Friday, February 24, 2012

'రచన' శాయి గారి కి విన్నపాలు (బాపురే రమణీయం !)

అయ్యా రచన శాయి గారు,

మొదట గా , ముళ్ళపూడి వారికి నమస్సులు. ఆ పై బాపు గారి కి జేజేలు. ఆ పై శ్రీ రామ రాజ్యం తీసి సాధించి శతమానం భవమై భవ్యమైన శ్రీ సాయి బాబా గారికి అభినందనలు.

ఆ పై మీరు శ్రీ రామ రాజ్యం చిత్ర ముళ్ళపూడి వారి కథన  కౌశల్యాన్ని, వారి వర్ధంతి సందర్భం గా , శ్రీ రామరాజ్యం శత 'షాట్' దినోత్శవాలని పురస్కరించుకుని , పుస్తక రూపేణా తీసుకు వస్తున్నారని మా మనసులో మాట సుజాత గారు టపాకట్టి మమ్ముల నందరిని ఆనంద డోలాయమానం లో స్వాప్న జగత్తులో కి తీసుకు పోయారు , ఆ పుస్తకం ఖరీదు గురించిన వివరణ తక్కువగా ఇచ్చి!

ఆ పై మేము ( నేను కూడా ఓ మోస్తరు గెస్సు చేసి) గెస్సు చేసి వంద రూపాయలనించి ఐదు వందల దాకా ఉండ వచ్చని ఊహల కోతలు (కోటలు) కట్టినాము !

ఆ పై తెలియ వచ్చినది ఏమనగా ఆ పుస్తక ధర ఎనిమిది వందల రూపాయల్ పై 'సిల్కు ' అని !

అయ్యా,

బ్లాగ్ లోకం లో ఎ చిత్రం పై కూడా కట్టనన్ని టపాలు శ్రీ రామ రాజ్యం పై కట్టినాము. బాగుంది అని భేషో అని, 'నయన తారా నందం , బాపురే రమణీయం శ్రీ రామ రాజ్యం అని వందల పేజీ ల కొలది రి వ్యూ లు రాసినాము.

చిత్రం చెత్త అని అన్న వాళ్ళ జుట్టు పట్టుకుని కామెంట్లతో కొట్లాడినాము. బాగుంది అన్న వాళ్ళ తో జగడం పెట్టుకుని ఎం బాగు ఎం బాగు అని లెఫ్టు సెంటరు రైటు గా చిత్రం గురించి సమీక్షలు రాసినాము. !

ఇట్లా ఎన్నో విధాలు గా ఈ చిత్రం గురించి బ్లాగ్ చిత్రాలు తీసినాము.

కావున అయ్యా మీరు, దయ తలచి, ఈ బ్లాగ్ లోకం లో ఈ చిత్రం గురించి బ్లాగు  కట్టి టపా లు  పెట్టి  కామెంటు చెండ్ల తో కొట్టిన వాళ్లందరికీ డిస్కౌంటు యాభై శాతం ఇవ్వ వలె నని ఇదే జిలేబీ విన్నపము ! 

(జిలేబీ కీ వంద శాతం డిస్కౌంటు ఇవ్వ వలె - ఎందు కంటే జిలేబీ రెండు మార్లు టపా పెట్టె ! అదిన్నూ చిత్రం చూడ కుండానే !)


విన్నపాలు విన వలెను వింత వింత లు !
ఫాన్ బ్లాగు టపా రాసిన వారికి డిస్కౌంటు ఈయవయ్యా !!!

ముళ్ళ పూడి వారిని పై లోకం అట్టే పెట్టుకుని తమ హాస్య సరదాలని తీర్చేసుకుంటున్న త్రిమూర్తుల్లారా , వెంటనే ముళ్ళ పూడి వారిని భువికి వదలండి !!! 

నయనతారానందం బాపురే రమణీయం శ్రీ రామరాజ్యానికి శత వందనాలతో !

యనతారానందం

భూనభో బాలకృష్ణ నాగేశ్వరుల

తో బాపు రమణీయ

వ్య దృశ్య కావ్యం

వ్య ఇళయ హంగేరీయం, జొన్నవిత్తుల

విరచిత గీతాలాస్యం, సాయి సినీ లోక భవి

ష్యత్తు వెలుగుల లో ప్ర

తిష్టాపితం
రచన శాయి ముళ్ళపూడి పుస్తకం
బాపు రే రమణీయం - శ్రీ రామ రాజ్యం !

