నేనెందుకు రాస్తున్నాను ?
ఈ ప్రశ్న అడిగితే, టపీ మని ఇవ్వగలిగే సమాధానం - మా ఖర్మ కాలిన కొద్దీ అని వేడిగా, వాడిగా చెప్పేస్తారు మా అయ్యరు గారైతే.
ఇంతకీ అప్పుడప్పుడు ఇట్లాంటి మనో ప్రేరిత సంక్లిష్ట అసమాధాన ప్రశ్నలు ఎందుకు ఉదయిస్తాయి చెప్మా అని ఆలోచిస్తే, అప్పుడప్పుడు అనిపిస్తుంది, అసలు మన రాతల వల్ల బాగు పడ్డ వాళ్లె వారైనా ఉన్నారా అని.
రాతల్ చదివి తలరాతల్ మారుతాయా అని అడిగితే, తప్పక ఉంటుందను కుంటాను. ఉదాహరణ కి స్వామీ వివేకానంద వారి సంభాషణలు, పుస్తక రూపేణా చదివి ఎంత మంది ఉత్తెజితులవటం లేదు ఇప్పుడు కూడా?
అంటే ఈ రాతలు మనస్సు అట్టడుగు పొరల్లో నించి, వస్తే వాటికి ఆకర్షింప బడే వాళ్ళు ఖచ్చితం గా ఉంటారని పిస్తుంది.
సో, మన మనస్సులో జరిగే సంఘర్షణ లకి మరో వ్యక్తీ వాక్కులో, లేక రాతల లో వాటి ప్రతిధ్వని వినిపిస్తే వాటికి మనం ఆకర్షితులవుతామని అనుకోవచ్చా?
ఈ ఆలోచనని ఇంకొంచం పొడిగిస్తే, ఐరన్ ఫైలింగ్స్ కి అయస్కాంతం, అయస్కాంతానికి ఐరన్ ఫైలింగ్స్ ఒకటి కి మరొకటి సహాయ కారి లా ఉన్నట్టు భావ సారూప్యం కలవిగా ఉన్నట్టు ఉన్న రెండు మనస్సుల కలయిక ఐన రాతలు వాక్కులు దగ్గిరైనప్పుడు వాటికి మధ్య ఓ అవినాభావ సంబంధం కలిగేటట్టు అనిపిస్తుంది.
అబ్బా , నేను కూడా ఓ థీసిస్ ప్రతిపాదించేసా !
చీర్స్
జిలేబి
తిరగేస్తే 'బీ లేజీ' !