Friday, December 16, 2011

బుజ్జి పండు తెలుగు చదువు - 5 - (శంకర విజయం - 4 )

సూటిగా గోలీ వారు బుజ్జిపండు ని బరిలోకి లాగడం తో , సభాస్థలి బుజ్జి పండు ఏమి జేప్పునో అని కుతూహల పడి ఆతురతతో బుడతడిని గాంచినది !  బుడతడు నిదానముగా సభా స్థలి ని కలయ జూసి, పండిత గోలీ శాస్త్రు లవారి కి ప్రణామం బులు వొనరించినాడు .

గులువులు హనుమచ్చాస్లీ గాలికి నమస్సులు.

" అజాడ్యం వాక్ పటుత్వం చ హనూమత్ స్మలనాత్ భవేత్ " అని మా మాత చెప్పాలు.  మీలు వాలి నామధేయులు. కావున మీ స్మలణతో మా మాత గులించి చెబుతాను -

"నడకలు నేల్పెను
నడవడికలు నేల్పెను
నడతను నేల్పెను
బుడి బుడి నడకల
బుజ్జి పండు
బుద్ధుడే అవుగాక ! అని మా మాత నాకు అన్నియు నేల్పెను" అన్నాడు బుజ్జి పండు.

గోలి వారికి ఈ బుడతడు హనూమంతుడు కన్న రాముడే అయ్యాడు ఆ బుజ్జి పలుకులు విని.

ఈ మారు చింతా వారు, 'ఈ గోలీ వారూ బోల్తా పడ్డారే సుమీ ' అని బుజ్జి పండు ని వుద్దేశించి,

" బుజ్జి పండు - అమెరికా దేశములో తెలుగు నేర్చుకొనుటకు ఎన్నో పుస్తకములు వున్నాయి కదా ? వాటితోనే నీవు నేర్చుకోవచ్చు గదా ? ఇలా శంకరాభరణం కొలువు లో అంతర్జాల వాసం అవరసరమా ? " అని బుజ్జి పండుని 'పరి' శోధించారు!

దానికి బుడతడు, క్షణ మాత్రములో , "చింతావాలు! మస్తకమును మించునే పుస్తకమ్ము " అని తడుముకోకుండా జవాబు చెప్పాడు.

బుజ్జి పండు అంత వేగం గా తనకు సమాధానము చెప్పునని  చింతా వారు ఎదురు చూడ లేదు !

అయినను కొంత కాలం మునుపే ఈ శంకరాభరణం సదస్సు 'మస్తకమ్మును మించునే పుస్తకమ్ము ' అని ఘంటా పధం గా ఘోషించింది కూడాను! కాబట్టి వేరుగా చెప్పనలవి కాదు !

పండిత నేమాని వారి వైపు సభా సదస్సు చూసింది. శంకరార్యులు కూడా చిరు నవ్వు నవ్వుతూ, ' ఆర్యా ! పండిత నేమానీ సన్యాసీ రావు గారు మీ అభిప్రాయం ? " అన్నారు.

పండిత నేమాని వారు సభను ఉద్దేశించి,

మిత్రులారా!

పద్య కవిత్వము ఎవరికి అలవడును అని ఒకపరి పరికించుచో -పెద్ద పెద్ద చదువులు కలిగిన వారు ఒక పాదము కూడా చెప్ప లేక పోవచ్చును;  సామాన్యులైన వారు చక్కని సహజ కవిత్వముతో  జనరంజకమైన కవిత్వమును చెప్ప గలుగుచున్నారు.  వాగ్దేవి యొక్క సంపూర్ణ  అనుగ్రహము మరియు పూర్వ జన్మల సంస్కారము గలిగిన వారికి పద్య  కవిత్వము అబ్బును. ఈ  మంచి యోగమును ఈ బాలుడు పొందిన వాడిలా వున్నాడు.  మనము ఈతనికి చదువులు నేర్పుతూ ఇంకా  ప్రోత్సాహముతో ముందు సాగుదాము అన్నారు.

ఈ పలుకులు విని

చింతా వారు ఆనందోత్సాహముతో ,

" వరహృదయమ్మునన్
తెలుగు భాషను చక్కగ నభ్యసించి చాతురి
మెరయన్ కవిత్వమున దొడ్డతనమ్మును
జూపుచున్ సుధీవరుల ప్రశంసలొందు బుజ్జి పండూ" అని ఆశీర్వదించి, నిరతము వృద్ధి చెందుచును నీ కృషి యిచ్చును సత్ఫలమ్ములన్ " అని మెచ్చు కున్నారు కూడాను.

