Thursday, March 1, 2012

ఆచంగ గారి ప్రశ్నలు - జిలేబీ జవాబులు !

ఆచంగ గారి ప్రశ్నలు - జిలేబీ జవాబులు !

1. మగాడు ఉద్యోగం చెయ్యకుండా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటే ఆడువారికి సమ్మతమేనా?

తెగేసి నో. మా రాజ్యం లో tresspassers are liable to be prosecuted !

కాదూ, కూడదు, చెయ్యాలని ఆరాట పడితే సమ్మతం. Not instead of ఉద్యోగం but together with outside ఉద్యోగం ఇంట్లో పిల్ల లని చూసుకునే సద్యోగం కూడాను. (ఒకటి చేస్తే ఇంకోటి ఫ్రీ అన్న మాట !)

2. ఆడపిల్లలే అనే కారణం చేత స్కూల్లో తన్నులనుండి ఆఫీసుల్లో బాస్ తిట్లవరకూ మినహాయింపులు పొందటం లేదా? మగవారికలాంటి అవకాశమే ఉండదు. అతను పోరాడాల్సిందే.

అబ్బాయ్, చేసుకున్న వారికి చేసుకున్నంత! ఆ మినహాయింపులు మా జన్మహక్కు! ఆలాంటి అవకాశం అందరికీ రాదు. Its reserved for 50 percent category only! ఈ రీజేర్వషన్ కావాలని ఆశ పడితే మా  కొండ దేవరని చాలా తీవ్రం గా ప్రార్థించ వలె మరు జన్మ లో నైనా ఆడ జన్మ గా పుట్టించు స్వామీ అని. ఫో, నీ తంటాలు పడు అని మా కొండ దేవర ఒకింత కరుణ చూపితే, గీపితే, ఆ పై ఆడ జన్మ లభ్యమై తే, ఈ సౌకర్యాలు తో బాటు కొన్ని కష్ట నష్టాలు ఫ్రీ గా వచ్చును! వాటిని భరించ వలసి ఉండును!!!

3. తలకిందులుగా తపస్సు చేసినా మగాడు బిడ్డని కనలేడు. అలాంటప్పుడు మగాడే స్త్రీ రక్షణ, పోషణ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆడువారు పిల్లల పెంపకం చూసుకోవటానికి వచ్చిన బాధేమిటి?

నిన్ననే రాసాను - ఈ తలకిందులుగా తపస్సు చేసినా మగాడు బిడ్డని కనలేడు విషయం పై:
స్త్రీ వాది సంఘం జరిపిన కలియుగ
'పుత్రికామేష్టి' యాగ విచిత్రము జూతము రారె!
ఈ యాగ మహత్వము వశమున
భార్యకు మీసముల్ మొలిచె, బాపురె భర్తకు గర్భమాయెనే!

ఆయ్, మగాడే స్త్రీ రక్షణ , బాధ్యతలు తీసుకోవాలి. మేము మా జంబు వారిని కాఫీ ఆర్డర్ ఇచ్చి బుట్ట బొమ్మ గా కూర్చుంటాము! అంతే. మా టేబల్ కి కాఫీ  రావలె. ఆడు వారు పిల్ల ల పెంపకం అనగా, అయ్యవారు, పిల్లలని బాగుగా తయారు చేసి , జిలేబీ, అబ్బాయి , అమ్మాయి రెడీ అనగా వెంట నే వారిని షికారు కి తీసుకుని వెళ్లి , 'వారిని చూడండి , ఎంత ముద్దుగా పిల్లలని రెడీ చేసి షికారు కి తీసుకెళ్తున్నారో !' అని క్రెడిట్ కొట్టెయ్యడం మా గట్టి దనం!

4. ఒక ఆడది ఏడాదికి పాతిక లక్షలు సంపాదించగలిగినప్పుడు, యాభై లక్షలు సంపాదించే ప్రేమించనివాడిని చేసుకోవటమెందుకు? పనీపాటా లేకుండా  ప్రేమించటమే పనిగా పెట్టుకున్నవాడినికి ఒకణ్ణి చేసుకోవచ్చుగా?

అబ్బాయి, పాత కాలం లో వున్నట్టున్నావ్. డబ్బెవరికి చేదు పిచ్చోడా అని జంధ్యాల గారి చిత్రం లో అనుకుంటా ఒక పాట వుంది. కావున... పాతిక లక్షలు వున్నా యాభై పై కన్నులు వెయ్యడం (eye throwing) అనునది ఆడువారి సహజ నైజం ! ఒక కిలో బంగారం కన్నా రెండు కిలోల బంగారం ఎక్కువ అన్నది చాలా సింపల్ మాథ మే ట్రిక్ !!

5. సాధించి చట్లో పెడుతున్నది అత్తా-ఆడపడుచులైనప్పుడు దానికి మగాడిని పూర్తిగా బాధ్యుడిని చెయ్యటం ఎంతవరకూ సబబు? అత్తలు, ఆడపడుచులూ ఆడువారేకదా!

