చిత్రం వెళ్దామా? అన్నా మా జంబునాధన్ కృష్ణ స్వామి అయ్యరు గారితో.

ఇంతకు ముందే చూసేసా నోయ్ మలయాళం పిక్చరే గా ? మోహన్ లాల్ మా బాగా ఏక్ట్ చేసాడు.

'ఆడ మలయాళం కాదు స్వామీ, ఇది ఈడ తెలుగు మిథునం ' చెప్పా 'అబ్బా ఈ అరవం వోళ్ళ కి అరవం, మలయాళం తప్పించి వేరే ఏదీ పట్టదు సుమీ' అనుకుంటూ.

తెలుగు మితునమా ?

మితునం కాదు స్వామీ, మిథునం చికాకుగా అన్నా, ఈ అరవం మరీను, త,థ ,ద ధ  అన్నీ ఒక్కటే ఆయే మరి. మధ్య లో గుండు సున్నా కూడా ఉంది, చెప్పా.

అచ్చ తెనుగు చిత్రం కొంత గొప్పగా చెప్పా. 'తనికెళ్ళ భరణి అని మా గొప్ప మడిసి అచ్చ తెనుగు లో తీసేడు'

తెలుగు 'పురియాదె' ఎట్లా మరి ? అన్నారు

అబ్బా ఇంకేట్లా వీరిని లాక్కె ళ్ళేది మరి ?

'అమ్మా నాన్నల ప్రేమ కథ అయ్యరు వాళ్ ' ఈ మారు కొంత ఆశ పెట్టా.

అమ్మా నాన్నల ప్రేమకథ మనమెందుకు చూడడ మే ? మన కథే ఇట్లా తెలవారి పోతోంది కదా మరి ? మళ్ళీ ఓ రిటార్టు.

అబ్బా, ఎట్లా వీరిని లాక్కెళ్ళడం?

'బాలూ లేడు ? అదే నండీ శ్రీ పండితారాధ్యుల వారి గారబ్బాయి , మా బ్రహ్మాండం గా నటించాడంట ' ఈ మారు దీనికైనా బోల్తా పడతాడేమో అని చూసా.

'బాలూనా  మా బాగా పాడతాడు, ఇప్పుడు నటించడం కూడా మొదలెట్టేడు?'

అబ్బా, ఈ పాత కాలం వారికి మతిమరుపు చాలా ఎక్కువే మరీ ను.

'బాలూ ఎప్పుడో చిన్నప్పటి నించి అడపా దడపా సినిమాల్లో నటిస్తున్నాడు కదండీ , ఆ మధ్య ఒక అరవం సినిమాలో గుక్క తిప్పు కోకుండా పాడాడు కదా మరి ?'

అవును కదా ? మర్చి పోయా. చెప్పేరు అయ్యరు గారు.

అయితే వెళ్దామా?

వద్దు లేవే ! అచ్చ తెనుగు అంటావ్, అర్థమయి చావదె మరి'

ఈ మారు ఫైనల్ బాణం వేసా.

లక్ష్మి కూడా ఉందండీ '

ఎవరూ, లక్ష్మే ? రుక్మిణి అమ్మాయే? యారగుడిపాటి వారే కదా,నుంగంబాక్కం జానకి మనవరాలే కదా?'

అబ్బా, ఈ పాతకాలపు జ్ఞాపకాలు మాత్రం ఎట్లా గుర్తుంటాయో వీరికి మరి?

వెళ్దామా అయితే?

అబ్బా, ఇంకా ఎవరెవరొయ్ ఎక్టర్లు?

మండి పోయి, 'వాళ్లిద్దరే! ఇంకా ఎంత మంది కావాలేంటి ?' అన్నా కస్సు మని బస్సు మని.

ఇద్దరే నా ? హాశ్చర్య పోయారు అయ్యరు గారు.

అవును.

ఇద్దరేనా మళ్ళీ నోరు వెళ్ళ బెట్టేరు.

అవును.

అయితే చూడాల్సిందే మరి ! ఇద్దర్ని పెట్టి ఎట్లా చిత్రం తీసారబ్బా?

అన్నిటికీ ఎట్లా ఎట్లా అంటే ఎలా మరి? చూసి వస్తే కాని తెలీదు కదా మరి ? చెప్పా.

'కారులో షికారు కెళ్ళి ఆ పై వెళ్దామోయ్

అబ్బా, ఒక్క చిత్రం చూడ్డానికి ఎన్ని అవస్తలో మరి.

ఈ అయ్యరు లేజీ బీ తో ఈ జిలేబీ మిథునం అన్నీ మా బామ్మ తెచ్చిన ఒక్క ఫోటో వల్లే కదా మరి, అని మురిసి పోయా. ఎంతైనా మా అయ్యరు గారే కదా మరి.


చీర్స్
జిలేబి.
'sevenhills musings'

Friday, January 4, 2013

శభాష్ ఆంధ్రజ్యోతీ!

తెలుగు ప్రపంచ మహా సభల పుణ్యమా అని
మా ఆంధ్రజ్యోతి వారు మొట్ట మొదటి మారు
నవ్య ని ఆంధ్ర పత్రిక లా తీర్చిదిద్దారు. !
శభాష్ ఆంధ్రజ్యోతీ!
జిలేబి
 
Source:
http://www.navyaweekly.com/



బావిలో చెందురూడు

 
వెన్నెల పిచ్చ కాసింది..
 
హాలికుడు బావి దగ్గరికి వెళ్ళేడు  నీళ్ళ కోసం.
 
బావి లో చెందురూడు కనబడ్దేడు .
 
అయ్యో చెందురూడు బావిలో పడ్డేడే !
 
చేంతాడు కొక్కీ తెచ్చి చెందురూణ్ణి లాగాడు 
 
చేంతాడు కొక్కీ బావిలో రాయి కి తగులుకుంది 
 
ఎంత లాగినా చెందురూడు రాలే.
 
గట్టిగా పట్టి లాగాడు హాలికుడు.
 
చేంతాడు పుటుక్కుమని తెగి ఊరుకుంది 
 
హాలికుడు వెల్లకిలా పడ్డాడు దబ్బున 
 
కొంత సేపటికి తేరుకుని చూస్తే ఆకసం లో చెందురూడు !
 
అబ్బా నేను పడ్డా ఫర్లేదు గాని,చెందురూణ్ణి  రక్షించా
 
హాలికుడు సంతోష పడ్డాడు!
 
 
 
జిలేబి.

Thursday, January 3, 2013

జిలేబీ డైరెక్ట్ టు హోమ్ !

జిలేబీ డైరెక్ట్ టు హోమ్ !

చాలా డబ్బులు ఖర్చు పెట్టి (ఆంగ్లంలో Time is Money అన్నారు మరి!) అంటే వంద కోట్ల మిల్లీ సెకన్ల పై పెట్టు బడి పెట్టి టపాలు రాస్తున్నా,

అమ్మలారా, అయ్యలరా, మీరు వెంటనే జిలేబీ టపాలను మీ మీ గృహ వాటికలో డైరెక్ట్ టు హోమ్  ద్వారా టపాలు వేగిరమే చదివి చదివినడానికి ఓ పాతికో పరకో అమెరికన్ డాలర్లు కొట్టండి జిలేబీ టపా లకి.

లేకుంటే నేను దిక్కు దివాణం లేకుండా పోయే దానికి, ఆస్కార్లు లేకుండా కూడా పోయే దానికి సూచనలు కని పిస్తున్నాయి.

కావున అమ్మలారా, చెల్లెల్లారా, అయ్యలారా, తమ్ముల్లారా , నా మీద దయ పెట్టి డైరెక్ట్ టు హోమ్ కి పైసలు పడెయ్యండి!


చీర్స్
జిలేబి.

Tuesday, January 1, 2013

రెండు + సున్నా + ఒకటి = మూడు = 2013 శుభోదయం !

రెండు + సున్నా + ఒకటి  = మూడు = 2013 శుభోదయం !

 
రెండు + సున్నా + ఒకటి = మూడు
అన్నంత సాఫీ గా 
అందరికీ 2013
మరింత శుభములు
కలుగ జేయాలని ఆశిస్తూ
 
అందరికీ నూతన సంవత్సర
శుభాకాంక్షలతో
శుభోదయం 
 
 
చీర్స్ 
జిలేబి