సురా బ్లాగీయం సుబ్బారావు గారికి బుడతడి నడవడిక, నడత, మాటలు చాలా నచ్చాయి. వారు వెంటనే ఆశువుగా
"తల్లి దండ్రుల యందున తల్లి మిన్న
సుతుని బాగోగు లన్నియు చూచు చుండి
కంటికిని రెప్ప యట్లయి కాచు చుండు
దైవ మున్న దె ? సుతునకు తల్లి కంటె ? "

అని బుజ్జి పండు మాతని కొనియాడి, బుజ్జి పండుని మనసారా ఆశీర్వదించారు !

శంకరార్యులవారు, సభనుద్దేశించి,

మన భాషా పండితులు అందరూ కూడా అంకిత భావంతో భాషాభిమానంతో భాషాసేవ చేస్తూ తమను నమ్మి తమదగ్గర విద్యకొఱకు వచ్చే విద్యార్థులకు ధర్మ బద్ధంగా విద్య గరుపుతూ ఆంధ్రవిద్యార్థులకు ఆంధ్ర భాషాభిమానం పెరిగేలా చేయాలన్న కోరికతో ఉన్నవారే ! వారు గురుతరమైన గురువు భాద్యతలను నెరవేర్చి, బుడతడైన బుజ్జి పండుని తమ తమ విధానాల మూలముగా తమ శిష్యునిగా చేసుకోనటం నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నది.
తెలుగు వారంత కలసిన వెలుగు బాట , మలచి పూయించి వచ్చు మావి తోట ! తెలుగు వారన్న వెలుగుల జిలుగు వారు , యెచట నున్నను గెలుపొందు రచటె వారు! కాబట్టి ఈ బుడతడైన బుజ్జి పండుని మన సభా ప్రాంగణమున మనము మరింత తెలుగు నేర్చుకొనుటకు, మనము ప్రోత్సాహము ఇచ్చెదము !

లక్కాకుల వారు మొదట చెప్పారు- మనము నది అయి ప్రవహించా లని. మనము జీవ నదులమై ఈ భువి మండలమున తెలుగు వ్యాప్తికి మన వంతు కర్తవ్యం నేరవేర్పుదాము ! ఈ బుజ్జి పండు రాక మన సభా స్థలి కే వన్నె తెచ్చినది. అని చెప్పి బుజ్జి పండు వైపు తిరిగి


"శతమానం భవతి  బుజ్జి పండు" అని మనసారా దీవించారు.

ఇందరి గురువుల ఆశీర్వచనములతో బుజ్జి పండు రేఫా లోపమూ మాయమై పోయినది.

శ్యామలీయం వారు, లక్కాకులవారు చేతిలో చేయి వేసి సభాష్ అని భుజాలు తట్టుకున్నారు

రాజేశ్వరీ అక్కయ్య గారి గురించి చెప్ప వలెనా ?

చిన్న నాటను చేయగ చిలిపి పనులు , తల్లి చాటున ముద్దుల తనయు డనగ, ఈ బుజ్జి పండు ఎదుగ వలె జగద్గురు వనంగ! అని మనసారా కోరుకున్నారు వారు !

సభా స్థలి లో గణ గణ గంట మోగింది.

బుజ్జి పండు ఆశువుగా  అందుకున్నాడు. 

గదిని గోడకున్న గడియారమున గంట,
చర్చి గంట, పాఠశాల గంట,
గిత్త మెడను గంట,కేశవు గుడి గంట,
టంట, టంట, టంట, టంట, టంట. !!!


శ్రీ పతి వారు స్వస్తి వాచకము పలికినారు.

శ్రియే జాత శ్రియ అనిర్యాయ శ్రియం వయో జనిత్రుభ్యో దధాతు !
శ్రియం వసాన అమృతత్వ మాయన్  భజన్తి సద్యః  సవితా విధధ్యూన్ !
శ్రియా ఏవైనం తచ్చిద్రియా మా ధదాతి !
సంతత మృచావషట్ కృత్యం సంతతం సదీయతే ప్రజయా పశుభిహి!
య ఏవం వేద !

