ఏమండీ అయ్యర్వాళ్ ! ఇండోనేషియా వారు ఇండియా వాళ్లకి వీసా ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నారంట ! ఫ్లైట్ టికెట్టు తీసుకుని చేతి లో కోట్లాది ఇండోనేషియా రుపయ్యాలతో (జేకే -> ఒక కోటి ఇండోనేషియా రుపయ్యా దరిదాపుల్లో మన యాభై వేల రూపాయలు :) వెళితే చాలంటా ! అక్కడే వాళ్ళు ఫ్రీ గా వీసా స్టాంపు చేసేస్తారట అని మా అయ్యరు గారి తో చెప్పి (అంటే వారి కి పని పురమాయించి ) మొత్తం మీద బాలి ద్వీపానికి ప్రయాణం కట్టాము !
ఇండోనేషియా దరిదాపుల్లో పది హేడు వేల పై చిలుకు ద్వీపాల సమూహం; అందులో సుమారు ఆరు వేల ద్వీపాల ల లో జన సాంద్రత ఉన్న దేశం; మిగిలిన పదకొండు వేల చిల్లర ద్వీపాల కి అసలు పేర్లు ఉన్నాయా అన్నదే సందేహం :)
జనాభా దరిదాపుల్లో రెండు వందల అరవై మిలియన్లు (ఇరవై ఆరు కోట్లు ) ; అందులో అరవై శాతం జావా ద్వీపం లో నివాసం !
బాలి ద్వీపం (పురానా జమానా లో దీని ని వాలి ద్వీపం అనే వారట!) జనాభా సుమారు నాలుగు మిలియన్ (నలభై లక్షలు ) పై చిలుకు; అందులో ఎనభై శాతం హిందూ మతం !
బాలి ద్వీపం లో ని హిందూ మతం ప్రాముఖ్యత అక్కడి ప్రతి ఇంటిలో ఉండే దేవళం లో ప్రతి బింబిస్తుంది ! పెండ్లాము ని ఇంటికి తెచ్చుకుంటే అయ్యరు వాళ్ ఇంట్లో ఒక దేవళం కట్టు కోవాల ట ! (పెండ్లాము ని తెచ్చుకుని తల పై బొబ్బ కట్టించు కోవడం తో బాటు దేవళం కూడానా జేకే !)
బాలి టూరు లో తీసిన కొన్ని ఫోటో లు -> బాలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ -> దిగగానే మనకి ఆకర్షణీయం కనిపించే ది బాలి ద్వీపపు సాంప్రదాయ దేవాలయపు నమూనా ! ఆ పై ఆకర్షించేది -> స్వస్తి అస్తు అన్న బ్యానరు తో సుస్వాగతం చేసే వెల్కం బోర్డు :)
స్వస్తి అస్తు అని ఇండియా లో వెల్కం చెబితే సేక్యూలరిస్ట్ లు ప్రొటెస్ట్ చేస్తా రనుకుంటా :) జేకే !
ప్రతి పేరులో నూ దాని రూట్ పదం సంస్కృతం లో ఉందేమో అనిపించే లాంటి పదాలు ఎక్కువగా కనిపిస్తాయి నగరం మొత్తం లో ;
బాలి సముద్రం కడు సుందరం; ఆకర్షణీయం ; అయ్యరు గారికి నీళ్ళంటే భయ్యం ! సో నీళ్ళ దగ్గిరకి రాకుండా ఉండి పోయేరు :)
బీచ్ ! బీచ్ బీచ్ !
దేవళం దేవళం దేవళం !
జోక్ ఏమిటంటే ఏదో దేవాలయం అనుకుని వెళ్లి మొత్తం తిరిగి చూస్తూంటే ఒకావిడ నవ్వి 'నేను పని కోసం వెళ్ళాలి - ఇల్లు లాక్ చేసు కోవాలంది :) దేవళం ఇంట్లో దేవళం :)
బాలి లో గరుడా వారికి పెద్ద పీట ! అతి పెద్ద రాతి తో మలచ బడ్డ గరుడ ని చూడ వచ్చు; ఆ పై విష్ణువు మూర్తి కూడా;
భారతం నించి పంచ పాండవులు కుంతీ మాత తో కలిసి ఉన్న శిల్పాలు ! పాండవా బీచ్ దగ్గిర;
తానా లువాట్ దగ్గిర హిందూ దేవళా లు !
ప్రతి చోట్లా కనిపించే గణపతి బప్పా మోరియా :)
ఒక స్కూలు ముందర పెద్ద గణపతి విగ్రహం ! (భారద్దేశం లో స్కూలు ముందర గణపతి వారిని పెడితే ఇక సేక్యూలరిస్టులు ధర్నా చేస్తారేమో :)
ఇట్లా రాసు కుంటూ పోతే బీచ్ దేవళాలు అంటూ రాసు కుంటూ పోవాలి :)
ముఖ్యం గా గమనించినది ఏమిటంటే అన్నిటికి బేరమా డోచ్చు ! బేర మాడితే గిట్టు బాటు ! (జిలేబి కి ఇంక మజా చెప్పాలా ! బేర మాడి గీచి గీచి బేర మాడి తే గదా మానసోల్లాసం:)
ఋగ్వేదం మొదటి మండలం లో దీర్ఘ తమస్ ఋషి ప్రణీత సూక్తులు వరుసగా 140-164 మధ్యన వస్తాయి.
ఈ దీర్ఘ తమస్ ఋషి పుట్టుక - కథా పరం గా పుట్టుక తోటే గుడ్డి వాడు . గుడ్డి వాడుగా పుట్టినా జ్ఞానం లో మేధ .
ఈతని ఋక్కులు ఆంగ్లం లో చెప్పాలంటే రిడిల్స్ .
రెండు వాక్యాల లో అనంతమైన అర్థాన్ని ఇమిడింప జేయడం ఈతని గొప్ప తనం .
వాక్కు గురించి చెబ్తూ నాలుగు రకాలైన వాక్కు ఉందంటాడు ; (అవి ఏమిటి అని ఋక్కు లో లేదు ) కాని ఆ నాలుగు రకాలైన వాక్కులో మూడు గుహ్యమైనవి ; ఒక్క నాలుగో వాక్కు మాత్రమె మనుష్యలకి తెలిసినది అంటాడు .
Speech is of four types ;the sages who are wise know them; three that are hidden in the cave -non-speak able; men speak the fourth speech.
వాక్కు నాలుగు విధాలు ;
అందులో మూడు గుహ్యమైనవి;
నాలుగో విధమైన ది మాత్రమె మనుష్యులు పలుక గలిగినది-> వైఖరి - (వాక్య రూపకమైన వాక్కు )
నాలుగు విధాలైన వాక్కు ->
పర - పరవాణి లేక పర వాక్ --> పరమాత్ముని స్పందన
పశ్యంతి -> తమ ధ్యానం లో చూడ గలిగినది ? -> ఋషులు
మధ్యమ -> మనస్సు కి మేధ కి సంబంధించినది -> మేధావులు
వైఖరి -> వాక్య రూపక మైన వాక్కు ; --> మనుష్యలు
Kabir Das:
ऐसा वाणी बोलिये , मन का आपा खोये
अपना तन शीतल करे, औरों का सुख होयें
Speak in a manner that brings peace and tranquility to the mind; One’s speech should calm and pacify not only the listener, but also the speaker.
నిన్న జరిగిన బ్లాగార్ల మెంట్ లో అతలా కుతలమైన బ్లాగ్ కామెంట్ ఫ్లోర్ !
బ్లాగ్ కామెంట్ల హెరాల్డ్ కేసులో తన్ను ఇరికించడం ఓం ప్రథమం వారి కాన్సిపిరసీ అని ప్రముఖ వయోవృద్ధ బ్లాగిణి జిలేబి చెబ్తూ 'నేను నా బామ్మ గారి మనవరాలిని నన్ను ఎవ్వరూ భయ పెట్టలేరు ' అని ఉద్ఘాటిం చేరు !
ఈ సందర్భం లో ఆవిడ నుదిటి పై రూపాయి బిళ్ళ సింధూరం తో , ఒక వైపు చూస్తె మిధిలాపురి మైధిలి లా , మరో వైపు నించి చూస్తే విజయవాడ కనక దుర్గమ్మ లా , అసమదీయులు , తల్లీ కంచి కామాక్షి, మధుర మీనాక్షి , కాశీ విశాలాక్షీ, అంటూ జేజేలు పలుకుతూ వస్తోంటే , 'కెలు కేశ్వరాంబ' అంటూ తసమదీయులు కిసు కిసు లాడుతూ వస్తోంటే బ్లాగ్మీడియా వారికి "నీలాంబరి" లా ఫోటో షాట్ ఇచ్చారు :)
క్రితం కొన్ని రోజులు గా ముమ్మరం గా బ్లాగాగ్ర గ ణ్యు లు ఏది చెప్పినా 'జీ' , 'ఎస్' అనాల్సిందే తప్పించి వారి కి ఎదురుగా 'తీటి' తే ధర్మాగ్రహం , అవమాన పరుస్తున్నారన్న ఆరోపణ ల తో బ్లాగ్ లోకపు కామెంట్ల లోకం అల్లకల్లోలం అయి పోయిన విషయం బ్లాగర్లందరికి ఎరుకైన విషయం 'ఇరుకైన' విషయమని విదితమే !
కామెంటుల చెండుల తో చెడుగుడు ఆడుతూ , నారదాయ నమః అంటూ అక్కడక్కడ ఘ్రుతం లాగిస్తూ విన్యాసాలు చేస్తూ ఒక వైపు జిలేబి 'ఆగడాలు' , మరో వైపు జిలేబి పై కేసు బనాయించి ఇది ఆవిడ, ఆవిడ అనుయాయుల కుట్ర , బ్లాగ్ దేశానికి నమ్మక ద్రోహం అంటూ ఉర్రూత లూగిస్తున్న పవనాలు ఈ 'హవా' లో ఎన్నేసి 'కామింట్లు' ద్రవ్య విలం బితం అయ్యే యో ఎవరి కెరుక అని ప్రముఖ పొలిటికల్ సెటై రిస్ట్ 'తేట 'గీతి ట్వీటారు :)
ఇప్పుడు ఈ నమ్మక ద్రోహం కేసు 'జీ' ఎస్' లు తప్పించి టీకాలు పెట్ట కూడదన్న ధర్మాగ్రహం సమయం లో మళ్ళీ తెరపై రావడం, రసవత్తరం గా జిలేబి ఇందులో ఓం ప్రథమం వారి కాన్స్పిరసీ ఉందని చెప్పడం ఇవన్నీ చూస్తూంటే తన తల తిరిగి పోతోందని పిస్తుందని బ్లాగ్ పొలిటికల్ అనలిస్ట్ హర్రీ బర్రీ తన అభిప్రాయాన్ని తెలియ జేసారు :)
ఇంతటి తో ఈ నాటి కాన్స్పిరసీ ఘట్టపు ఫ్లాష్ న్యూస్ పరి సమాప్తం !
తెలుగు బ్లాగ్లోకపు పునాదుల్ని కుదిపేస్తున్న ఆ నాలుగు ప్రశ్నలు
ఈ టపా సదుద్దేశం తో బెట్ట బడినది ; తెలుగు బ్లాగ్లోకం పునాదులు కదిలి పోవచ్చు గాక; వయస్సు తో పై బడ్డ వారు జిలేబి ని నిందించు గాక; జ్ఞాన వృద్ధులు చీత్కరించు గాక; నలుగురు నవ్వి పోదురు గాక;
కానీ సనాతన ధర్మపు పునాదులు ఇట్లాంటి ప్రశ్నల తో నే కాలా కాలం గా పటిష్టాత్మక మవుతున్నది అన్న ఆలోచనే ఈ టపా పెట్టడానికి కారణం .
పదుగురారు మాట పాడి అయి కొంత కాలం ధర న జెల్ల వచ్చు; సనాతన ధర్మం మాత్రం కొంత కాలం కాదు సనాతనం గా నిత్య నూతనం గా ఉండటానికి కారణం మూలాన్ని ప్రశ్నించటం ;
నీహారిక గారు కొన్ని మరీ నిఖార్సైన , సూటి ఐన ఆలోచనాత్మక ప్రశ్నలు కూడా అడిగేరు - వారు వ్రాసేటప్పుడు అంత దీర్ఘం గా ఆలోచించి ఉంటారో లేదు నా కైతే తెలీదు ; కానీ ఈ ప్రశ్నలు నిజంగా నా వరకైతే ఆలోచనల కు పదును పెట్టేవి .
జిలేబి దర్శకత్వం లో 'బ్లాగు బలి' - మెగా చిత్రరాజం అతి త్వరలో వెండి తెరపై :)
బ్లాగ్ ఉడ్-> గ్రేప్ వైన్ స్టొరీ -> ఆదరాబాదరా నగరం -> డిసెంబర్ ఆరు - ౨౦౧౫ -> ప్రముఖ దర్శకురాలు బీలేజీ జిలేబి దర్శకత్వం లో బ్లాగు బలి అనే మెగా చిత్ర రాజం అతి త్వర లో వెండి తెరపై వస్తోందన్న వార్త బ్లాగు లోకం లో సంచలనం గావిస్తోంది :) ఈ మెగా చిత్రం రాకమునుపే బ్లాగు లోకం లో సంచలనం కనిపిస్తోందని బ్లాగు లోకం లో ఆరి తేరిన కథా రచయిత బ్లాగ్ గాంధీ వారు రీ ట్వీట్ చేసారు ! ఈ మెగా చిత్రం తెర వెనుక కథ చాలా పకడ్బందీ గా జరుగు తోందని దీని విషయమై మీడియా కి ఏలాంటి 'మేత' దొరక కుండా కట్టుదిట్టం చేసారని బ్లాగ్ ఉడ్ లో ని పలువురు 'కిసు కిసు' మంటున్నారు ! జిలేబి 'బ్లాగు బలి' చిత్రం తరువాయి దర్శకేంద్రులందరినీ తల దన్ని తానొక్కతే బ్లాగ్ ఉడ్ లో ఏక 'చట్టాధి' పైత్యం గా వెలుగొంద వచ్చునని విశ్రాంతి తీసుకుంటున్న బ్లాగ్మూవీ డిస్ట్రిబ్యూటర్ ఏడుకొండల రావు ఊహాగానం చేసారు :) ఈ చిత్రం లో బ్లాగు 'షార్ప్' నఖ సఖీ గా పేరొందిన నటీ మణి ప్రముఖ 'విల్లీ' పాత్ర వహిస్తోందని అట్లాంటి పాత్ర ని ఆవిడ తన నట జీవితం లో ఇంత వరకు చేసినట్లు ధాకలాలు లేవని , రాబోయే బ్లాగు చరిత్ర లో 'బ్లాగు బలి' ముందు ఆ తరువాయి అన్నంత గా ఆవిడ 'రోలు' కర్ర స్వారీ చేస్తుందని బ్లాగు సింగం ఉద్ఘాటించారు ! అట్లాగే ప్రముఖ హీరో హర్రీబర్రీ శూర్పణఖ ప్రతి ఎత్తు కి పై ఎత్తు వేస్తూ జన బాహుళ్యాన్ని మనోరంజకం గావిస్తారని కూడా బ్లాగు కామెంట్ల లోకం భోగట్టా :) ఈ చిత్ర వార్త చేస్తున్న 'హల్' చల్ తో కలవరం చెందిన ప్రముఖ బ్లాగ్కవి తాను బ్లాగు డిస్ట్రిబ్యూటర్ ల ద్వారా కాకుండా తన చిత్రాలని ప్రైవేట్ చానల్స్ 'రూట్' ద్వారా అందిస్తా నని ప్రకటన చేసారు . కాని ఇంత జరుగుతున్నా దర్శకురాలు జిలేబి ఏ మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా తాను జేస్తున్న పనిని మోడీ వారి లా చేస్తూ పోతోందని మీడియా కి మేత అందివ్వడం లేదని విచారణ వెలుబుచ్చారు పద్యాల రావు గారు . ఇంతటి తో నేటి బ్లాగ్ ఉడ్ సినెమా సమాచారం పరి సమాప్తం. సైనింగ్ ఆఫ్ చీర్స్ సహిత :) జిలేబి
ఈ మధ్య బలపం బట్టి బామ్మ ఒళ్లో ఏ బీ సి డీ లు నేర్చు కున్నా పాట మావయ్య రాసింది అంటే బోనగిరి గారు అబ్బే కాదండీ అన్నయ్య /తమ్ములుం గారు శాస్త్రి గారిది అని సరి చేసారు. ఓహో సిరి వెన్నల వారిదా ఆ పాట అన్నా . వెన్నలా ? వెన్నెలా అని వారు రిటార్టు ఇచ్చారు ? అబ్బే మా ఆండోళ్ళకి తెల్సింది వెన్నా, నెయ్యీ, గియ్యీ గట్రా యే ! వెన్నెలా గట్రా మగరాయుళ్ళ కే తెలుసునుస్మీ అని మనం రాసింది కవర్ జేసేసు కున్నాం :) అబ్బే ఆండోళ్లు తప్పుగా రాసినా అది సబబే అని చెప్పేసు కోవాలె ; మనకు మనమై ఎప్పుడూ మనం జేసింది తప్పు అని చెప్పుకోరాదు; చెబ్తే మగరాయుళ్ళ కి మన కి వంక బెట్ట డానికి కారణం దొరికి పోతుందిస్మీ అని బామ్మ పోతూ పోతూ చెప్పేసి వెళ్ళింది. అప్పటి నించి బామ్మ వారి ఈ స్వకపోల భట్టీయ మంత్రాన్ని జపించు కుంటూ అయ్యరు వార్ని మేనేజు చేసేసు కుంటూ వచ్చేస్తున్నా ;) అట్లాంటిది మనం తప్పుగా రాయడమా అబ్బే :) సుతరామూ తప్పు కాదు తప్పున్నర కూడా కాదు. అక్షరం పరం బ్రహ్మం ! మన తల్లోంచి, 'కీబోర్డు వాతల్లోంచి', ఘంటం ఊకదంపుడు ఏది వస్తుందో ఏదో అదే సత్యం :) అది అప్పు తచ్చై ఉండ వచ్చు గాక ! దానిని మనం సముదాయించి , అందులో నించి అర్థమును పరమార్థమును లాగి జిలేబి చెప్పిందే వేదం అని జెప్పు కోవాలన్న మాట ! సిరి అనగా ఎవరు ? శ్రీ మహాలక్ష్మి ! సముద్ర మంథనము న పుట్టినది . దాని తో బాటు వెన్న గట్రా కూడా పుట్టినది అని ఉవాచ ! అనగా సిరి వెన్నలా తోడు బుట్టువులు ! కావున సిరి వెన్నల అన్నదే సరి ఐనది ! మరి సిరివెన్నెల వారు అట్లా ఎందుకు శ్రీ చంద్రమా అని పేరెట్టేసు కున్నారు ? ఆ కాలం లో వారు జిలేబి ని సంప్రదించి ఉంటె వారు సిరి వెన్నలా అని విశ్వనాథ్ వారి కి సినిమా పేరు సరి జేసి ఉండే వారు :) ఈ తెలుగు వాళ్ళు ఇది శుద్ధ తెలుగు పదం అంటారు గారి వెన్నెల అన్నది అరవం పదం 'వెణ్' నిలా కాదూ ? వెళ్ళఅయిన నిలా తెల్లని నిలా తెల్లని చందురూడు . అట్లాగే వెన్న అన్న పదం ఎట్లా వచ్చింది ? అదిన్నూ అరవం నించే స్మీ:) వెన్నై అని అరవం. డానికి తెలు 'ఘీ' కారం ( చూడండి ఇక్కడ కూడా ఘీ అన్న హిందీ పదం ఎట్లా తెలుగు లో ఇమిడి పోయిందో :) వెన్న ! సిరి అనగా నవ్వు అని అరవం లో ; సో (ఈ మధ్య ఎవరో ఈ 'సో' అన్నది తెలుగా అన్నారు కూడాను ; కానీ ఈ సో సో ఎంత సొబగు గా ఉందో చూడండి అది కూడా తెలుగు లో పాల లో నీళ్ళ లా ఎంత గా కరిగి పోయింది ) సిరి వెన్నలా అనగా నవ్వు తో ఉన్న వెన్న ! అనగా అముల్ బట్టర్ ! సో, సీతారామశాస్త్రి గారి రచనలు కూడా అముల్ బట్టర్ అంత తియ్యందనాల టేస్టి టేస్టి :) అందుకే వారు సిరి వెన్నల సీతారామ శాస్త్రి గారే ! సిరివెన్నెల కాదు అని జిలేబి తీర్మానించు కునేసింది ! అట్టర్లీ బట్టర్లీ సిరి వెన్నలా ! కొస తునక -> బోనగిరి అనగా నేమి ? అని ఆంధ్ర భారతి వారిని 'కొచ్చనించగా' వారు జెప్పింది -> -->
పెండ్లిలో మగపెండ్లివారికి ఆడు పెండ్లివారు పంపు ఫలహారాలు అని :)
ఆడువారలకు 'ఫల' హారములు' కూర్చుట 'వెన్నతో' బెట్టిన విద్య :) ఈ శుభోదయ 'ఫల' హారమును అటులే స్వీకరించెరదని ఆశిస్తో :) నేటి కి ఫలహరముల భుక్తాయాసము తో సైనింగ్ ఆఫ్ చీర్స్ సహిత జిలేబి
సాదా సీదా గా చెప్పాలంటే రాముల వారిని పుంసాం మోహన రూపాయ అని జెప్పి మానవ మాత్రుల లో ఉండే అన్ని గుణ గణా లను వారి లో చూడ గలిగాడు కవి .
మానవు లకి ఔరా ఒక మనిషి మనీషి గా నిలబడటానికి కాల వ్యవధి లో ఎన్నేసి కష్టాలు నష్టాలు చూడ వలసి వస్తుంది అనిపించక మానదు .
మరి సీతమ్మ ? పుట్టని అమ్మ అని ఈ మధ్య ఒకరన్నారు . భూదేవి ఒడి లో నాగలి కి తగిలిన నారి . జనకాత్మజ . జానకి .
రాముల వారి తో సరి సమానంగా కష్టాలను స్వీకరించింది . నువ్వు వనవాసం చేసి రావోయ్ అని ఈ కాలం లో జిలేబిలు చెప్పగలరు .
తమ్ముడు - లక్ష్మణుడు - వాడిని ఎవరూ అడగలేదు వెళ్ళ వోయ్ వనవాసానికి అని. తనకు తానై అన్నకు తోడుగా వెళ్ళాడు .
వీటన్నిటి కి మించి ఊర్మిళ . హిందీ సాహిత్యం లో ఊర్మిళా కీ విరహ్ అనిమైథిలి శరణ్ గుప్త వారి దను కుంటా ఒక ఖండిక ఉంది . ఊర్మిళ తరపున రాసిన కవివరుల్లో వారే మొదటి వారను కుంటా . సాకేత్ అన్నది పుస్తకం పేరు .
భారతీయ భాషల్లో నే కాకుండా ప్రపంచ భాషల్లో కూడా అద్బుతం గా అనువదింప బడి , కల్పవృక్షం గా పేర్కొనబడి , విష వృక్షం గా చెప్పబడి పరి పరి కోణాల నించీ విశ్లేషించ బడినది రాముల వారి చరిత్ర .
అంతే కాదు ; మనకు దగ్గిర గా తెలిసిన కాల ఘట్టం లో త్యాగయ్య వారి చేత కొనియాడ బడి , వారి కి రాముల వారి కన్న వేరెవ్వరు లేరు అని రామాయణం మొత్తం వారి సంగీతం లో ఇమిడి మనకు ఈ నాటికీ పాటల రూపం తో ఆవిష్కరించ బడి ఉన్నది .
రాబోవు కాలం లో మరిన్ని విశ్లేషణలు పరి పరి విధాల పరిశోధనలు వాటి మీద రావచ్చు గాక.
ఎంత వచ్చినా ఏమి వ్రాసినా కాలం లో ఇమిడి పోయి వాటిని స్వకీయం చేసుకునే భారత సంస్క్రతి కళ కళ లాడు తున్న సంస్కృతీ .సజీవ సంస్కృతీ .అందులో ఇది అది అని లేకుండా అన్నీ కలిసి మహా సాగరమై మహోన్నతం గా వెలుగొందటం తధ్యం.
బలపం బట్టి భామ ఒళ్లో అ ఆ ఇ ఈ నేర్చుకున్నా అని మావయ్య పాట వ్రాసి పోయేడు ! కామ్రేడ్ "సిరివెన్నల" (అదేనండీ సిరి వెన్నెల వారు ) వారు సొగసుగా రాసేసు కున్నారు !
దాన్ని మా బాలూ కూడా యమహా నగరి లా పాడి రంజింప చేసాడు !
కవి వరుల చేతి లో పదాలు పాదాలు పదనిసల తో పట్టు పరికిణీలు వేసుకుని పరి పరి మనలను పరిమళింప జేస్తాయి !
వారి పద పొందులు వాటి అందాలు వారికేలా వస్తుందబ్బా అని హాశ్చర్య పోవడం మాత్రమె జిలేబి వంతు !
ఈ మధ్య ప్రజ వారు తెలుగు వ్రాత లో ఇన్నేసి అక్షరాలూ ఉండాలా అని ప్రశ్నించేరు !
అక్షరాలూ ఎన్నేసి ఉన్న నేమి ? వాటిని ఎట్లా ఉపయోగిస్తున్నామో అన్నదాన్ని బట్టి అవి వాడుకలో ఉంటాయా లేవా అన్నది రూడి ( ఇక్కడే ఒక ఒత్తు పోయే! )
ఈ మధ్య ఆంగ్లం లో LOL అని రాయ బోయి లోల అని వ్రాసేనన్నారు బండి రావు గారు . ఆహా కొత్త పదం కని పెట్టేరు అని మరొక మా 'సార్' తిరగేస్తే శర్మ గారు వారి కి తాడులు వేసేరు !
బండి ర ఎట్లా వ్రాయాలో తెలీటం లేదు :)
ఆ మధ్య ఒక కార్టూన్ చూసా రిక్షా బండి వాడి ని రావయ్యో అనడానికి కార్టూనిస్టు ఒక్క పదం లో అంటే బండి ర తో కార్టూన్ వ్రాసేసేరు ! అదీ కవి పదపు పదును !
శ్రీపాద వారు శ్రీ రాముల వారిని అంటే వనవాస కాలపు శ్రీ రాముల వారిని విప్రలంభపు శృంగార యోగి అని వర్ణించేరు ! పదముల పొందిక అది !
"మన దగ్గిర చుట్టమైన రాముడు
మహావీరుడూ ,
ప్రకృతి సౌందర్య పిపాసీ ,
దుష్టశిక్షకుడూ ,
శిష్టరక్షకుడూ,
ముఖ్యం గా విప్రలంభ శృంగార యోగిన్నీ !"
గోదావరి వాళ్లకు ఆ తెలుగు అట్లా ఎట్లా వస్తుందేమో తెలీదు గాని, కష్టే ఫలే వారి టపాల్లో రెండు వాక్యాల్లో ఒక వాక్యం నానుడి తో ఉంటుంది !
శ్యామలీయం వారి టపాల్లో పద్యాల పై నున్న వెరైటీ , వారు రాముల వారి పై రాశి పోసిన పద్యాలు , (అంతే కాదు సై అంటే సై అని జిలేబి కామెంట్లు పోటీ గా వ్రాసిన జిలేబి శతకం కూడాన్ను ) - తెలుగు బ్లాగు వెలుగులు ఇంతింత కాదయా అని చెప్పుకొనక తప్పదు !
మా అరవ దేశం లో క్రేజీ మోహన్ అని ఒక రచయిత ఉన్నారు . వారి చేతిలో పదాల విరుపు ఇంతా అంతా అని చెప్పలేము ! పదాలు నాజూగ్గా విడి పోయి హాస్యాన్ని పండిస్తాయి !
బ్లాగులోకం లో నిరవధికం గా సంవత్సరాల తరబడి సమస్యాపూరణం నడుపుతున్న కంది వారు వారి టీము ఒక ఎత్తైతే ( మేమంతా హరిబాబు వారి లా పేజీ ల కొద్ది టపాలు వ్రాస్తాం - ఒక్క కామెంటూ పడదు - కంది వారేమో ఒకే ఒక్క వాక్యం వ్రాస్తారు టప టప మని ఓ నలభై కామెంట్లు ఒట్టి కామెంటులు కావు మేటరు ఉన్న మేలైన నేటి కి ఏ నాటికీ నాలుగు కాలాల పాటు నిలిచి పోయే పదాలు పద్యాలు పడతాయి ! అబ్బ మరీ ఈ జిలేబి కి కా 'మంటలు' అంటే అంత 'ఇది' యేమో తెలీదు గాని :)) - మరో ఎత్తు నెమలి కన్ను మురళి గారు - దేశం ఉన్న గొప్ప గొప్ప వాళ్ళని అందర్నీ కలగలిపి గోదారి లాక్కెళ్ళి పోతారు :) జేకే !
సంస్కృత మకరందాలు -
బ్లాగాడిస్తా వారి చమక్కులు -
పద్మార్పిత వారి పడుచుపదాలు-
ఆంధ్రామృతం వారి అద్బుత 'అరంగేట్ర' సమాచారాలు-
ఈ టైటిల్ చదివితే ఈ టపా మనవు గారిదే నబ్బా అని కళ్ళు మూసుకుని చెప్పెలాంటి టైటిల్ పెట్ట గలిగిన మనవు గారు -
సుజన సృజన లతో పదనిసల్ని మోహనం గా ఆలాపించే లక్కాకుల వారు-
బ్లాగు బర్త డే కి టపాలు రాసే స్టేజీ కి వచ్చేసిన ఒకప్పటి ఇల్లు అలకటం మరిచి పోయిన ఈగాజ్యోతీలు - అప్పుడప్పుడు శర్కర పంచె శర్కరీలు -
కౌముది కి అంకిత మై పోయిన బ్లాగిణి మణులు (మధుర వాణీ గారు వింటున్నారా ?) -
పనిలేక పిపీలిక మైన మా డాటేరు బాబు రమణ గారు -
తేటగీతి అంటూ తేటతెల్లంగా 'అటుకుల' బొంత ని స్వాహా గావిస్తున్నవారు :) -
పాటతో నేను అని సైలెంట్ గా సినీ పాటల ఒక ఖజానాని పెట్టి వాటికి లిరిక్స్ జోడించి జోహార్ అని పించే లా ఉన్న వేణూ శ్రీకాంత్ గారు -
అమృత మధనం తో దేశాన్ని మధిస్తూ బుద్ధునికి మురళి కి సంజౌతా 'ఎక్స్ప్రెషన్' ప్రయత్నిస్తున్న మా జర్నలిస్ట్ బుద్దా వారు -
పద గోళీ లాడుతో సమస్యల తో 'పూ' రణం గావిస్తున్న మా గోలీ హుమచ్చాస్త్రీ వారు - (హనుమ కీ స్త్రీ కి పొత్తు ఎట్లా అవుతుంది సినబ్బా అని హాశ్చర్య పోయా మొదట వారి పేరు చూసి !) -
మా కథా మంజరి అయ్యవారు పద్యాలు పెట్టి టపాలు గట్టి సెహ భేషు గా బ్లాగ్ విహారం గావిస్తున్న వారు -( వారి బ్లాగు టెంప్లేటు సరిగ్గా లేక నేను కామెంట లేక పోయిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి - టెంప్లేటు మార్చండి మహాప్రభో అని చెప్పినా ప్రయోజనం లేక పోయే :)
రమ్యంగా కుటీరాన అంటూ గులాబీ 'ఔట్లు' కూడా కావాల్సి వస్తే పెలుస్తాం అంటూ అలుపెరుగక ఉన్న నీ , మా , హారిక గారు :)
కన్నీటి కథ ల తో కడివెడు కహానీ లతో సమ సమాజానికి అద్దం పట్టే వనజ వనమాలీ గారు -
దేశ విదేశాల్లో ని సంక్షోభ పరిస్థితుల కి చరమ గీతం గ్రహాల భ్రమణం తో ఆలాపిస్తున్న మా భ్లాగ్జ్యోతిష్ శర్మ గారు -
ఇట్లా ఊకదంపుడు వ్రాసుకుంటూ జిలేబి కూడా ఎనిమిది సంవత్సరాలు దరిదాపుగా కలగా పులగం గా , ఈ ఒక్క సబ్జెక్టే నేను తాకుతా అనుకోకుండా అట్లా అందరిని గెలుకుతూ , అప్పుడప్పుడు డక్కా మొక్కీలు తింటూ , కొండొక చొ ఐ డోంట్ లైక్ లతో చీవాట్లు తింటూ కాలం గడిపేస్తోంది :)
ఇంతకీ ఈ టపా టైటిల్ ఏమిటి ? ఈ టపా ఏమిటి ? అంతా గందర గోళం గా ఉందిస్మీ :)
బ్లాగ్దేశం లో ఉండాలంటేనే భయం గా ఉంది - దేశం విడిచి పోతా - జిలేబి
అయ్యరు ఖాన్ గారు నాకు బ్లాగ్దేశం లో ఉండాలంటే నే భయ్యం భయ్యం గా ఉందండీ జిలేబి రావు చెప్పింది అయ్యరు ఖాన్ తో .
అయ్యర్ ఖాన్ తన విశాలమైన చాతీ ని తడుముకోబోయి తానూ చాలా సీదా సాదా అయ్యర్ ఖాన్ మాత్రమె అని గుర్తు కొచ్చి
మై డియర్ జిలేబి రావు ! నా ప్యారీ పెండ్లామా ! మనమంతా సాదా సీదా బ్లాగ్ దేశ వాసులం ! మనం అట్లాంటి మాటలు చెప్పలేం " చెప్పారు అయ్యర్ ఖాన్ గారు .
మరి ఎట్లా ఈ బ్లాగ్ దేశం లో బతికేది ? రోజు రోజు కి వైషమ్యాలు కార్పణ్యాలు , భావాల మీద బావ ల మీద, మాట మీద , సారంగం మీద వచ్చే కామెంట్ల చూస్తూంటే నాకు మరీ విపరీతమైన భయ్యం వస్తోందండీ !
జిలేబి ! ఇంతకు మునుపు ఇట్లాంటి కామింటులు అంటే సై అంటే సై అనే కామింటులు లేవా ?
ఉండే వండి ! ఒక వైపు వారు మాత్రమె ఎగ సెగ డోస్ ఇచ్చె వారు ! కాని ఈ కాలం లో సై అంటే సై అని కౌంటర్ వేయటం ఎక్కువై పోయిందండి !
సో కౌంటర్ వేయటం కొట్టొచ్చినట్టు కనబడు తోందన్న మాట ! సరే రేపు నాకు బ్లాగ్దేశం లో ని మ్యాడ్ మీడియా వారి తో బ్లాగ్ముఖీయం ఉంది - దాంట్లో వీళ్ళ తాట వదిలిస్తా ! నీ తరపు గా నేను వాళ్లకి చెబ్తా ! మా జిలేబి రావు కూడా భయపడింది అని చెప్పాడు అయ్యర్ ఖాన్ !
జిలేబి రావు కళ్ళ లో కన్నీళ్లు సుళ్ళు తిరిగేయి ! ఈ బ్లాగ్దేశం ఎంత మారి పోయింది ! చ చ ! వేరే బ్లాగ్ దేశం కి వెంటనే వెళ్లి పోవాలి !
అయ్యర్ ఖాన్ తన సైజైన చాతీ తో జిలేబి రావుని అక్కునకి తీర్చుకున్నాడు !
బావా నా లో వంట జ్ఞానమే కొరవడెనని వడ్డింపు వాస్తేదో అంతగా లేనే లేదని అల్లం దోశ లతో సాంబారు లాగించ మంటే బావా, నేను మూగనై నీ బందీ నై పోయా !
ఆలోచనలకి రూపమీయ జిలేబి గుండు అని తటిల్లత లా జిలేబి పాకం నీరు కారి పోయే లేని పెసరట్ల తో తెలుగు వంట చేయ మంటే ఆలోచనలు అవాక్కై ఆముదాన్ని తాగె !
వ్యంగ్య వ్యాఖ్యల కారప్పూసల తో వడ్డించి టిఫిను ఖాళీ ప్లేటు పెట్టి తినమంటే అల్లం మిర్చీ గా మారి కాలుతుంటే మజ్జిగెరుగని మదికన్నీరే బ్లాగ్కాలువాయే !
అల్లంమొరబ్బా ని అభిమానిస్తే అదేదో నేరమని నా తలపుల కే రంకుగట్టి బావలతో సరసమని పదాలే వేరుగా పలికి పోపు పొడి వేయిస్తూంటే విస్తరాకుల విజ్ఞానమిదేనని వినమ్రత గా నవ్వుతా !
ఎరక్క పోయి వచ్చాను ఇరుక్కు పోయాను అని సినీ కవి పాట . ! నిజంగానే అట్లా అయ్యింది జిలేబి పరిస్థతి ! మొన్న శర్కరి వారు సత్యనారాయణ వ్రతం గురించి గరికపాటి వారి ప్రసంగం వీడియో పెట్టి మనకు తెలిసిన సత్య నారాయణ వ్రతం కోరికలను ఈడేర్చేది . మరి గరిక పాటి వారేమో సత్యం గురించి మాట్లాడు తున్నారు మరి అంటే , అబ్బే మగరాయుళ్ళ కి ఆండోళ్ళ కి తెలిసినంత గా వీటి గురించి తెలీదండీ అని వ్రాయటం తో మొదలెట్టి ఆ పై గరిపాటి చేయని సత్యాని కి ఇంత విలువా ! ఇంత బిల్డ్ అప్ కూడానా అని వ్రాస్తే విన్న కోట వారు ఆయ్ మీరు గరిక పాటి వారి పాండిత్యాన్ని గరిక పోచ తో పోల్చడం సుతరామూ బావోలేదు సుమీ అని ధక్కా ఇచ్చారు ! శ్యామలీయం వారేమో పొరపాటు మాటన్నారు జిలేబిగారు అన్నారు ! అదిరి పడ్డా ! ఎరక్క పోయి కామేంటాను ఇరుక్కు పోయాను అనుకున్నా ! మరీ శర్కరి వారి కామింటు బాక్సు నింపడం కన్నా మనకు ఒక టపా వ్రాసేందుకు ('టపా' కట్టేందుకు ) అవకాశం దొరికింది సుమీ అని సంతోష పడి పోయా ! సత్యాన్వేషణ అన్నది కాలా కాలం గా ప్రతి జమానా లో నూ జరుగుతున్నదే. అయితే ఏది సత్యం అన్నది , ఇదే సత్యం అన్నది నిర్ధారణ గా , చెప్పలేనిది. ఇదే సత్యం అంటే అప్పటికి అదే సత్యం కాని దాని ఆవల మరో సత్యం ఉన్నది అన్నదే న ఇతి ! ఈ క్షణం సత్యం అనుకుంటే ఈ క్షణం మాత్రమె సత్యం ఆ పై క్షణం సత్య దూరం. మార్పు చెందనిది సత్యం అనుకుంటే మార్పు లేనిదే ఈ విష్ణు మాయ లేదు. గరిక సత్యం పాటి అవ్వొచ్చు నెమో గాని సత్యం గరిక పాటి కాలేదు. అది అయితే ఇక సత్యం వేరే ఉన్నట్టే లెక్ఖ . గరిక పాటి వారు చెప్పినది 'సత్యమైన' మాట - సత్య వ్రతం చెయ్య మనడం . సత్య మేవ జయతే అనటం తో ఋక్కు ఆగలేదు - మరో తోక తగిలించు కున్నది నానృతం అని కూడాను. ఋతగుం సత్యం పరం బ్రహ్మ అంటుంది ఋక్కు . ఇందులో సత్యానికి మరో తోక కూడా ను "ఋ" త ఎందుకా తోక ? ఇప్పటి దాకా నాకైతే అనుభవైక వేద్యం కాలేదు ( పుస్తక జ్ఞానం కాకుండా) ! నారాయణ సూక్తం 'నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా' అంటుంది ఆ 'పరం బ్రహ్మ' గురించి చెబుతూ ఎండిపోయిన గరిక మొనన ఉన్న పీత వర్ణ రంగులో అణు మాత్రమై అంటూ . క్వాంటం ఫిసిక్స్ గాడ్ పార్టికల్ వైపు పరుగెడు తోంది . ఇట్లాంటి నేపధ్యం లో ఒక్క వాక్యం లో వ్రాసినది ఆ వాక్యం . ఆ గరిక పాటి అన్నది బాగా అక్కడ కుదురుకున్న మాట అయి పోయింది ! సత్యం గరిక పాటి చేయదు. చేస్తే అది సత్యం కాదు. మరి ఏ పాటి చేస్తుంది ? తెలీదు ; ఈ పాటి చేస్తుంది అని తెలిస్తే అది సత్యదూరం. జిలేబి (హమ్మయ్య ! నేటికి ఒక టపా కట్టేసా:)
కృష్ణా జీ హౌ ఆర్ యు ? అడిగింది సత్య ! భామ వైపు చూసేరు శ్రీ కృష్ణుల వారు . ఈ సత్య అప్పుడెప్పుడో కాలం లో నరకాసురుడి ని సంహారం గావించి సత్యాన్ని నిలబెడితే జన వాహిని దీపావళీ తో ఆనంద పడి పోయేరు ! అప్పటి నించి జనవాహిని ప్రతి ఏటా ఈ దినాన్ని కాపీ కొట్టేసు కుంటూ దీపావళీ జరిపేసు కుంటోంది . ఈ కలియుగం లో అగర్వాల్ భాయీ లు , శ్రేష్ఠులు కలిసి దీపావళీ సమయాన్ని బిలియన్ డాలర్ మార్కెట్ గావించే సేరు కూడాను ! కాపీ కి ఇంత మహాత్మ్యం ఉంది ! అందరూ శ్రీ కృష్ణా రామా నీ లా నన్ను చేయ వయ్యా అని దండాల మీద దండాలు పెట్టేసు కుంటున్నారాయే ! ఈ జమానా లో అంతా కాపీ మాయం మయం ! కాపీ లేని జీవితం ఎట్లా ఉంటుంది స్మీ :) దీపావళీ భళీ 'జిలేబీయం ! అందరికీ దీపావళీ 'కాఫీ' కాంక్షల తో ! చీర్స్ జిలేబి
ఈ జమానాలో జనాలకి కాలక్షేపం కబుర్లు, బాతాఖానీ బటానీలు ఎందుకు కావాలి ?
మా మీ మన అందరి 'రోలు కర్ర' శ్యామలీయం బ్లాగ్ మాష్టారు ( వీరిది వృత్తి పరంగా మాష్టారు ఉద్యోగం కాదు - మేధా జీవి ) ఓ కామెంటులో - ... ఈ రోజుల్లో జనానికి వినోదం కావాలి ... కాలక్షేపం సరుకు తప్ప మరేమీ పట్టని వారి సంఖ్యాబలం కారణం గా అలా కాలక్షేపం సరుకుల్ని పంచేందుకు తాపత్రయ పడే వారే ఎక్కువ (ఎడిట్)"
ఈ వ్యాఖ్య చదివాక - ఎందుకు ఈ కాలం లో ఎక్కువ మంది కాలక్షేపం కబుర్లు, సరదా గా సాగి పోయే విషయాలు తప్పించి కొద్ది పాటి సీరియస్ మేటర్ ని చదవటానికి ఉత్సుక చూపించడం లేదు ? అని పించింది .
మా అయ్యరు గారి తో ఈ మాటే అంటే ... జిలేబి నీ వయసు రోజుల్లో (అబ్బ వయసు రోజుల్లో అంటే నే జిలేబి కి చెక్కిళ్ళ గుబాళింపు ఎక్కువై పోతుంది మరి :)) రేడియో లో కూసింత ఏడుపు కథ లు వస్తే నే నీ కళ్ళ లో కన్నీరు జర జరా రాలి పోయేది గుర్తుందా ? అడిగేరు .
ఆలోచించా . అవును ఆ కాలం లో అన్నీ ఉమ్మడి కుటుంబాలు . కష్టాలు నష్టాలు ఎట్లా ఉన్నా గృహ వాతావరణం లో ఉత్సుకత , హిందీ లో చెప్పాలంటే ఉమంగ్ భరీ లైఫ్ ! ఉమ్మడి కుటుంబాలలో ఉన్న మజా ఆ కాలం వారికే తెలుసు నెమో !
అంతే గాక ఇప్పటి బిజీ లైఫ్ బ్యాక్ ప్యాక్ బకరా బేబీ లైఫ్ అప్పట్లో ఎక్కడ ? ఉద్యోగమో సద్యోగామో గానిస్తే ఆ తరువాయి బాతాకానీ కి ఇంటి నిండా జనాలు ఇంటి చుట్టూతా వున్నవారంతా బంధువులే బాంధవ్యాలే. జీవన గతి , సరళి సుళువు గా సాగి పోయే రోజులు . రేడియో లలో నో మీడియా (అప్పటి కి లేదు కాబట్టి , పేపర్ల లో నో ) వినోదం కన్నా కన్నీ టి కధ లే ఎక్కువ . కాంట్రాస్ట్ బాగా కుదిరి పోయేది !
జీవన గతి లో కన్నా మిన్నగా కన్నీటి కథలు ఉంటె మన జీవితమే బెటరోయి అని పించే లా ఆలోచింప జేసేవి .
మరి ఇప్పటి మాట ఏమిటి ?
జీవనం హై ఫై లైఫ్ ! సిటీ వారి కథలు ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పరు గె పరుగు . నిలబడి తీరిగ్గా ఆలోచించ టైం ఎక్కడ ?
ఇట్లాంటి జీవన గతి లో సో కాల్డ్ 'రిలేక్సేషన్ ' కోసం తపించి పోయే , విష్ణు మాయ లో పడి పోయిన మానవుడు !
ఆ ఉన్నంత కూసింత టైం వినోదానికి కాలక్షేపానికి ఏదన్నా ఉందా అని చూస్తున్నాడు .
మా ఏడు కొండల వెంకన్న లైఫ్ ని బిజి బిజీ చేసి, గజి బిజి చేసి పారే సాడు :) (విష్ణు మాయ మా వెంకన్న దే కదా మరి :)
సో , ఇట్లా ఆలోచిస్తే ఈ కాలపు మానవుడికి, బ్లాగ్ దర్శకులకు కావల్సినిది కాలక్షేపం ఖబుర్లు, బాతా ఖానీ బటానీ లు . ( ఈ టైటిల్లో మీకు ఎవరి బ్లాగు టపా అయినా గుర్తు కొస్తే అది జిలేబి ఊహాత్మకం గా పెట్టిన పేర్లే గాని వ్యూహాత్మకం గా పెట్టినవి కావు అని గుర్తు పెట్టు కోవాలి ! జేకే !)
సో ప్రియ బ్లాగ్ బాంధవుల్లారా ! మీ అభిప్రాయమేమిటి ఈ విషయం మీద ?
ఫుట్ నోట్ : జిలేబి కి అర్థం కాని విషయం ఒకటుంది ఈ కాలం లో కూడా కన్నీటి కుండల, వైషమ్యాల టీ వీ సీరియళ్ళు ఈ జిలేబి లని ఎందుకంత మరీ టీ వీ పెట్టె ముందు బందీ చేసి పారేస్తున్నాయి ? బ్లాగ్ లోకం లో ఉదాహరణ - వనజ వనమాలీ గారి కథలు )
మొత్తం మీద మరో అగ్రిగేటర్ డమాల్ ! బ్లాగిల్లు మూట కట్టే సారు మా 'స్టారు' శ్రీనివాసు గారు.
అదేమిటో ఈ తెలుగు బ్లాగు లోకాని కొచ్చిన ఖర్మ !
ఒక్కటొక్కటే బ్లాగులు మూత పడి పోతా ఉంటె , దానితో బాటు అగ్రిగేటర్ లు కూడా మూట కట్టేయ్యటం !
బ్లాగిల్లు శ్రీనివాసు గారు ఇచ్చిన కారణం - బ్లాగిల్లు కి అంత 'రెస్పాన్స్' రావటం లేదు అని .
బ్లాగులు వ్రాసే వాళ్ళు ఎందుకు వ్రాయటం లేదు అంటే ... అబ్బే అంత 'రెస్పాన్స్' రావటం లేదండీ అని.
ఇట్లా ప్రతి ఒక్కరు చూస్తా ఉంటె మిగిలిన వాళ్ళ కోసమే వ్రాస్తా ఉన్నట్టు ఉన్నారుస్మీ ! జేకే !
(ఈ మధ్య శ్యామలీయం వారి బ్లాగులో కామెంటి జేకే అంటే - జేకే అంటే ఏమిటి అని అడిగారు శ్యామలీయం వారు - అబ్బే జేకే తెలీక పోవటమేమిటి వీరి కి అనుకున్నా ! జేకే !)
ఏమండీ బ్లాగిల్లు శ్రీనివాసు గారు, కూడలి, మాలిక గట్రా వాళ్ళు ఏమి ఆశించి ఇంకా తమ అగ్రిగేటర్ లని నిలబెట్టి ఉన్నారు ?
మరో ఆలోచన వస్తుంది - అగ్రిగేటర్ ల ని పెట్టిన వారు - అగ్రిగేటర్ ని మరీ 'పెర్సనల్' గా చూస్తూ న్నారేమో అని ! బ్లాగులోళ్ళం మేమైతే బ్లాగులకి కామింటులు వచ్చాయా లేదా అని ఆతుర పడుతుంటాం గాని అగ్రిగేటర్ లు 'క్లిక్కులు' వచ్చేయా లేవా అని రోలు కర్ర రూలు కర్ర పట్టుకుని లెక్కెయ్యడం జేసి అగ్రిగేటర్ ని మత పెట్టేస్తే ఇక మా లాంటి బ్లాగులొళ్ళ కి వ్రాసే టపాల కి ఎక్కడ ప్రచారం ఉంటుంది ?
సో బ్లాగిల్లు శ్రీనివాసు గారు మీరు మళ్ళీ మీ అగ్రిగేటర్ ని త్వరతిం గా నే తెరవండి .
ఆ కామింటు ల సెక్షన్ ని హారం లా తయారు చెయ్యండి (exactly like 'haram' comment section) అప్పుడు చూడండి మీ అగ్రిగేటర్ కి వచ్చే హిట్లని :)
ప్రతి తెలుగు వాడు తప్పక చదవాల్సిన పుస్తకం - ఇదండీ మహాభారతం !
తెలుగు వారి కి సులభ శైలి లో మహా భారతాన్ని రంగనాయకమ్మ గారు అందించారు.
ఇందులో కథా పరం గా , అక్కడక్కడా వారి వ్యాఖ్యానాన్ని అందిస్తూ మూల మహాభారతానికి అతి దగ్గిరగా అచ్చ తెనుగులో మహా భారతాన్ని వీరు అందించారు .
దరిదాపుల్లో నాలుగు వందల పేజీ ల లో మహా భారతాన్ని ఎట్లాంటి 'భేషజాలు' , ఉత్కృష్ట ఉపమానాలు లేకుండా కథ ని కథావస్తువు ని యథార్థం గా అందించారు.
వారు అక్కడక్కడ కొట్టిన సెటైర్ నవ్వు తెప్పించ వచ్చు.
కొండొకచో వెటకారం గా అని పించ వచ్చు.
కూసింత వెగటు కలిగించ వచ్చు.
వీటన్నిటి ని పక్క న బెట్టి, ఒక మామూలు సాధారణ జన సమాజానికి ఈ మహా భారత కథ ఏమన్నా విలువల్ని అందిస్తాయా అని వారు ఎక్కు బెట్టిన బాణం మనల్ని ఆలోచింప జేస్తుంది.
వారి సైడు కామింటు లని పక్క న బెట్టి మహా భారతాన్ని ఆస్వాదించ వచ్చు.
సైడు కామింటుల తో సహా చదివితే తల తిరిగ వచ్చు. దానికి వారిని బాధ్యులని చేయ రాదు.
మహా భారతాన్ని ఇట్లాంటి కోణం లో నించి కూడా చూడ వచ్చు అనడానికి రంగనాయకమ్మ గారి పుస్తకం ఒక సర్వోత్క్రుష్ట మైన ఉదాహరణ.
చదవండి . ఆలోచించండి. అన్నింటినీ యధాతధం గా (వారి 'కిక్కుల'ని కూడా) తీసు కోవాల్సిన అవసరం లేదు.
ఈ మధ్య అదేమి విష్ణు మాయయో , గ్రహాల 'పాట్లో' ప్లాట్లో తెలీదు గాని సీనియర్ సిటిజెన్ అయిపోయారు గా ఇక ఇట్లాంటి జబ్బులన్నీ మామూలే అని జిలేబి కే రిటార్టు ఇచ్చె లా ప్రియ బాంధవులు తయారయ్యేరు ! అబ్బా ! జబ్బు పడి లేస్తే దాని మోజే వేరు ! ప్రశాంతత అనగా నేమి ! అని తెలియ వలె నన్న, అయ్యరు గారి తో సేవలు చేయించు కోవాలె అన్నా జబ్బు పడితే నే తెలుస్తుంది ! దేశం లో మళ్ళీ మొన్న వచ్చిన అమావాస్య పాట్లు గ్రహపాట్లు గురించి మళ్ళీ టపా వచ్చేసింది కూడాను మా బ్లాగ్ జ్యోతిష్ శర్మ గారి నించి . కాబట్టి నేను సరి కొత్త గా కొట్టాల్సిన టపా కూడా ఏమీ లేదు :) ఇక భారద్దేశం లో చాలా మంది తమ తమ అవార్డులను (కాగితా ల ముక్కలను, పథకాలను ) తిరిగి ఇచ్చ్చేస్తున్నారు . కాబట్టి నేను కూడా నాకు బ్లాగు లో ళ్లు ఇచ్చిన పథ కాలను అన్నిటినీ తిరిగి ఇచ్చేయా లను కుంటున్నా :) ఇప్పటి కి టపా కబుర్లు ఇంతేస్మీ :) చీర్స్ జిలేబి
అమెరికా లో స్కూలు బస్సు ఆక్సిడెంటు - ఇద్దరు పిల్లలు
బాలార్కుని మార్కు ఇది రాసేసుకో .
ఇండో నేషియా లో ఖాండవ దహనం గురువర్యా
రాసుకో - అగ్ని దేవుడు నెయ్యి కోసం చూస్తున్నాడు .
లెక్ఖ లయ్యేయా ?
ఓ లెక్ఖ బకాయి గురూ !
ఏమిటోయ్ ?
అమెరికా వాడు వడ్డీ రేటు పెంచు దామా వద్దా అని ఆలోచిస్తున్నాడట ....
హు హు హు ! వాడి శ్రాద్ధం దరి దాపుల్లో కి వచ్చేస్తోంది - అమెరికా ఎంబసీ వాడు తనకు వీసా ఇవ్వక పోవడం గుర్తు కొచ్చే స్వామీ వారికి - రాసుకో - మిధునం లో మిడి మిడి పాటు తప్పదు . ధనుస్సు లో శని ప్రవేశిస్తున్నాడు . అయ్యిందా లెక్ఖ ?
ఓ మోస్తరు అయినట్టే గురువు గారు !
ఓకే ! వీటన్నిటిని మన రీసెర్చ్ విభాగానికి పంపి తీక్షణం గా గ్రహ గతుల్ని వీటి కనుగుణం గా సంశోధించు !
అట్లాగే గురువరా !
రాబోయే కాలం లో ఏమి జరుగును గురువరా ? ఎనీ క్లూ ?
బిడ్డా ! రాబోయే కాల రహస్యం శ్రీవిద్యా రహస్యం ! అది అందరికి చెప్ప బడదు ! కాలం దాట గానే పేపర్లో వచ్చె అన్ని బ్యాడ్ న్యూస్ లు సంకలనం చేసుకుని రా నా దగ్గిరికి వాటన్ని టికీ మూలాలను గ్రహ గతులనించి నీకు లాగి చూపిస్తా :)
గ్రహ గతులు అన్నింటి నీ నిర్దారిస్తాయ్ అవన్నీ నీకు అర్థం కావడానికి ఇంకా చాలా కాలం పడుతుంది - మొన్న అమావాస్య వచ్చింది చంద్రుణ్ణి చూసేవా ?
చంద్రుడు ఒట్టేసి కనబళ్ళేదు గురూ :)
శిష్యా ! నాకు నువ్వు తగిన పరమానందయ్య శిష్యుడవే !
జై బోలో గురు మహారాజ్ కీ ! జై జై జై! విజయీ భవ ! రాబోయే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఏమి జరుగును గురు మహారాజ్ !
గుండు గురువు బవిరి గడ్డం తడివేరు ! - ఇరవై తొమ్మిదో తేది చెబ్తా నీకు ఆ రహస్యం :)
కశ్మీరీ శైవ సంప్రదాయం లో - సంక్షిప్త మైన సూత్రీకరణ కాబడ్డ ప్రత్యభిజ్ఞా హృదయం -అభినవ గుప్తుని శిష్యుడైన క్షేమ రాజ క్రోడీ కరించిన కృతి . అభినవ గుప్తుడి కాలం పదవ శతాబ్దం అని ఒక నిర్ధారణ . ఆ ప్రకారం చూస్తే ఈ క్షేమ రాజ ఆ కాలపు వాడై ఉంటాడు .
చిన్ని చిన్ని పదాలతో మేరు సమాన మైన భావాన్ని ఈ పుస్తకం లో చూడ వచ్చు .
కామెంటరీ లేకుండా చదవటం నా వరకైతే బెటర్ .
కాని అందులోని 'nuances' ని తెలుసుకోవా లంటే వ్యాఖ్యానం/భాష్యం చదవకుండా అర్థం కాదేమో . బ్రహ్మసూత్రముల లా ఇదీ సూత్రీ కరించ బడిన పుస్తకమ్.
ఆ కాలం లో అన్నీ సూత్ర రూపం లో చెప్పడం ఆనవాయితీ !
(దానికి భాష్యం/వ్యాఖ్యానం/వ్యాఖ్యానం పై మరో వ్యాఖ్యానం చెప్పు కోడా నికి వేరు వేరు కాలం లో వారి శిష్యులు మళ్ళీ మళ్ళీ పుడతా రనుకుంటా వాటికి అర్థం తెలుసు కోవడానికి, అర్థం చేసుకోవడానికి,, పరమార్థం చెప్పు కోడానికి . జేకే ! (అంతా కాలమహిమ ! విష్ణు మాయ యాయే మరి !) -
మొదటి సూత్రం తో నే మతి పోతుంది ; certainly you will be taken to a different dimension later on !
Enjoy!
చితిహి స్వతంత్రా విశ్వసిద్ధి హేతుహు !
ప్రతి - ప్రత్యక్ష
అభి - ఇప్పుడే (హిందీ లో अभी ఇందులో నించే వచ్చిందే మో )
జ్ఞాన - జ్ఞానం
హృదయం - The heart of
ప్రత్యభిజ్ఞ - Recognition
(The heart of (secret of) 'Recognition')
ప్రత్యక్షం గా ఇప్పటి కిప్పుడే జ్ఞానమైన హృదయం . An Heart that has realized in the 'Now'.
మనసు--సమస్య
-
*మనసు--సమస్య*
*మనసు సమస్యను సృష్టించుకుంటుంది. సమస్య పరిష్కారం కాలేదని బాధపడుతుంది.
సమస్యను మొదటిలోనే తుంచేస్తే సమస్య లేదు. *
*ఎలా? అన్నది ప్రశ్న.*
...
శర్మ కాలక్షేపంకబుర్లు-పాలకోసం రాళ్ళుమోయడం !
-
Posted on ఏప్రిల్ 30, 2013 24 పాలకోసం రాళ్ళు మోయడం. “పాలకోసం రాళ్ళు
మోయడం”అనే నానుడి తెనుగునాట విస్తృతంగా వాడతారు. దీని అర్థం విస్తృత ప్రయోజనం
కోసం కష్టపడట...
శర్మ కాలక్షేపంకబుర్లు- పనసకాయ దొరికినప్పుడే………….
-
పనసకాయ దొరికినప్పుడే….……… పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నారు అని
నానుడి.. ఇదేంటో నాకు అర్ధంకాలేదు నిన్నటి దాకా. ఈ మధ్య భాగవతం మూలం చదువుతూ
పోతనగారు ...
శర్మ కాలక్షేపం కబుర్లు-1- గురు, దైవ వందనం
-
*— శర్మ కాలక్షేపం కబుర్లు—*
*Posted on సెప్టెంబర్ 23, 2011 *
*గురు, దైవ వందనం*
కన్న తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు. పెంచిన తల్లి తండ్రులకు
సాష...
పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్!
-
మన్ది పవిత్ర భారద్దేశం, ఈ దేశంలో పుట్టినందుకు మనం తీవ్రంగా గర్విద్దాం (ఇలా
గర్వించడం ఇష్టం లేనివాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు). మన్దేశంలో ప్రజలే
పాలకుల...
ఒక సినిమా జ్ఞాపకం (స్వాతిముత్యం)
-
అవి మేం చదూకునే రోజులు. మాకు సినిమాలే ప్రధాన కాలక్షేపం. సినిమా
బాగుంటుందా లేదా అనేది ఎవడికీ పట్టేది కాదు, సినిమా చూడ్డమే ముఖ్యం.
అవ్విధముగా - ప్రవాహంలో ...