Friday, April 20, 2012

అగ్ని మీళే పురోహితం !


సంసమిధ్యువసే వృషన్నగ్నే విశ్వాన్యర్యా ఆ !
జయహో భారత్ !

Thursday, April 19, 2012

గోవిందా గోవిందా గోవిందా !

గోవిందా గోవిందా గోవిందా !

ఒక వైపు చెవులు పోటెత్తే టట్టు భక్తుల భక్తి పరవశ ఘోషలు.

మరో వైపు, ఘంటసాల వారి భగవద్గీత - పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వారికి....

ఇంకో వైపు, పండితుల వేద పారాయణం - 'సహస్ర శీర్షాః పురుషః సహస్రాక్షః సహస్రపాత్ ....

అక్కడ , వెంకటేశ్వర సుప్రభాతం -

ఇక్కడ గోవిందా గోవిందా ఓం ఓం ఓం అంటున్న ఘంటా నాదం

మరో వైపు బస్సుల కి పరుగెడుతున్న భక్త జనవాహిని

ఇంకో వైపు సరికొత్త పెళ్ళైన జంట  మరో వైపు ప్రేమ పక్షులు ... ఆ వైపు  షష్టి పూర్తి చేసుకుంటున్న దంపతులు

ఒక వైపు ఉర్రూత లూగించు పవనాలు

మరో వైపు వేడి తాకిడి

ఇంకో వైపు భోజనాల హడావిడి

పుస్తక ప్రచురణల అంగడి

దైవ దర్శనం కోరి వేచి ఉన్న లక్షలాది భక్త జన వాహిని

దేవస్థానం వారి ఆఫీసు బిళ్ళ బంట్రోతు

స్వామీ వారి ఉత్సవ తేరు

ఒక వైపు భక్తి బృందం గోవిందా మరో వైపు పూజారుల మంత్రాల జోరు

వడ్డీ కాసుల వసూలు లెక్కలు ... బంగారం గ్రాముల కొలతలు .... జమా ఖర్చులు ...

వంటా వార్పూ... అన్నదాన పర్వం...

వీటన్ని మధ్యా నిశ్శబ్దం గా నిలబడి,   జనావళి  కి ఇంత పని బెట్టి , నిశ్చేతనం గా   గమనిస్తున్న మా ఏడుకొండల పెరుమాళ్ళు !

ఏడు కొండల వాడా, వెంకట రమణా,

గోవిందా గోవిందా గోవిందా
 
జిలేబి.

Wednesday, April 18, 2012

లవణీ తీగలు వారు ఫాయలే హకీకీ


లలామ
వనిత , పూబో
ణీ వాసం

తీ  మల్లె తీ
గ  వా
లు జడ
 
వారిజ
రుక్మిణి

ఫాతీమా
యవన
లేగ దూడ

హంస లేఖ
కీరవాణి
కితాబు



(కొంత కాలం మునుపు లవణీ తీగలు వారు ఫాయలే హకీకి అంటే ఏమిటని అడిగినవారికి !)

చీర్స్
జిలేబి.

Tuesday, April 17, 2012

తారా, 'సో' దరి !?

మేధ ను తారిస్తే
ఇండియా షైనింగ్
ఐటీ బిజ్

బాడీ ని తారిస్తే
ప్చ్, వ్యభిచార్

'చౌ' దరి ,
'సో', దరి ,
'ఏ'  దరి ?

ఒక తార నేలన పడి
బట్ట బయలయ్యింది
లోకం నేరమన్నది
ఇది నేరమన్నది

ఆకు ముళ్ళ మీద పడ్డా,
ముళ్ళు ఆకు మీద పడ్డా
ఆకు కే నష్టమట

ఈ సమీకరణం లో
ఆకులే సాక్షి

ఫిఫ్టీ ఫిఫ్టీ సమీకరణం
లో ఒక ఫిఫ్టీ ఎప్పుడూ
మరొక దానికన్నా
తక్కువే. 



