జిలేబి వారి ద్రవిడ రామాయణం 
 
 
వామ్మో సీత మండోదరి కుమార్తె యా అని దాంతో తలీ ఉంగలీ దబాయీ :) 
 
ఏమండీ ఈ కథ కు మూలం మరీ అవాల్మీకీయం గా ఉందంటే అద్భుత రామాయణం అని చెబ్తే 
 
చూద్దారి ఈ 'అద్భుత' రామాయణం అని గూగ్లించి , 
 
ఆర్కైవ్ డాట్ ఆర్గ్ లో ఓ సో కాల్డ్ సంస్కృత హింది అద్భుత (' అత్యాద్భుత :)) 
 
రామాయణాన్ని తీసి చదివితే 
 
వ్యాక్  అని వాంతి చేసు కోవాల్సి వచ్చింది !
 
కత మరీ జిలేబీయం ఇంతా అంతా కాదు నూటికి నూరు పాళ్ళు పుక్కిటి పురాణమే అన్నట్టు అనిపించింది. 
 
హమ్మయ్య ఈ రామాయణం రంగనాయకమ్మ గారి కళ్ళ బడకుండా ఉండి పోయింది కదా అని సంతోష పడి పోయా ! 
 
లేకుంటే వారి కళ్ళ బడి ఉంటే మజా యే మజా మరో దుమారం రామాయణ జిలేబి వృక్షం అని మరో పొత్తం వచ్చేసి ఉండేది :) 
 
 'గొలుసు' నవలలు  వచ్చేవి. ఓ రచయిత విడిచిన భాగాన్ని ఊహా పూర్వకం గా మరో రచయిత అందుకుని కథ సాగించడ మన్న మాట :) అట్లా అతుకుల బొంత ఈ అద్భుత రామాయణం (మధ్య లో పదకొండో సర్గ లో ఎవడో మహాను భావుడు సాంఖ్య యోగాన్ని రాములోరి చేత హనుమంతుడి కి ఉపదేశం కూడాను :))
 
అక్కడక్కడా దొరికిన పేజీ లకు ముందూ వెనుకా కథ ల గట్టి మరీ ఓ నవల రాస్తే ఎట్లా ఉంటుంది ? అలా ఉంది. 
 
ఈ సీత జన్మ వృత్తాంతం ఎనిమిదవ సర్గ లో వస్తుంది ఈ పుస్తకం లో . దానికి ముందు యేడు సర్గ లు వారెవ్వా ఏమి కథ రంజు గా కట్టే రండీ బాబోయ్ :) 
 
ఒక్క సర్గ ముందు మా నారదుల వారు , శ్రీ కృష్ణ పరమాత్ములు, రుక్మిణి, సత్యభామ జాంబవతి కూడానూ రామాయణం లో పిడకల వేట కై వస్తారు :) 
 
ఇప్పుడు వీటిని చదివేక నేను ద్రవిడ జిలేబీ రామాయణం రాద్దా మనుకుంటున్నా :) 
 
ఇప్పుడు రాబోయే కాలానికి జిలేబీ రామాయణం కత టూకీ గా :) 
 
 
(సందులో సడే మియా ద్రావిడ సీత కత తయార్ :) - ఈ రామాయణాన్ని కూడా రాబోయే కాలం లో వాల్మీకి ప్రణీత అని చెప్పేస్తారన్న ఆశయం తో :))
 
 
 
ఓ రోజు మండోదరి కళ్ళ నీళ్ళు బెట్టు కుంటూ రావణుడి దగ్గరకు వచ్చి ఫ్లాషు బ్యాకు చెబ్తుంది  -
 
స్వామీ ! మునులను జయించి , విజయసూచకముగా, వారి రక్తాని పూర్వం ఒక భాండం లో పెట్టేవు. 
 
ఆ భాండాన్ని అంతకు మునుపు వంద కొడుకులున్న కత్స్నమదుడనే బ్రాహ్మణుడు తన యిల్లాలి కోరిక యై, లక్ష్మి తన యింట పుట్టాలని కోరుకుంటూ పాలను చేరుస్తూ, ప్రార్థిస్తూ వచ్చిన భాండము. 
 
అందు మునుల రక్తముం గలిపి, యది విషమని, దానిని దాయుమని నీవు నాకిచ్చేవు. ఆ పై నువ్వు సందులో సడే మియా అన్నట్టు కన బడ్డ అప్సరసల వెంట పోయేవు. 
 