ఇంతటి తో బుజ్జి పండు తెలుగు చదువు లో  శ్రీ శంకర విజయం అను అంకము సమాప్తము.


బుజ్జి పండు శంకరాభరణ కొలువులో  తెలుగు పరి పూర్ణముగా నేర్చుకుని, తిరుగు దారి అమెరికా కి పట్టాడు.

మధ్య దారిలో ఆతని విమానము ఫ్లైట్ లే ఓవర్ లో , జర్మెనీ దేశంలో  ఫ్రాన్క్ఫర్టు అంతర్జాతీయ విమానాశ్రయం లో ఆగింది. లే ఓవర్ సమయం లో బుజ్జి పండు కునుకు తీస్తూండగా 'కిడ్' నాప్ కాబడి నాడు. !

దీనికి మూల కారకులు  కొందరు భామలు ! వారిలో  సూత్రధారి అయినవారు  మధుర వాణీ గారు - జెర్మనీ  వాసులు !

వారు 'ఈ' కిడ్ - నాప్ ఎందుకు చేసారు ? దాని కథా కమామీషు ఏమిటి ? రాబోవు అంకము- బుజ్జి పండు తెలుగు చదువు - భామా విజయం  కై వేచి  చూడుడు.!


(సశేషం)

Thursday, December 15, 2011

ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ - పై వారమే- సరి కొత్త ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే

ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ - పై వారమే

 సరి కొత్త

ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే

మీ అభిమాన బ్లాగర్ తో

ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే

బ్లాగ్ముఖీయం !

ఎవరా బ్లాగర్ ?

ఏమిటి వారి గొప్పదనం

ఇది ఒక

ABN- ఆంధ్ర జిలేబి సహ సమర్పణ

స్పాన్సరేడ్  బై

వరూధిని బ్లాగ్స్పాట్ డాట్ కాం

ధమాల్ ధమాల్ డబాల్ డబాల్!

say చీస్ to  జిలేబి !

చీర్స్
జిలేబి.

Wednesday, December 14, 2011

బుజ్జి పండు తెలుగు చదువు - 4 - (శంకర విజయం - 3)

శ్యామలీయం వారు, 'నెమిలి' యై చెంగున ఎగిరి, బుజ్జి పండుని తమ మూపురము పై నిడుకుని సభా ప్రాంగణమున తిరిగ రాగా, ఆ షణ్ముఖు డే వచ్చాడా అన్నంత గా ఆ సభా ప్రాంగణము దివ్య కాంతులతో ప్రజ్వరిల్లినది. !

శ్యామలీయమైన నెమిలి పై నుంచి బుజ్జి పండు నిదానముగా దిగాడు.

ఆతన్ని జూసి సభా స్థలి అచ్చేరువొందింది. ఈ బుడతడి ముఖమున ఏదియో తెలియరాని జ్యోతి (ఆ మాత జ్యోతిర్మయీ మహత్వమేమో ?)  ప్రస్ఫుటిస్తోంది.

ఇది అని చెప్ప నలవి కానిది.

షణ్ముఖుడు పంచకక్షం కట్టినవాడు.

ఈ బుడతడు జీన్స్ ప్యాంటు పై టీ షర్టు ధారి యై వున్నాడు.  కంటికి హారీ పాటర్ అద్దములు కూడాను. నెత్తి పై నామము. కాలికి నైకే షూస్.

షణ్ముఖుడు వేలాధయుడు. ఈ బుడతడు శర్కరీ ధారీ !

 ఒక చేత శర్కరీ , మరియొక్క చేత అంకోపరుండై వున్నాడు వీడు.

బుజ్జి పండు  సభా స్థలి కి ప్రణమిల్లి ,

"సభ యందు  వెలసిల్లిన పెద్దలన్దలికీ నా నమస్కాలములు ! నా పేలు బుజ్జి పండు , నేను మీ చెంత తెలుగు  నేల్చు కొనవలె నని మా మాత ఆదేశానుసాలముగా ఇచ్చటికి వచ్చితిని " అని,

రాజేశ్వరీ అక్కయ్య వారి వైపు తిరిగి , " నమో మాతా , నమో నమః ! పెద్దమ్మ వాలికి నమస్సులు " అని 'స్పెషల్' గా నమస్కరించడం తో రాజేశ్వరీ అక్కయ్య వారు తబ్బి మొబ్బిబై 

"రారార కన్నయ్య , రార వరాల పంట, రారార గారాల పట్టి ,తెలుగు నేర్వంగ " అని మురిసి పోయింది.