చీర్స్
జిలేబి.

28 comments:

 1. జిలేబి గారు,

  నాకున్న కొన్ని సందేహాలు.

  అసలు ఏ పుస్తకానికయినా రిబేటు ఎందుకివ్వాలి?

  తెలుగులో పుస్తక ప్రచురణ కష్టమైపోతుంది. విశాలాంధ్ర లాంటి వాళ్ళు కూడా యాభై పెర్సెంట్ ఉంటే కానీ ఏ పుస్తకాన్నీ తీసుకోవట్లేదు.

  మన అభిమాన రచయిత పుస్తకాన్ని కొనడానికి రేటు గూర్చి ఆలోచించకూడదేమో!

  నచ్చిన పుస్తకాన్ని పూర్తి రేటుతో (మధ్య దళారీలు లేకుండా) కొనుక్కోవడం నాకిష్టం.

  బాపు బొమ్మలు ఉంటాయి కాబట్టి.. సహజంగానే ప్రచురణ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పుస్తక విలువ కూడా ఎక్కువగా ఉంటుంది. ఉండాలి కూడా.

  ఈ మధ్య కొన్ని పుస్తక ప్రచురణలకి పబ్లిషర్స్ ముందుగానే.. పుస్తకాల షాపు వాళ్ళ discount మినహాయించి.. నేరుగా కాపీని రిజర్వ్ చేసుకునే పద్ధతి కూడా తెచ్చారు. మరి సాయిగారు ఈ సౌలభ్యం కల్పించారో, లేదో తెలీదు. ఈ పుస్తకానికి ఓవర్సీస్ మార్కెట్ బాగా ఉంటుందని ఊహిస్తున్నాను.

  ఒక మంచి పుస్తకం కొనడానికి రేటు గూర్చి ఆలోచన అనవసరం. ఒకప్పుడు శ్రీశ్రీ తన 'మహాప్రస్థానం' ముద్రాపకుని కోసం దశాబ్దం పాటు తిరిగాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా!

  ReplyDelete
 2. కం. చూడకనే పొగడుటయును
  చూడకనే తెగడు టనెడు చోద్యములనగా
  నేడుకదా కనిపించెను
  వాడలవాడలను బాపు వలన జిలేబీ

  కం. నాజూకుగ నను దిట్టిన
  నా జుట్టును బట్టుకొన్న నచ్చని దానిన్
  తేజోమయమని పొగడుట
  నా జన్మకు వీలుపడదు నమ్ము జిలేబీ

  కం. నా కేమో లవకుశ యును
  మీకు శ్రీరామరాజ్యమే హితమగుచో
  నా కెనిమిది వందలు పొదు
  పై కనుబడు చుండె నేటి వరకు జిలేబీ

  ReplyDelete
 3. నేను ముందు రాసిన కామెంట్ మరీ సీరియస్ గా.. జిలేబి గారి టపా స్పూర్తికి విరుద్ధంగా ఉంది. కాబట్టి.. ఆ కామెంట్ తూఛ్!

  జిలేబి గారికి నూరు శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నేను కూడా శాయి గారికి ప్రపోజ్ చేస్తున్నాను.

  ReplyDelete
 4. ఇదేంటి రమణ గారూ ఇలా తూచ్ అనేశారూ? జిలేబీ గారు టపా స్ఫూర్తికి విరుద్ధంగా ఉండే కామెంట్స్ ప్రచురించబడవు అన్లేదుగా!కాబట్టి మొదటి కామెంట్ మీదే ఉండండి!

  జిలేబీ గారూ, బాగు బాగు! ఆ లెక్కన నాకు ఊరికే రెండు కాపీలివ్వాలని నేనూ డిమాండ్ చేస్తానుండండి శాయి గారిని! నిన్న సాయంత్రమే మాట్లాడాను. ఈ రోజు పంపుతాన్నారు నా పుస్తకాలు. ఇలాంటి డిమాండ్స్ చెయ్యొచ్చని మీరు ఖాస్త ముందుగా అయిడియా ఇచ్చుంటే డబ్బు పంపేదాన్నే కాదు! హు!