నా కపకార మొనర్చుచున్నా వనుకుని , బలవన్మరణ మందుటకై, యా భాండమందలి ద్రవమునుం ద్రావఁగా, నాకు గర్భమైనది.  నీవే మో పర కాంత ల వైపు వెళ్లి ఓ సంవత్సర మైనా యింటి పట్టున ఉండక పోతివి . ఇప్పుడు గర్భ మాయె ! యెట్లా అని చింతించి 
 
ఆ విషయమును నీకు దెలుప వెఱచి, తీర్థయాత్రలకుం బోవు నెపమున వెడలి,కురుక్షేత్రం లో గర్భ వినిష్కృత్య 
చేసు కుని అక్కడ భూమిలో పాతేసా ! 
 
 సంతాన ప్రాప్తి  కై  జనకుఁ డా భూమిని దున్నఁగా నా బాలిక పేటికనుండి లభించెను. 
 
భగవత్ప్రసాదముగా భావించి జనకుఁ డా బాలికను పెంచి పెద్దచేసెను. ఆ బాలికయే సీత.  
 
ఇప్పుడెక్కడుందో ! ఏమిటో అంటూ కళ్ళ నీళ్ళు కావేరి లా కారి పోతోంటే , రావణుడు అయినదే మో అయినది నాకు కూడా కుమార్తె లు లేరు కదా ( నాకైతే తెలియదు రావణుని కి కుమార్తె లు ఉన్నారా లేదా అని మన కత కు ఇప్పుడు కొంత స్ట్రాంగ్ పాయింట్ కావాలి కాబట్టి :)) ఈ సీత ఎక్కడుందో తెలుసుకొని రమ్మందాము  మన యింటికి తెచ్చేసు కుందాం ; మండోదరి సంతోషమే తన సంతోషం అనుకుని తన చెల్లె లైన చుప్పనాతి ని పంపిస్తాడు వెళ్లి సీత ఎక్కడుందో ఏమి చేస్తోందో కనుక్కుని రా అని. 
 
శూర్పణఖ వెళ్లి సీత ను కని బెడుతుంది దండ కారణ్యం లో. 
 
అమ్మాయ్ నీకు నేను మేనత్త వరుస నవుతా. నీ తల్లి మండోదరి నాకు వదిన. నీకు తమ్ములు గట్రా ఉన్నారు . రా వెళ్లి చూద్దారి అని పిలుచుకు వెళ్తూ వుంటే సాదరంగా, లక్ష్మణుల వారు రాముల వారు కోపం తో , తన భార్య విడిచి పోతోందే అనే కారణం తో ఆవిడ ముక్కూ చెవులూ కోసి , ఓసీ ద్రవిడ పడతీ ! మా ఆర్య పుత్రి మీ యింటి అమ్మాయా ? కత లంటా వా అని తరిమి కొడితే , శూర్పణఖ వెళ్లి, అన్నతో మొర బెట్టు కుంటే, సాధువైన రావణుడు వచ్చి సీత ను స్వయంగా గౌరవంగా తన పుష్పక విమానం లో తొడుక్కుని వెళ్లి పోతాడు. 
 
అక్కడ లంక లో సీత తన మాత తో సుఖం గా ఉంటూ ఉంటె, ఇక్కడ ఆర్య పుత్రులు కక్ష గట్టి రావణుడి పై యుద్ధానికి వెళతారు. 
 
ఆ పై మీకు కత తెలుసు. 
 
అంటే ఇది అల్లుడు అత్తా మామ ల పైన చేసిన దండ యాత్ర ! ఆత్తారింటికి దారేది అని వాపోతూంటే దారి లో హనుమాన్ అనే ముసల్మాన్ తోడై .....
 
ఈ కత ని మార్చి వాల్మీకి ఆర్యుల వైపు నించి లాక్కొచ్చి రావణుడిని దుష్టుడి ని చేసి పారేసాడు. 
 
 
అబ్బో కత ఇంకా మరీ పెద్దదై పొతుందండీ !
 
కాబట్టి యిప్పటి కింతే :)
 
 
పిండా కూడు కతల మజ 
దండిగ దట్టించిరి భళి ధర్మపెబువులున్ 
ఖండిత గర్భంబకటా 
మండోదరి తనయ సీత మహిని జిలేబీ 
 
 
 
జిలేబి