సభాస్థలి బుడతడి వైపు ఒక్క మారు , రాజేశ్వరీ అక్కయ్య వైపు ఒక్కమరూ చూసింది. 

ఈ మాతలు ఎల్లప్పుడూ వెన్నె హృదయులే సుమా అని అచ్చెరువొంది న వారు, వీరు వెన్నపూసై కరిగి పోవడానికి అర నిముషము చాలు సుమా అని తీర్మానించు కున్నారు.

బుజ్జి పండు ఈ మారు శంకరార్యులవైపు తిరిగి నమస్కరించి,

"అందమగు బ్లాగు నిలిపిలి యందలి
హ్లుదయముల నిలిచి యానందము
పెంపొందిచిన గులువు గాలికి
నమస్సులు కవివల , జేజే"

అని సాదర ప్రణామము గావించాడు. 

ఈ మారు  శంకరార్యుల వారికి సందేహం వేసింది,  " ఈ బుడతడు, మరీ తన బ్లాగు మొత్తం పరిపూర్ణముగా శోదించి వచ్చి వున్నాడేమో సుమీ " అని సందేహ పడిన వారై చిరునగవు ఒకటి నొసగి పండిత నేమాని వారి వైపు జూసినారు, ఆర్యా మీరు ప్రశ్నింపుడు బాలకుడిని అన్న చందాన.

పండిత నేమాని వారు, ఔరా , ఈ శంకరార్యుల వారి చాతుర్యమే చాతుర్యం - అన్నిటికీ నన్నే ముందు వుండమనటం అనుకుని,

ప్రకాశాముగా  " బాలకా, నీవు ఇచ్చట తెలుగు నేర్చుకొనుటకు మీ మాత పంపగా వచ్చినావని మా శ్యామలీయం మాష్టారు జెప్పారు. మంచి ప్రయత్నమే. కానీ వచ్చినవాడివి ఎటువంటి వ్రాత పుస్తకములు లేకుండా వచ్చి నావే" అని ధర్మ సందేహం లేపారు.

అసలు బాలకా నీవు నిజంగానే నేర్వడానికి వచ్చినావా అని వారు నేరుగా అడిగి ఉండవచ్చు. కాని సూక్ష్మం గా వారు ఈ లా ప్రశ్నించారు. అది వారి చాతుర్యం.

బుజ్జి పండు తడుము కోకుండా టపీ మని,

" అయ్యా పండిత నేమానీ గులువా - హస్తభూషణముగ అంకోపలుండగా  పుస్తకం బదేల హస్తమందు?" అని చిరు నగవుతో జెప్పి "అయ్యా చేత మా మాత నొసంగిన 'శల్కలీ ' సహిత ఇచ్చట వచ్చి వున్నాను ' అన్నాడు.

ఈ బాలకుడి రేఫమును ఎటుల సరి దిద్ద వలె నని శ్యామలీయం మాష్టారు తీవ్రముగా ఈ మారు చింతించడం మొదలెట్టారు.

" ఆర్యా, పండిత నేమాని వారు , ఆ బుడతడు శర్కరీ అన్న పదాన్ని అలా 'శల్కలీ' అన్నాడు. రేఫాలోపము అంతే.
ఒక చిన్న సందేహము నాకు ఇది దుష్ట  సమాసమేమో " అన్నారు శ్యామలీయం వారు - నానాటికీ తీసికట్టు నాగంభట్లు అయిపోతున్నానే సుమీ అని కొంత నివ్వెర పడుతూ.

ఆ రేఫా లోపమును మీరి ఆ బుడతడు జెప్పిన సమాదానమునకు పండిత నేమాని వారు సంతసించి,

" శ్యామలీయం మాస్టారు, మీ సందేహ నివృత్తి వేరుగా చర్చించ దెము , ముందు ఈ బుడతడి సమాధానం మాకు బాగుగా నచ్చినది " అని ఆప్యాయముగా తన మనవణ్ణి జూసినంత గా బుజ్జి పండుని గాంచి నారు పండిత నేమాని వారు. మనవళ్ళ వయసులో వున్న పిల్లలని గాంచిన తాత గార్లకు ఎల్లప్పుడూ సంతోషదాయకమవడం ప్రకృతి సహజ మే గదా!