జిలేబి. 

Monday, April 16, 2012

దేశ భాష లందు దేవ భాష 'లెస్సు' !

గుళ్ళోని దేవుడికి ముచ్చెమటలు పోసేయి.

పూజారి అల్టిమేటం ఇచ్చేడు.

' సామీ, రేపట్నించి గుళ్ళో పూజలు నీకు తెలిసిన భాషలో ఉండవు. కొత్త మంత్రి వచ్చాడు. అంగ్రేజీ అన్ని చోటా ఉండాలట. ఇక మీదట పూజా కార్యక్రమాలన్నీ కూడా అంగ్రేజీ లో నే'  చెప్పాడు పూజారి.  

ఆ మధ్య అరవ దేశం లో పూజలన్నీ అరవం లో నే ఉండాలని రూలు పెట్టేడు ఓ గుడ్డోడు. వాడి ఆర్డరు తో గుళ్ళోని దేవుడికి అరవం నేర్చుకోవడానికి తంటాలు పడాల్సి వచ్చే ! అరవం అంత సులభమైన భాష గాదు సుమీ అని వాపోయాడు ఓరియంటేషన్ కోర్సు కి వెళ్లి వచ్చి న దేవుడు.

'ప్రియ సఖీ' అన్నాడు కాళ్ళ వద్ద ఉన్న లక్ష్మీ దేవిని గమనించి.

'స్వామీ' అన్నది దేవేరి.

'డబ్బులు ఏమైనా ఇస్తావా '

ఎందుకండీ

ఆ అంగ్రేజీ ఏదో కొంత నేర్చుకుని తగలడతాను. 'పూజారి చెప్పాడు, వెంటనే నేనెళ్ళి ఏదైనా ఇంగ్లీషు కోర్సులో చేరి పోవాలాట '

స్వామీ

చెప్పు దేవేరి !

ఈ వయసు బడ్డ కాలం లో కొత్త భాష నేర్చుకుని ఏమి చేస్తారు

'ఎం చేద్దామంటావు ! ఇప్పటిదాకా తెలిసిన భాషలో ఆ పూజారి ఏదో చెప్పుకుంటూ వెళ్తూంటే , కర్ణాభ్యాం భూరి విశ్రువం ' అని ఆ సంగీతం లో  జోగుతూ ఉండి పోయా. ఇవ్వాళే ఆ కొత్త భాష వినిపించాడు. ఒక్క ముక్కా అర్థం కాలేదు. బెరుకు పుట్టు కుంది ' చెప్పాడు  గుళ్ళో దేవుడు.

ఎట్లాగూ వీళ్ళు మనల్ని రాళ్ళలో బంధించారు గదండీ స్వామీ వారు' లక్ష్మమ్మ అన్నది.

ఆవును దేవేరి

పోనీ లేద్దురు, రెండు చెవుల్లో కూసింత పత్తి పెట్టేసుకుంటే సరి ! ఎట్లాంటి సమస్యా లేదు. 'ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా ' అని వాడెవడో ఒక కవి పాడి పోయాడు. మరో వాడు నీ చెవులు మూసుకున్నాయా అని పాడి పోతాడు అంతే గదా ' చెప్పింది ఐడియా ల రాణి హృదయేశ్వరి.

'ఆ ! ఇదీ మంచి ఆలోచనే ' స్వామీ వారు కొంత సమాధానపడి నిద్దురలోకి జారుకున్నారు.

అమ్మవారు స్వామీ వారి కాళ్ళు మెల్లిగా వత్తుతూ తానూ నిద్దురలోకి జారుకుంది.

చీర్స్
జిలేబి.