  (శాయి గారు ఎవరికీ ఊరికే కాపీలు ఇవ్వరూ, తను ఊరికే తీసుకోరూ! బ్లాగు పుస్తకం రెండు కాపీలకు డబ్బులు పంపి తీసుకున్నారు మా వద్ద :-) )

  ReplyDelete
 5. హమ్మో 800రూపాయల పై సిల్కా? ఏం చేస్తాం మాలాంటి వాళ్ళు అలా చూస్తూ ఉండవల్సిందే.. లేదా కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఎవరి దగ్గరైనా కొట్టేయవల్సిందే ;)

  ReplyDelete
 6. అడ్డెడ్డే నేనూ ఒక పోస్ట్ వెయ్యకపోతినే !

  ReplyDelete
 7. ఏమిటి? సుజాత గారు టపా కట్టారా?
  ఎంత మాట అన్నారండి?

  ReplyDelete
 8. తొలివిడతవి అన్నీ చెల్లిపోయాయట!
  మలివిడతకు డబ్బు పంపమని అంటున్నారు!
  అలాంటప్పుడు డిస్కౌంటు ఇస్తారా అని!

  ReplyDelete
 9. హ హా జిలేబి...గారి...చమత్కారం బాగుంది.
  ఏంటీ సినిమా చూడకుండానే రెండు టపాలు పెట్టారా?
  అయితే మీకు డబ్ల్ రేటుకి బుక్కమ్మి చూసి టపా పెట్టిన మాకు (http://chinniaasa.blogspot.com/2011/11/blog-post_20.html) యాభై శాతం డిస్కౌంట్ ఇవ్వాలి ... ;)

  ReplyDelete
 10. హ హ జిలేబిగారూ చిత్రం చూడకుండానే రెండు సార్లు టపాలు పెట్టారా...అయితే మీకు రెండు పుస్తకాలు ఉచితంగా ఇవ్వాల్సి౦దే.

  ReplyDelete
 11. నేను సినిమా చూడనేలేదు ప్చ్

  ReplyDelete
 12. దెబ్బలాడనంటే, నిర్మొహమాటంగా నా అభిప్రాయం...

  ఐతిహాసిక పాత్రలు వేసే వారికి ఒక చరిత్ర అంటూ ఉండాలి. ఎవరితో పడితే వారితో వేషాలు వేయించి - సాంకేతిక పరంగా ఎంత బాగా తీసినా, ఆ ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరే! Casting అంత 'ఇది'గా ఉన్నదంటే, పుస్తకం ధర ౮౦౦ సబబే కదా!

  ReplyDelete
 13. ఈ వేళ బ్లాగు లోకం నిస్సారంగా ఉంది.

  ReplyDelete
 14. @డాక్టరు రమణ గారు,

  చాలా బాగా చెప్పారు!

  ఏదో నండీ, కొంత అడిగి చూస్తే ఏమన్నా గిట్టు బాటు అవుతుందేమో నని ఒక 'రాయి' వేసి చూస్తున్నా! ఫ్రీ గా వస్తే పుస్తకం చదువుదామని !!

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 15. @కష్టే ఫలే శర్మ గారు,

  వచ్చే వచ్చే సారం ! నిస్సారం గాలికి ఎగిరి పోయే!! గుడ్డు ప్రపోజాల్ అని సిఫార్సు చేసినందులకు నెనర్లు ! చూద్దాం ఏమైనా ముఫత్ మే మిలేగా అని !!

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 16. @శ్యామలీయం మాష్టారు,

  ఆ జిలేబీయానికి నెనర్లు.

  ఒక వైపు నేను చిత్రం చూడ కుండానే ఆ హా ఓ హో అని పొగిడేస్తున్నా! మరో వైపు మీరు చూడనే చూడనని ట్రైలర్ లో నే తెలవారి పోతోంది కథా కమామీషు అంటున్నారు ! ఏమైనా ఒకరికి ఒకరం తీసి పోనీ వారమండీ !!

  జిలేబీ శతకా పూర్తి కి అతి శీఘ్రం గా సమీపిస్తున్నట్టున్నారు !

  ధన్యవాదాలు !!

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 17. సుజాత గారు,

  డాక్టరు రమణ గారు తూచ్ అని మళ్ళీ 'పన్' దోవలోకే వచ్చేసారు !

  ఇక మీ టపా కోసం వైటింగ్ ! మీరు ఒక టపా 'కట్టి' నారంటే దాన్నించి కొంత 'టపా' చౌర్యం చేసి నేనూ ఒక టపా 'కట్టేస్తాను ' వావ్, వాట్ ఏ బుక్ అని !! (ఎట్లాగు ఫ్రీ గా వచ్చేటట్టు కనిపించడం లేదు మరి !)  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 18. సుభ గారు,

  మంచి మాట చెప్పారు! నేను సుజాత గారి దగ్గర కొట్టే ద్దామను కుంటున్నాను !