పండిత నేమానీ వారు ఇంత శీఘ్రం గా కరిగి పోతారని అనుకోని గోలీ వారు దీర్ఘముగా బుడతడు బుజ్జి పండు ని గాంచి,

"నాయనా బుజ్జి పండు.. నీ ఇచ్చుకని మేము మేచ్చితిమి. అయినన్ను , మీ మాత మాట మీదుగా ఇచ్చటికి వచ్చి నాడవని అంటున్నావు. మరి మీ మాత గురించి నీకు తెలిసిన ఒక పద్యము జెప్పుము అని ఒక బాణాన్ని ఎక్కు పెట్టారు సూటిగా. వారు పేరు కు తగ్గట్టు గోళీ సూటిగా వేయుదురు -మధురమైన పద్యము ముందు వారు "తేనె రుచిని జూడ తీయదనము లేదు - పటిక బెల్లమందు పసయె లేదు - చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు"  అని అంతర్జాల పథముగా నొక్కి వక్కాణించినవారు కూడాను!

ఇలా సూటిగా గోలీ వారు బుజ్జిపండు ని బరిలోకి లాగడం తో , సభాస్థలి బుజ్జి పండు ఏమి జేప్పునో అని కుతూహల పడి ఆతురతతో బుడతడిని గాంచినది !

బుడతడు నిదానముగా సభా స్థలి ని కలయ జూసి, పండిత గోలీ శాస్త్రు లవారి కి ప్రణామం బులు వొనరించినాడు .

(సశేషం)

Sunday, December 11, 2011

బుజ్జి పండు తెలుగు చదువు - 3 - (శంకర విజయం - 2)

సభా ప్రాంగణమున బుడతడి గురించి చర్చా ఘట్టము

శ్యామలీయం మాష్టారు సభా ప్రాంగణమున ప్రవేశించి పిడుగు బుడతడి రాక ని కవి పండితాదులకి తెలియజేసారు.

"మన ఈ కవితా ప్రాంగణమున ఆ బుడతడు ఏమి నేర్చుకునును? దీనికి కొంత తెలుగు జ్ఞానము కలిగిన వారై , గ్రాంధికము తెలిసిన వారై వుండిన కదా ఏమైనా వారికి అర్థమగును ? అందులోనూ , బుడతడు అంటున్నారు శ్యామలీయం వారు . అంత చిన్న పిల్లవాడు మనతో ఎలా సంభాషించ గలడు ? "అన్న పండిత నేమాని వారి  పృచ్చ తో సభా ప్రాంగణమున కలకలము, మంచి విషయము చర్చకు వచ్చినది అన్న సంతోషము వారిలో కలిగినది.

ఈ ప్రశ్న కి స్వయముగా సమాధానము జెప్పక ఎప్పటి వలె శంకరార్యులవారు అష్ట దిగ్గజముల వైపును, మీదు మిక్కిలి పండిత లోకమును గాన్చినారు చిరునగవుతో , మీ సమాధానం ఏమిటి జెప్పుడు అన్నట్లు. ! ఆర్యులవారు ఎప్పుడు తమ అభిప్రాయమును మొదటే జెప్పరు. అది వారి సొబగు. అప్పుడే కదా కవితా లోకమున ఇంద్రధనుస్సులు వెల్లి విరియును !

లక్కాకుల వారు వెంటనే లేచి, 'అయ్యలారా, మనం ఇంత సంకోచించ రాదు. మనము వృద్ధులమై పోతున్నాము. ఈ సభ మనతో నే ముగిసి పోవలెయునా ? నది పారును. తటాకము ఒక్క చోటే ఉండును. మనము తటాకం వలె ఒక్కరే ఉన్నాము. మనము నదియై పారవలె. అప్పుడే కదా ఈ కవితా లోకము అభివృద్ధి చెందును ? కాల ఘట్టములో చూడుడు, నదీ ప్రవాహక ప్రదేశములలో నే కదా జన జీవనము ? కావున నా అభిప్రాయం , మనము నదియై  పారవలె. మనతో బాటు చిన్న కాలువలు రావచ్చును. అవి కొంత కాలం తరువాత మనలో కలసి, ఆవియును నదియై , మహానదియై రాబోవు కాలమునకు స్ఫూర్తి నిచ్చుదురు " అని భావవేశాముతో తమ నిర్దుష్ట అభిప్రాయమును తెలియ జేసినారు.