మానేజ్మెంటు  ఫండా ప్రకారం ప్రతి వ్రతం తప్పిన ప్రాజెక్టు కి ఒక scapegoat (తెలుగు లో బకరా అందురు) ఉండవలె. ఆ ప్రకారంబు గా...,

7. మగాడి తన్నుల గురించి మాత్రమే మాట్లాడేటప్పుడు ఆడువారి సణుగుడు గురించి అసలు బయటకు రాదెందుకు? (సుప్రీం కోర్టు ఆడువారి సణుగుడుని మానసిక హింసగానే పరిగణించాలని తీర్పు చెప్పింది).

సణుగుడు సైలంటు రెవల్యూషన్! తన్నులు పోలీసు జులుం. రెండిటి కి వున్న వ్యత్యాసం అది ! మీడియా  వాడికి మసాలా కావాలి. సైలెంటు వాడికి నప్పుదు!

చీర్స్
జిలేబి.

28 comments:

 1. అదిరిందహో!!!! సవ్యంగా అయితే అలా.. లేకుంటే ఇలా!వారు వీరైతే . జంబలకిడిపంబ అన్నమాట.

  అందుకే నేను చెప్తుంట. ఆలుమగలు సమానంగా ఉంటూ.. రెండు చక్రాలై సంసారం బండిని నడపాలని.

  ReplyDelete
 2. LOL ;):):):) suuuuuuuuuuper..మా జిలేబీ గారి మాటే మాకు వేదం..ఎవరండీ మా జిలేబీ కి సాటి రాగలరు???

  ReplyDelete
 3. మనేజ్మెంటు ఫండా ప్రకారం ప్రతి వ్రతం తప్పిన ప్రాజెక్టు కి ఒక scapegoat ఉండవలె. ఆ ప్రకారంబు గా...,
  this answer is best than all
  LOL ;):):):) suuuuuuuuuuper.

  ReplyDelete
  Replies
  1. ya మనేజ్మెంటు ఫండా ప్రకారం ప్రతి వ్రతం తప్పిన ప్రాజెక్టు కి ఒక scapegoat ఉండవలె. ఆ ప్రకారంబు గా this is nice

   Delete
 4. "ఆడపిల్లలే అనే కారణం చేత స్కూల్లో తన్నులనుండి ఆఫీసుల్లో బాస్ తిట్లవరకూ మినహాయింపులు పొందటం లేదా? మగవారికలాంటి అవకాశమే ఉండదు. అతను పోరాడాల్సిందే"

  ఆఫీసులలో బాస్ తిట్లు మగవారికేనా, ఏ కాలంలో ఉన్నారు సార్! ఇంకా నయ్యం లంచగొండి ఆడవారికి కాసుల నుండి మినహాయింపు అనలేదు. పాపం శ్రీలక్ష్మి గారిని చూడండి.

  ReplyDelete
  Replies
  1. పై వ్యాఖ్యలో "కాసుల నుండి" బదులు "కేసుల నుండి" అని చదువుకోగలరు. కాసులకేమి కొదవ లేదు లెండి:)

   Delete
  2. జై గొట్టిముక్కల గారు,
   ఈ కాలములోనే ఉన్నాలెండి! శిక్షలు ఒకటే అయినా శిక్షించే విధానమే వేరు. ఆడువారికి మల్లెచెండుతో మగవారికి తలుపు చెక్కతో!

   Delete
 5. జిలేబి మంచి టేస్ట్ గా వండారు....

  ReplyDelete
 6. అందుకే అనేది ఈ ఇస్త్రీయాధిక్య సమాజంలో పురుషుడికి కనీస రక్షణ లేకుండా పోయిందని. వాఆ :(

  ReplyDelete
 7. జిలిబి గారూ,
  అంతే అంతే జబర్దస్తీ జాతీయం...!

  ReplyDelete
 8. అందుకే నేను చెబుతూ ఉంటాను, హక్కులు గట్రా అనేవి ఒకరు ఇస్తే పుచ్చుకునేవి కాదబ్బాయ్, పోరాడి గుంజుకునేవి అని. :-(

  ఇందు మూలంగా మా మగ కులస్తులందరికీ చెప్పేదేమనగా.. మన మీద ఎగస్పార్టీ వాల్లు కుట్ర సేత్తన్నారు, కాబట్టి జర జాగరూకతతో ఉండండి.. :-)

  ReplyDelete
 9. తోటి పురుషపుంగవులకు నా విజ్ఞప్తి.లేడీస్ విషయంలో కాస్త షివల్రీ పాటించండి .వాళ్ళ మాటే నెగ్గనివ్వండి.

  ReplyDelete
 10. kamaneeyam gaaru nenoppukonu ante...

  ReplyDelete
 11. @వనజ వనమాలీ గారు,

  సరిగ్గా చెప్పారు. వీరికి వారు, వారికి వీరు సరిజోదు! బహిర్ప్రాణమై ఒకరి కొకరు ! అప్పుడే కదా జీవన నౌక హాయి హాయి గా తొలి రేయి నిండు జాబిల్లి !!