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 19. @లలిత గారు,

  ఇప్పటి దాకా టపా 'కట్టిన' వాళ్లకి మాత్రమే నండోయ్ రిబేటు అడిగింది.! ఇక మీదట టపా 'కట్టె' వాళ్లకు ఓ పాతిక శాతం అడుగుదాం!!

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 20. @బోనగిరి గారు,

  మీకోసం మరిన్ని 'కామెంటు' లు 'కట్టే సానండోయ్!! కాబట్టి ఈ కట్టు పడికట్టు మణికట్టు మా గట్టి కట్టు !!

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 21. @చిన్ని ఆశ గారు,

  మీ టపా అమోఘం ! దానికి శాయి వారు నిజంగా నే ఉచితం గా పుస్తకం ఇవ్వాలి నన్నడిగితే!!

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 22. @జ్యోతిర్మయీ గారు,

  ఆ హా ధన్యం! రెండు కాపీలు ఇచ్చారంటే ఒకటి మీకు ఫ్రీ గా ఇచ్చేస్తా !!

  నెనర్లు
  చీర్స్
  జిలేబి

  ReplyDelete
 23. @లక్ష్మి రాఘవ గారు,

  మంచి పని చేసారు! వెంటనే చూసి మీరు కూడా ఒక టపా పెట్టండి. చూడడం కుదరదను కుంటే, బ్లాగ్ లోకం లో చాలా సమీక్షలు వున్నాయ్ ! వాటన్నిటి ని చదివేస్తే పూర్తి సినిమా ఫ్రీ గా చూసినట్టే లెక్క! ( ఇప్పుడు అర్థమయ్యిందనుకుంటాను - నే ను ఎలా టపా లు పెడతానో అని మీకు !!)

  చీర్స్
  జిలేబి!

  ReplyDelete
 24. @తెలుగు భావాలు గారు,

  వస్తి వస్తి దేబ్బలాటకి !

  ఎంత మాట అన్నారు చరిత్ర కావాలం టారా !! ఆయ్!!!

  చారిత్రాత్మక చిత్రానికి చరిత్ర ఎందుకండీ !!!

  ఏమో తెలీదండీ, నేను చిత్రం చూడ లేదండీ !!


  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 25. జిలేబీగారూ, చారిత్రాత్మికచిత్రాన్ని తీయాలంటే చచ్చినట్లు యెంతో కొంత చరిత్ర తెలియాలండి మరి. అయితే, ఐతిహాసికచిత్రాన్ని తీయాలంటే కేవలం దమ్ముంటే సరిపోతుంది. మీకు కొంచెం పేరుప్రతిష్టలుంటే మీ రేమి తీసినా భళీ అనటానికి అభిమానులు సిధ్ధంగా ఉంటారు. ఒకవేళ ఆ దన్ను చాలదనుకుంటే, మనదేశంలో మేథావులనబడే వాళ్ళు రకరకాలవిచిత్రవాదనలతో తప్పకుండా సమర్థించటానికి ముందుకు దూకుతారు. కాబట్టి యేం భయం లేదు. ఈ వ్యవహారం సాహిత్య సినీ రంగాలకు వర్తిస్తుందని చెప్పటానికి ఉదాహరణలుగా యార్లగడ్డవారు, బాపువారు చాలు.

  ReplyDelete
 26. @శ్యామలీయం మాష్టారు,


  ఏదో నండీ, మన జమానాలో ఈ పాటి బాపూ వారైనా వున్నారు. రాబోవు తరాన్ని గురించి ఆలోచిస్తూంటే... పూరీ గుర్తుకోస్తున్నాడు !!

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 27. ఆర్య పుత్రుడినో,కృష్ణ పుత్రుడినో, పవన చిరు సోదరుడినో- రాముడిగానో, కృష్ణుడుగానో ఊహించుకుంటున్నా ఓసారి...జిలేబీ....రాబోవు తరం గురించి ఆలోచిస్తూంటే పూరీ లా పొంగలేక చపాతీ అయిపోయి ఊరుకున్నా. ఇంతకీ బేరం..అదే ప్రపోజల్ కుదిరిందా...మన్లో మన మాట..రెండొస్తే ఓటి ఇటు చపాయించండీ..ఆనక చూసుకుందారి.

  ReplyDelete