పూర్వ కాలం లో ఆకాశ రామన్న ఉత్తరములు వచ్చేవి !
కాలాలు మారినై !
కాలం తో బాటు e మాధ్యములు వచ్చినై.
బ్లాగు లోకములు వచ్చినై.
అయినా , ఆకాశ రామన్న లు ఎవెర్ గ్రీన్ హీరో లు !!
వారే మన e తరం అనానిమస్సులు ! వారికి నమస్సులు !
వారు లేనిదే ఈ భువి ఉంటుందా అన్నది నా ధర్మ సందేహం ! ఆకాశం పైనా ఉంటేనే కదా క్రింద భువి ఉండును!
మిస్సులు కస్సుమంటే , ఈ అనానిమస్సులు బుస్సు మందురు.
మాష్టారులు బెత్తం పడితే , వీరు పంతం పట్టెదరు.!
ఔరా, అయ్యలారా మీరేమైనా బ్లాగు లోకమును గుత్తగా కోనేసుకున్నారా అని అందురు !
వీరికున్న 'gut' వేరే ఎవరకీ ఉండదని నా సవినయ అభిప్రాయం !
దొంగ గారికి ఎ ఇల్లు తాళం లేక, తాళం సరిగా లేక ఉన్నదో తెలవడం అన్నది చోర కళా నైపుణ్యము !
తలుపు లు జాగ్రత్తగా వేసి ఉన్న కూడా చోరీ జరుగక ఉన్నదా ? కావున అనానిమస్సులు కాక పోయినా కూడా, ఎవడైనా , ఓ కందిరీగ అన్న పేరు తో కామేన్టడం మొదలెడితే మన చెవులు హోరుమన క ఉండునా ?
వీరి కున్న gut కి కారణం బెద్ది ? వారి నామ ధేయమే కదా ? నామమేమి ? అజ్ఞాత ! అనగా ఏమి ? జ్ఞాతుడు కాని వాడు. అనగా , సర్వం తెలిసిన వాడు కాదని. అనగా కొంత తెలిసిన వాడని. అనగా వాడికి ఎంతో కొంత ఆ మేటరు లో పాయింటు లోపమో తెలిసినవాడు అని అర్థము కదా !
సరే, ఇంతకీ ఈ అనానిమస్సులంటే మనకు ఎందుకు పడదు ? ఎవరైనా ఆలోచిన్చినామా? వారికి తగినన్ని స్థానములు మనము గాని, ఈ సంకలిని నిర్వాహకులు గాని సముచిత స్థానము కల్పించినారా ? లేదే ? వారికి సముచిత స్థానము వెంటనే హారం అధినేతలు కలిపించినచో ఈ అననిమస్సులు సరియిన విధముగా సత్కారము పొందిన వారై భుక్తాయసములతో తీరికగా ఆలోచించి కామెంటు దరు కదా ?
వీరి కై నేనొక మహత్తరమైన ప్రణాళికని హారం అధినేతలకు ప్రతిపాదిస్తున్న్నాను. !
అది ఏమనగా, వారు హారం లో నే ఎ టపా పైన అయినా అన్య మనస్కులైన , వెంటనే అననిమస్సులుగా బుస్సు మను టకు సదవకాసము కలిగించవలె !
ఎందుకనగా చాలా బ్లాగర్లు అనానిమసులకి ఆస్కారము కలిపించకుండా తమ బ్లాగులను పకడ్బందీ (మళ్ళీ ఈ పదమును గమనింపుడు - బందీ ! - బందీ అనగా ఎవరు ? తప్పు చేసిన వాడు గదా - మనలను మనం పకడ్బందీ చేసుకున్నచో దీని అర్థం ఏమి ? మనం తప్పు చేసినవారలమని కదా అర్థము ?) గావిన్చుకున్నారు కాబట్టి, ఈ అవకాసమును హారము నేతలు కలిపించవలె నని కోరడము జరిగినది.
అనానీమస్సు,
అన్నా, నీ మనస్సు తెలియక
అనాడీ వాణి గమనించక
మేము చేసిన తప్పుల మన్నించి
మమ్ము కరుణించ వయ్యా
'అనాధ' బ్లాగ్ లోక పోషకా - అజ్ఞాతా !
చీర్స్
జిలేబి.