ఈ మారు శ్యామలీయం వారికి  'భేషో లక్కాకుల మాష్టారు' అని మొదటి మారు అనాలన్న సంతోషము గలిగినది. తన మనసున వున్న మాటయే వారు కూడా అనేయటం తో వారికి ఇక బ్లాగ్కామెంటు ఇవ్వటం కుదరక శ్యామలీయం వారు లక్కాకులవారికి బ్లాగ్కామ్ప్లిమెంటు ఇచ్చి ముసి ముసి నవ్వులతో తమ ఆనందాన్ని తెలియ జేశారు.

ఇక మిగిలిన మాష్టార్లు , ఓ మోస్తరు గా , తమ అభిప్రాయమును లక్కాకుల వారి వలె తెలియజేసారు, తమదైన స్వంత శైలి లో. రాజేశ్వరీ అక్కయ్య గారికి మొదటి మారు సంతోషం వేసినది. ఇప్పటిదాకా అందరు పెద్ద మనుషల సాంగత్యం తో తన చిలిపిదనం కట్టు బెట్టి కొంత గంభీరం గా ఉండవలసి వచ్చే. ఈ బుడతడి రాకతో వారి మాతృ హృదయము కొంత ఊరట జెందినది.

పండిత నేమాని వారు ముసి ముసి నవ్వులతో, మొత్తం చర్చని గమనించి, 'ఆర్యులారా, నేనలా మొదటే అనడం వల్ల మన చర్చా కార్యక్రమము రమ్యముగా జరిగినది. గురువు గా తమ మొదటి కర్తవ్యం శిష్యులలో ఉత్సుకతతని నెలకొల్పటం ! ఆ కర్తవ్యమును నేను సరిగ్గా నెరపినానని భావిస్తాను ! ఇక మనం శంకరార్యులవారి అభిప్రాయమును తెలుసు కొందుము ' అని ఆర్యులవైపు చూసారు వారు.

శంకరార్యులవారేమైనా తక్కువ వారా ? నాలుగు పదుల సంవత్సరం అధ్యాపక వ్రత్తి ని కడు రమ్యముగా గావిన్చినవారు. వారు అవుననీ కాదనీ అనకుండా , ఎప్పటి వలె,
' ఆర్యులారా, మనం ఏదైనాను సమస్యా పూరణము ద్వారానే కదా అన్నిటికి పరిష్కారము గావిన్చేదము. కావున ఈ బుడతడికి కూడా ఒక ప్రశ్న ఇచ్చెదము . వాడు దానికి జెప్పు జవాబు బట్టి మనము తీర్మానించ వచ్చును ' అని శ్యామలీయం వారి వైపు తిరిగి, ' శ్యామలరావు గారు, ఆ బాలకుడు జేప్పినది ఏమి ? తన మాత మాట గా వచ్చితి నని కదా ? " అన్నారు

' అవును ఆర్యా' అన్నారు శ్యామలీయం మాష్టారు. ' ఇందులో ఏదైనా వేరే సూక్షమ్ము ఏదైనా ఉందా ' అని ఆలోచిస్తూ.

'కావున ఆ బాలకునికి, వారి మాత గురించి జెప్పుమని ఒక ప్రశ్న వేసెదము. వాడు దానికి ఏమి జేప్పునో దానిని బట్టి మనము ఆతనికి సభా ప్రవేశము ను ఇచ్చుట యో లేక తిప్పి పంపి వేయుటాయో జేసేదము !' అని ఆర్యులవారు జెప్పారు.

అష్టదిగ్గజములు ఎప్పటి వలె  దీనికియునూ తలయూపి, శ్యామలీయం మాష్టారు వైపు జూసినారు.

శ్యామలీయం వారు, 'నెమిలి' యై చెంగున ఎగిరి, బుజ్జి పండుని తమ మూపురము పై నిడుకుని సభా ప్రాంగణమున తిరిగ రాగా, ఆ షణ్ముఖు డే వచ్చాడా అన్నంత గా ఆ సభా ప్రాంగణము దివ్య కాంతులతో ప్రజ్వరిల్లినది. !

