మేం వయసు కొచ్చేసాం!
అదేమిటండీ, ఏ స్వీట్ సిక్స్టీన్ లోనో, కాకుంటే, టీన్ అటారః లో నో చెప్పాల్సిన మాట ఇట్లా రిటైర్మెంటు ఏజు లో చెబ్తున్నారు ?
అవునండీ, మరి, వయసు కొచ్చాం అంటే, ఏ వయసుకు అని అడగకుండా, మీరే అట్లా ఊహించు కుంటే ఎలా మరి !
ఇంతకీ ఏ వయసు కొచ్చారు?
మతిమరపు వయసు కొచ్చామండీ మరి !
అదేమిటండీ ??
అంతే కదండీ మరి, నిన్న మా జంబునాధన్ అయ్యరు గారి తో బజారు కెళ్ళి వారిని మధ్య దారిలో మరిచి ఇంటికి వచ్చాక,
'అయ్యోరామా, అయ్యరు గారు ఏమయ్యారు చెప్మా బామ్మా అంటే,
'ఔరా, వీర్ని మరిచి పోయామే ఎట్లా మరి అని వయసు కోచ్చేసాం అని తీర్మానించు కునేసా ! అదన్న మాట విషయం.
'జాంబజారు జగ్గు నా సైదా పెట్టై కొక్కు ' అని అరవం లో ఒక (మా) పాత కాలపు పాట ఉందండోయ్ !
అదేమిటండీ, పాత కాలపు పాటల్ని గుర్తుకు పెట్టుకున్నారు.
(ఈ మాట అంటే, శ్యామలీయం వారు, అదీ సరిగ్గా గుర్తుకు పెట్టు కోలేదు సుమీ అంటారేమో మరి !- రుస రుస బుస బుస గుండమ్మ కథ లోనిది అని చెప్పినట్టు!) ,
మరి మీ ఈ కాలపు అయ్యరు గారిని మరిచి పోయారు సుమీ అంటారా ?
మరి ఈ 'మతిమరుపు' వయసు కొచ్చాం కాబట్టి, ఈ వయసు జాడ్యం కూడా ఇది మరి, పాతవన్నీ టపీ టపీ మని గుర్తు కోచ్చేస్తాయ్,
ప్రతి దానికీ, 'మా చిన్నప్పు డండీ అని మొదలెడతాం చూడండీ ,
కాకుంటే, మేం చదువుకునే రోజులల్లో అంటూ కథలు చెప్పడం మొదలెడతాం చూడండీ అప్పుడే తెలిసి పోతుంది మరి, మేం వయసు కొచ్చేసామని !
మా కాలం లో నండీ మరి ......
మిస్సమ్మ అనే చిత్రం లో 'పల్లెకు పోదాం, పారు ని చూద్దాం' అని ఓ బ్రహ్మాండమైన హిట్ సాంగ్ వుండే దండీ! ....
చీర్స్
జీరింగ్లీ జిలేబి.