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 12. @subha gaaru,

  ఆ హా, మీ పొగడ్తలతో మరీ ఉబ్బి తబ్బిబ్బై పోయానండీ ! నెనర్లు.

  జిలేబి.

  ReplyDelete
 13. @రమేష్ బాబు, గారు,
  @సాధారణ పౌరుడు గారు,

  మన 'ఏజ్' ఫండా లు మీకు నచ్చి నందులకు నెనర్లు !! ఎంతైనా ఆ క్రెడిట్ ఆచంగ గారికే చెందుతుంది. వారి ప్రశ్నలే లేకుంటే ఈ ఫండా ల రాతలే పండి ఉండవు కదా జిలేబీయం లో !!

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 14. @ జైగొట్టి ముక్కల గారు,

  'జైగొట్టి' ముక్కలు ముక్కలు గా కత్తిరిమ్చేసారు !

  జిలేబి.

  ReplyDelete
  Replies
  1. చచ్చా, మా ఇంటిపేరును ముక్కలు చేసిన మీరు నన్నెపుడు ఖైమా చేస్తారో అని అజ్యాతంలోకి వెళ్తున్న, టాటా :)

   Delete
 15. @రాజీవ్ రాఘవ గారు,

  జిలీబీ నచ్చినందులకు నెనర్లు.

  @ఫణీంద్ర గారు,

  అంతే అంతే ! గురజాడ వారే దీనికి కారకులు !!

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 16. ఆచంగ గారు,

  తెల్లారి లేచింది మొదలు, కాఫీ టైం ఆయే, భోజనం వేళ వచ్చేసే, ఒక్క టపా కొట్టి పోదామంటే ఏ దైనా ఒక్క ఐడియా వస్తే ఒట్టు.

  మా కొండ దేవర చలవ గా, మీరు అడిగిన తిరుపతి లడ్డులు వారు కనబడ నిచ్చారు వనజ వనమాలీ గారి టపాలో !!

  ఆ హా, ఇవ్వాళ జిలేబీ కి జిలేబీ చుట్టలు చుట్టడానికి మా కొండ దేవర ఘుమ ఘుమ లడ్డూ లు ఇచ్చాడు సుమీ అని సంతోషపడి పోయి ఒకే ఖుషీ ఐ పోయి, జబర్దస్తీ గా జాతీయం చేసేసానన్న మాట

  కావున ఈ టపా కి క్రెడిట్స్ మీకే ! మీ బుర్ర నించి ఆ ప్రశ్నలు రాకుంటే ఈ టపా యే ఉండేది గాదు గదా !!

  నెనర్లు

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 17. @శ్రీకాంత్ గారు,

  ఎగస్పార్టీ వాళ్ళ కుట్రలూ ముర్దాబాద్ !

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 18. కమనీయం గారు,

  షి, మరీ అల్లరి ఏమి చేద్దాం ! షివల్రీ తో సరిబెట్టు కోవాల్సిందే !!

  నెనర్లు
  చాలా రోజుల తరువాయి మీ దర్శనం !

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 19. @రాఫ్సన్ మహాశయా,

  ఇదియే మీకు భారద్దేశం స్వాగత ఆశీస్సులు జిలేబీ తరపున నించి - మీకు కూడా ఓ జిలేబీ లభ్య మగు గాక!! హ్హాం ఫట్ ! హ్రీం క్రీం బ్రీం !

  తిరుగు ప్రయాణం బాగా జరిగిందా ?


  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 20. జిలేబి గారు,

  మీరు ఆడవారా లేక మగవారా?

  ReplyDelete
  Replies
  1. సమాదానమునకు

   సన్నాసి బుట్టలో పడ్డాడు (బుట్టోపాఖ్యానం) అనబడు టపా చూడ గలరు !!


   చీర్స్
   జిలేబి.

   Delete
  2. ఆ టపాను చూడవలసిన అవసరం లేదు. మీ సమాధానం చదివితేనే అర్థమైపోయింది. అడిగిన దానికి నేరుగా సమాధానం చెప్పకుండా, ఇలా డొక్కతిరుగుడు గా సమాధానం చెప్తే, మీరు ఆడవారని అర్థమైపోయ్యింది.

   Delete
 21. కనిపించిన ప్రతి బ్లాగులోను పెద్ద పెద్ద కామేంట్లు రాస్తూంటారు. నేనడిగిన ప్రశ్నలో ఎమి తప్పుందో అర్థంకావటంలేదు.ఈ చిన్న ప్రశ్నకు జవాబివ్వటానికి సమయం దొరకలేదా! చెప్పటం ఇష్ట్టంలేకపోతే ఆ వ్యఖ్యను తొలగించివుండవచ్చుకదా!

  ReplyDelete
 22. హన్నా,

  మీరు రమ గారా ? రామా గారా అన్నట్టు ఉన్నది. అవసరమంటారా ?

  ఇక వ్యాఖ్యలు తొలగించడం మా ఇంటా వంటా లేదండోయ్ !! తొలగించడం ఎలాగో కాస్త చెబుదురూ !!

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete