కొండ దేవర ఉలిక్కి పడ్డాడు !
పంచ దశ లోకం లో శ్యామలీయం అనే భక్తుడొకాయన ఎవరో V.I.P లకి V.I.P లడ్డులు వేరు గా ఇవ్వాలా అని ప్రశ్నిస్తే, టాం అని వీరు 'ఆయ్ వేరే లడ్డూలు మాత్రమేమిటి ఖర్మ వాళ్ళ కోసం V.I.P ఏడుకొండల దేవర దేవాలయం కట్టించ మని సలహా ఇచ్చేరు .
ఆ, ఇదేదో సలహా మరీ బాగుందే , అవునుస్మీ , మనకు ఈ అవిడియా ఇంత దాక తట్ట లేదుసుమీ అని కొండ దేవర పాలక మండలి ముక్కు మీద వేలు వేసుకుని మరీ హాశ్చర్య పోయి, వెంటనే తీర్మానించేరు 'ఇక స్పెషల్ గా కొండ దేవరకి కొత్త గా V.I.P దేవాలయం ఒకటి కట్టి పడేసి, ఆయన్ని ఆ వచ్చీ పోయే V.I.P లకి కట్టి కుదెయ్యాలని !
అదిగో ఆ ఆలోచనతో నే కొండ దేవర ఉలిక్కి పడ్డాడు !
పంచ భక్ష పరమాన్నం లో ఎప్పుడో ఒకప్పుడు పంటి క్రింద రాయి తగిలితే పొతే పోనీ అనుకొవచ్చు. అట్లాగే భక్త కోటి సమూహం లో అప్పుడప్పుడు వచ్చే V.I.P వాళ్ల కష్ట నష్టాలు విని ఓస్ వీళ్ళది ఏమి బాధ , ఆ అశేష జన వాహిని బాధల కన్నా నా వీరి బాధ అని కొట్టి పారెయ్య వచ్చు !
ఇప్పుడు స్పెషల్ గా తను ఈ V.I.P ల కోసం పొద్ద స్తమాను కాళ్ళు అరిగి పోయేలా నిలబడి వేచి ఉండి వాళ్ళు చెప్పే కష్ట నష్టాలు వింటూ ఊరుకోవలసిన దే నా !
ప్చ్ , తన కంటూ ఒక అభిప్రాయం ఉంటుందని, తన్ను కన్సల్ట్ చేసినారా ఈ కమిటీ వాళ్ళు ! ప్చ్ తాను పేరుకి పెరుమాళ్ళు . తన మొర వినే నాధుడు ఎవడూ లేదే మరి అని నిట్టూర్చాడు
అంత లో ఓ పరమ బికారి అంత సేపు జన వాహిని లో నిలబడి కాళ్ళు నొప్పెట్టి ఆ స్వామీ వారి ముందు వచ్చి తనకు స్వామీ వారిని చూసే ఆ ఒక్క క్షణానికి కలిగిన అదృష్టం కలిగినందులకు మహాదానంద భరితుడై గోవిందా గోవిందా అన్నాడు !
గోవిందుడి ఆనంద భాష్పాలు ఆ బికారి కి తీర్థ మయ్యింది వాడు భక్తీ తో కళ్ళ కద్దుకుని మళ్ళీ గోవిందా అన్నాడు .
పొతే పోనీ లే , ఇట్లాంటి భక్తులకోసం తను మరో VIP గాడ్ అవతారం దాలిస్తే ఏముంది ! వీళ్ళు అట్లీస్ట్ సంతోష పడతారు అని తృప్తి పడ్డాడు !
Very Intimate Perumaal కోవెల రూపు దిద్దు కో సాగింది !
కథ కంచికి మనం నిదురకి !
గోల్ మాల్ గోవిందా !!
చీర్స్
జిలేబి
(శ్యామలీయం వారి ప్ర. జ. కామెంటు చదివాక !)