Saturday, April 14, 2012

బుజ్జి పండు తెలుగు చదువు - శ్రీ భాస్కర విజయం - 2

హంగేరీ - బుదాపెస్ట్ మహానగరం.
బుదా, పెస్ట్ రెండు నదుల మధ్య ఐరోపా లో సుందరమైన నగరం గా పేరు గాంచినది.
మే నెల వచ్చేస్తోంది. చలి కాలం పోయి, వాసంతం వచ్చి, సూరీడు కిరణాలు వేడిని చలి కి వెచ్చ గా ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది.

హంగేరియన్ ఆయుర్వేద ఫౌండేషన్ ఆఫీసు సెమినార్ హాల్ ముందు  ఫోక్స్ వాగన్ బీటల్ కారు ఆగింది.


సెమినార్ హాల్ ముందు వేచి ఉన్న హంగేరియన్ ఆయుర్వేదా ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ గేబై కారు నించి దిగుతున్న శ్రీ భాస్కర శర్మ గారి కి స్వాగతం పలుకుతూ నమస్తే శర్మాజీ అన్నాడు రెండు చేతులూ జోడించి, "మంచి వేళ ఇవ్వాళ ! ఎప్పుడూ మా దేశం లో కరెంటు పోదు. అయితే ఇవ్వాళ కరంటు పోయింది ఇక్కడ ! ఇవ్వాల్టి కార్యక్రమం ఎలాగబ్బా అని ఆలోచిస్తూంటే, మీ రలా రావడం, కరెంటూ ఒక్క రెండు నిమిషాల ముందే రావడం అంతా సవ్యం గా కానవస్తోంది నాకు " అన్నాడు.


పంతొమ్మిదివందల ముప్పై ప్రాంతాలలో ప్రారంభించ బడ్డ ఫౌండేషన్ హంగేరీ లో చాలా మంచి పేరుని గాంచింది. ధీటైన రిసెర్చ్ సెంటర్ గా మారిన ఫౌండేషన్ ఆయుర్వేద రిసెర్చ్ లో ప్రముఖ స్థానాన్ని వహించడం ఆ దేశం వారి కృషికి నిదర్శనం.


ఆయుర్వేద ఏ ఒక్క జాతి కో మతానికో చెందినది కాదు. ఐదు వేల సంవత్సరాల పై బడ్డ మానవ మేధో సంపత్తి అది. అట్లాంటి ఆయుర్వేద తా పుట్టిన దేశం లో అల్లోపతీ సుడిగుండం లో కొట్టుకు పోతూంటే , ఐరోపా లో పునరుద్ధరణ కి సంసద్ధ మవు తోంది.


సెమినారు హాలు లో చిర్రావూరి దీక్షితులు గారిని పరిచయం చేస్తూ , గాబై మాట్లాడాడు. శ్రీ శర్మ గారిని ప్రస్తుతిస్తూ వారు రాసిన 'పరహిత వైద్యం' గురించిన విషయాలను ఉటంకించాడు. 


ఆ పై శర్మ గారు గాబై ఆహ్వానంతో ఆ నాటి అతిధి ఉపన్యాసాన్ని మొదలెట్టేరు.


"సభకు నమస్సులు. మీ ఫౌండేషన్ పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతం లో ప్రారంభింప బడ్డది. మా నాన్న గారు పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతాలలో ఈ పరహిత వైద్యం చేసేవారు " చెప్పారాయన .


ఫౌండేషన్ చప్పట్లు చరిచింది. హంగేరీ వాసులకు సారూప్యతలు నచ్చుతాయి. అంతే గాక ఈ సారూప్యతలకి ఖచ్చితం గా
ఒక లింకు ఎక్కడో అక్కడ ఉండే ఉంటుందని వారి నమ్మకం. 


పరహిత వైద్య విధానం దక్షిణ భారత ఆయుర్వేద వైద్య విధానం. ఈ విధానం పేరుకు తగ్గట్టు పరుల హితం కోరి చేసేది. ఇందులో స్వలాభోపేక్ష కి తావు లేదు. ఈ వైద్య విధానాన్ని స్వీకరించేవారు నియమ నిబద్ధతలకి కట్టు బడి ఉండే వారు. లోకాః సమస్తాః సుఖినో భవంతు అన్నది వేద వాక్కు. శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే అంటుంది వేదం. అంటే సర్వ జంతు జాలాలు శాంతి గా ఉండాలి. ఒక్క మానవ మాత్రుడు మాత్రం ఆరోగ్యం గా సంతుష్టుడై ఉంటే చాలదు. సర్వ జంతు జాలాలు కూడాను.
 
ఆయుర్వేద మానవులకూ, సర్వ జంతు జాలాలకు సంబంధించింది. నా వర కైతే నేను గమనించింది మా తండ్రి వారి గురించి విని ఉన్న పరహిత వైద్యం. " శర్మ గారు తేట తెల్లమయ్యే లా సవివరం గా చెప్పు కొచ్చేరు పరహిత వైద్యం గురించి.
 
వారి ఒక గంట పాటి ప్రసంగం అలా అలవోకగా గోదావరీ పరవళ్ళు లా బుడా నదీ ప్రాంతం లో సాగి పోయింది. ఫౌండేషన్ అతిధులు శర్మ గారి వాక్ ప్రవాహానికి మంత్ర ముగ్దులై అలా వింటూ ఉండి పోయారు.
 
ఆ పై ప్రశ్నల పర్వం మొదలయ్యింది
 
"శర్మ గారు, ఇంత మంచి వైద్య విధానం అలా ఒక తరం తో ఆగి పోవటం పాశ్చ్యాత వైద్య విధానం మీ దేశం లో త్వరిత గతిన పెంపొందడ మే నంటారా ?"
 
అది ఒక కారణం. ఆ పై ఈ వైద్య విధానం కాలగతిన తరువాయి తరానికి పట్టక పోవడం కూడా మరో కారణం. ఉదాహరణ కి మా తండ్రి తరువాయి నాకు ఆ భాగ్యం దక్క లేదు "
 
"భారద్దేశానికి ఈ కర్మ సిద్ధాంతమే, భాగ్యం , అభాగ్యం మీద నమ్మకాలే ఒక నెగటివ్ పాయింట్ అనిపిస్తుంది మాకు " మరో మెంబర్ చెప్పాడు.
 
"కావచ్చు. ప్రయత్నే ఫలే . కష్టే ఫలే. కాని మరో కోణం నించి ఆలోచిస్తే జన సాంద్రత కి ఈ కర్మ సిద్ధాంతమే ఓ పాటి మనః శాంతి ని కలిగిస్తూ, దేశం నానా విధాలా అసంతృప్తి కి లోను కాకుండా కాపాడుతోందని అనిపిస్తుంది కూడాను. ధర్మ మైన సంకల్పం, ధృడంగా అమ్మమీద భారం వేసి, కార్యక్రమం నడిపిస్తే అంతా సవ్యమే, అప సవ్యం సమస్య లేదు. అదే నా అనుభవం" చెప్పారు శర్మ గారు.
 
"ఈ దైవ నమ్మకం ఐరోపా లో తిరోగమన వాదం గా పరిగణింప బడుతోంది " మరో మెంబెర్ చెప్పాడు.
 
"కావచ్చు. మన కన్నా పై నొక శక్తి లేక డిఫరెంట్ డైమెన్షన్ అన్నది ఉన్నది అన్నది వాస్తవం. ఆ మరో కోణాన్ని తమ 'దృష్టి ' తో చూసిన వారు ఋషులు. అందుకే వారు 'దీర్ఘ దర్శులు'. ఆ దీర్ఘ దర్శులు గాంచినదే , తమ మేధో సంపత్తి తో గాంచినదే ఆయుర్వేదం. అంటే వారు వేరే డైమెన్షన్ లో దృష్టి ని సారించి, ఈ వైద్య విధానాన్ని కనుక్కోవడం అంటూ జరుగుతూంది. ఇది ఈ ఒక్క శాస్త్రానికి మాత్రమె సంబంధించినది కాదు. మీరు ఇప్పుడు వస్తున్న ప్రతి 'ఇన్నోవేషన్' వెనుకా దీని మూల భూతులైన వారు తమ పరిధి ని దాటి మేధస్సును ఉపయోగించడం తో టే గదా ఈ సరికొత్త సాధనాలు పరికరాలు మనకు లభిస్తున్నాయి "
 
ఆ నాటి సభా కార్యక్రమం ముగింపు కొచ్చింది. మెంబెర్స్  జోహారు లందించారు శర్మ గారి సంభాషణ కి.
 
గాబై సంతృప్తి గా చూసాడు శర్మ గారి వైపు "మీరు అప్పుడప్పడు మా మెంబెర్స్ ని అడ్రస్ చేస్తూ ఉండాలి' చెప్పాడాయన.
 
"అమ్మ దయ ఉంటే నిరభ్యంతరం గా అలాగే " చెప్పారు శర్మ గారు.
 
గాబై విచిత్రం గా చూసాడు శర్మ గారి వైపు. ఇన్ని సంవత్సరాలు గా భారద్దేశ వైద్య విధానాన్ని గమనిస్తూన్నా కూడా, ఈ దైవ చింతన ఈ దేశ ప్రజలలో ప్రతి విషయం లో అంతర్లీన మై వుండడం వారికి ఎప్పటికి అర్థం కాని విషయం !
 
(ఇంకా ఉంది)

Friday, April 13, 2012

బ్లాగులోళ్ళు వెర్సస్ కామెంటర్లు అసమానత్వం ముర్దాబాద్ !

కొన్ని కొన్ని బ్లాగులోళ్ళ కామెంటు బాక్సు ముందర కొన్ని విచిత్రమైన గొంతెమ్మ కోరికల్లాంటి నోటీసులు కనిపిస్తాయి.

కామెంట్లు తెలుగు లో ఏడవక పోతే మీ కామెంట్లు డెలీట్ !
మీకు ప్రొఫైల్ లేదా అయితే డెలీట్
మీరు టపాకి దూరం గా కామెంటు కొట్టారా డెలీట్ !
మీ కామెంటు నాకు నచ్చ లేదా డెలీట్
మీ సెక్సు చెప్పరా ! అయితే డెలీట్ !


ఇత్యాది అన్న మాట

ఇట్లాంటి సౌకర్యాలు కామెంట్లు రాసేవారికి అస్సలు లేవు.

టపా నచ్చ లేదా ఓ డెలీట్ కొట్టే సదుపాయం అస్సలు గూగులోడు కామెంటర్ల కి ఇవ్వలే ! అట్లా ఓ పది మంది కామెంటర్లు డెలీట్ కొడితే టపా హుష్ కాకి అయి పోవాలి. ఇట్లాంటి సౌకర్యాలు కామెంటర్ల కి లేక పోయెనే !

ఎంత అసమానత్వం !

అంతా సమనానమే అంటారు. మరి కామెంటర్ల పట్ల  ఎందు కింత వివక్ష !

బ్లాగులోళ్ళు వెర్సస్ కామెంటర్లు అసమానత్వం ముర్దాబాద్ !


చీర్స్
జిలేబి.

Thursday, April 12, 2012

జిలేబీ కి తాకీదు వచ్చేసిందోచ్ !

క్రితం ఏడాది జిలేబీ కి ఉద్యోగ పర్వం నించి టాటా చెప్పెయ్యడం తో , ఏమీ పాలు పోక కాలు గాలిన పిల్లిలా ఇంట్లో తిరుగుతూ ఉంటే, జంబూ వారు, 'ఇదిగో జిలేబీ ! అలా ఊరికే కూర్చోక, కాస్తా వంటా వార్పూ చూడరాదు ?' అంటూ అన్నేళ్ళు రాజ్యమేలిన వంట గదిని జిలేబీ తల మీద ధామ్మని పడేసేరు.

చ, చ, అసలు పని లేకుంటే, అందరికీ లోకువే సుమా అనుకుని సరే పోనీ మన జంబూ వారే కదా , ఇన్నేళ్ళు వంటా వార్పు చూసేరు. ఇక ఎట్లా ఉద్యోగం retire అయిపోయాం కాబట్టి, ఈ కొత్త ఉద్యోగం లో retyre అయి పోదామని ఒప్పేసు కున్నా !

వంటా వార్పూ అంత సులభమైన విషయం కాదు సుమా అని అప్పుడే అర్థం అయ్యింది. ! చాన్నాళ్ళ బట్టి అసలు వంట గది వైపు రాక పోవడం తో , వంట ఎలా చెయ్యాలో అస్సలు మర్చి పొతే, 'పోనీ లే జిలేబీ' ఆ లాప్టాప్ పెట్టేసుకుని ఆన్ లైన్ లో నేర్చేసుకో అని అయ్యరు వారు ఓ ఉచిత సలహా పడేసేరు.

దాంతో బాటే, అప్పటి దాకా ఎప్పుడో ఒక్క మారు టపా రాసుకుంటూ ఉన్న బ్లాగ్ లోకం లో కూడా జబర్దస్తీ గా జొరబడి , టాట్, ఇక మీదట డైలీ రాయాలి సుమా అని, అలా ఓ వైపు వంట కార్య క్రమమును మరో వైపు బ్లాగ్ టపా వంట కార్య క్రమాన్ని రెండు చేతుల మీదుగా సాగించడం జరిగింది.


ఖుషీ ఖుషీ గా నవ్వుతూ, చలాకీ చలాకీ లా కామెంట్లు కొడుతూ తీరిగ్గా కాలం గడి పేస్తూంటే, ఆ మధ్య లో మన మోహనుల వారి నించి ఓ కబురందింది

'జిలేబీ , నీకు రిటైర్మెంట్ ఇవ్వడం మా బుద్ధి తక్కువ. నీ వెళ్ళాక, వనారణ్యాలకి కష్ట కాలా లోచ్చెసేయి, అదీ గాక, నీకు రిటైర్ మెంటు ఇవ్వడం, తెలుగు బ్లాగ్ లోకానికి తల నొప్పి అయి పోవడం జరిగింది, నీ రాతలతో . కాబట్టి, నీ రిటైర్ మెంటు కాన్సిల్. వెంటనే నువ్వు జాబ్ లోకి చేరి పో' అని తాకీదు వచ్చేసింది!

చ, చ, జనాలు హ్యాపీ గా ఉండ నివ్వరు సుమా ! తీరిగ్గా, టపాలు రాస్తూ కూర్చుంటాం అంటే వద్దంటారు. సరే ఉద్యోగం లో ఉంటా నంటే, నీకు ఏజ్ అయి పోయింది, యు ఆర్ డిస్మిస్' అంటారు సుమీ అనకున్నా.

'అయ్యరు గారు మీ సలహా ఏమిటీ ' అడిగా.

'ఇదిగో జిలేబీ,  నీ చేతి వంట నాకు దక్కే యోగం లేదన్న మాట ఎప్పటికి ' అన్నారు వారు.

అర్థం అయి పోయింది వారికి కూడాను. సలహా ఏమిటీ అని జిలేబీ అడిగింది గాని, ఆ సలహా పాటిస్తుందా అన్నది సందేహం సుమా ఈవిడ అని !

సో, బ్లాగ్ బాంధవులారా, ఇంతటి తో మీకందరికి బాయ్ బాయ్! టాటా వీడుకోలు !

అప్పుడప్పుడు,వనారణ్యాల లోంచి బయట పడితే, గిడితే, జనారణ్యాలకి వస్తే, గిస్తే, నెట్టారణ్యాలు లభ్య మయితే, మళ్ళీ మీకు ఈ జిలేబీ టపా శిరో వేదనలు తప్పవు.

అప్పటి దాకా, బాయ్ బాయ్ టాటా వీడుకోలు.

చీర్స్
జిలేబి

(పీ ఎస్: ఇది 'తూచ్' టపా !, వీలైనప్పుడు, అప్పుడప్పుడు మళ్ళీ పునర్దర్శనం !)

చీర్స్
జిలేబి
IFS (Retyred)-Indian Fun Service Retyred!

Saturday, April 7, 2012

ఇచ్చట చచ్చి నోళ్ళ జాతకం చూడబడును !


ఇచ్చట టింకరింగ్ చెయ్య బడును 
ఇచ్చట కుట్టు లు, టైలరింగు చెయ్య బడును !ఇచ్చట చచ్చి నోళ్ళ జాతకం చూడబడును ఇచ్చట మొబైలు రిపైరు చెయ్య బడును
ఇచ్చట సైకిలు ట్యూబ్ కు పంక్చరు వేయ బడును

బోర్డు చూసి లోపలి కి కాలు పెట్టాడు అప్పా రావు.


మహార్జ్యోతిష్ శర్మ గారు తలెత్తి చూసారు


ఏమోయ్ ?


మా అయ్య చాలా సీరియస్ గా ఉన్నారయ్యా ! కాస్త జ్యోస్యం చూద్దురు, వారి కి ?


ఇదిగోనోయ్ బోర్డు చూసావుగా , ఇక్కడ చచ్చి నోళ్ళ జాతకం మాత్రమె చూడ బడును


బతికున్నోళ్ళకి చూడ రాండీ ?


కుదరదోయ్


ఓ పదిహేను రోజులు గడిచాయి . అప్పారావు అయ్య మధ్యలో కాలం చెల్లి పైకి పోయాడు. అప్పా రావు శుభం తరువాయి మహార్జ్యోతిష్ శర్మ గారి దగ్గరకు వచ్చాడు.


ఏమోయ్ మళ్ళీ వచ్చావ్ ?


మా అయ్య పోయాడండీ ! జాతకం తెచ్చాను చూద్దురూ.


శర్మ గారు జాతకం చూసారు.


మహార్జాతకమోయ్  ! మొన్న రామనవమి కి వైకుంటం చేరి ఉండాలే !


అయ్యా ! మీరు మనుషులు కానే కారండీ !


శర్మ గారు తీరిగ్గా జాతకాన్ని విశ్లేషించి అప్పా రావు అయ్య జాతకాన్ని చీల్చి చెండాడి , 'మీ అయ్య ఓ పుణ్యా త్ము డోయ్ అని జోస్యం చెప్పారు !


అప్పారావు సంతోషానికి అవధుల్లేవు.


మా అయ్య అంత గోప్పోడాండీ !


అవునోయ్ !


'ఇది ఉంచండి ' అప్పారావు ఖుషీ గా శర్మ గారి ముందు ఓ పుర్రె నుంచాడు


ఏమోయ్ ఇది ?


నా తరపున కానుక అండి మా అయ్యది


చీర్స్
జిలేబి.

Friday, April 6, 2012

కనిపించిన మేఘం


ఒక మేఘం కనిపించింది
గాలి వీచింది
మేఘం సాగి పోయింది

ఒక మేఘం కనిపించింది
సూరీడు సిగ్గు పడ్డాడు
మేఘం బోరు మన్నది

ఒక మేఘం కనిపించింది
చిన్ని పాప నవ్వింది
మేఘం రాగమయ్యింది

ఒక మేఘం కనిపించింది
తాత బోసి నవ్వు నవ్వాడు
మేఘం తుర్రు మన్నది

చీర్స్
జిలేబి.