(సశేషం)

(నేడు డిసెంబర్ పదకొండు ! -

 ప్రముఖ  తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి(సుందర తెలిన్గినిలే పాటిసై త్తేన్ అని తెలుగు సొబగు ని మెచ్చుకున్న తమిళ కవి వారు )  గారి జన్మ దినం అని మా సింగపూరు వారి oli ఎఫ్ఫెం వారి  మాంచి తమిళ పాటలు పెడుతున్నారు. ఈ శుభ దినమున మన బుడతడు శంకరాభరణము కొల్వును జేరుట శుభ సూచకం గా భావిస్తాను !

మీదు మిక్కిలి కందుకూరి పంతులుగారి జన్మదినం అని మన నవ రసజ్ఞ వారు తెలుపుతున్నారు రాజమహేంద్రవరం నించి.. ఆ పై ఎందుకో ? ఏమో ? గారు  తెలుగు బ్లాగు మహోత్సవ దినం కోసం ఒక మాంచి వీడియొ తయారు జేసి అందరినీ ఆశ్చర్యామ్భుధిలో ఓల లాడిస్తూ వున్నారు !  - ఈ శుభ దినాన శ్రీమాన్ బుజ్జి పండు వారు శంకరాభరణం కొలువు ప్రవేశం మరీ శుభ సూచకం! జ్యోతిర్ మాయీ వారు సంతోషమే కదా !

 - చీర్స్  జిలేబి )

Saturday, December 10, 2011

బుజ్జి పండు తెలుగు చదువు - 2 - (శంకర విజయం) !

శంకరార్యుల వారి శంకరాభరణం కొలువు జగజ్జేగీయ మానం గా కవి పండితాద్యులతో వెలుగొందుతోంది.


మహామహులైన పండితులు , నిష్ణాతులు , గ్రాంధికం , గ్రామ్యం కాచి వడబోసిన పెద్దల కొలువు అది.

ఆర్యులవారు చిరునగవుతో వీక్షించు చూ , తమ సహ పండితులని అష్ట దిగ్గజములై న వారిని ఒక మారు కలయ జూసినారు

కొలువులో

పండిత నేమాని వారు,
చింతా వారు
సుబ్బారావు గారు
శ్యామలీయం గారు
లక్కాకుల వారు
గోలీవారు
శ్రీపతి  గారు,
రాజేశ్వరీ అక్కయ్య గారు

లాంటి అష్ట దిగ్గజములను గాంచి ఆ పై నను వున్న మీదు మిక్కిలి పండిత లోకమును గాంచి, ఆ నాటి కొలువు విశేషములు వారు మొదలు బెట్ట బూనినారు.

ఈ శంకరాభరణము కొలువు కు శ్యామలీయం గారు మంజరీ ద్వార పాలకులై ( ఆంగ్లములో గేటు కీపరు అందురు) కొలువుని కడు జాగ్రత్తగా కాపాడుకొంటూ తమ అసామాన్య ప్రతిభా పాటవాలతో ఒక వైపు ఐటీ రంగమును మరొక వైపు కవితా వెల్లువలను సమ పాళ్ళలో 'క్రోడీకరించి' న వారై , ఒక కన్ను ను ఎప్పుడు మంజరీ ద్వారముపై పెట్టి ఉందురు - ఏల అన ఎవరైనా తుంటరులు అనానిమస్సులై అక్కడ ప్రవేశించి ఏమైనా సభా భంగము గావించిన వారికి వెంటనే వారు ఝాడూ చూపించి తరిమి వేయుదురు.

అటువంటి గురుతరమైన భారముతో వారు శంకరార్యుల కొలువును గాపాడుచూ, ఒక వైపు గ్రాంధి క మా , మరో వైపు గ్రామ్యమా అన్న లక్కాకుల వారికి సమానముగా తమ బ్లాగ్కామెంట్ ఫటిమ లో నెగ్గుకుని వస్తూ, మంజరీ ద్వారమున ఒక్క మారు వీక్షించినారు శ్యామలీయం వారు.


(బుజ్జి పండు ప్రవేశం)

శ్యామలీయం మాష్టారు - తనలో

ఎవరో ఒక బుడతడు ఇటు వస్తున్నాడే !  ఈ సభా ప్రాంగణములో ఈ బుడతడికి పని ఏమి ?
ముక్కుపచ్చలారని ఈ పసిబాలుడికి ఈ ప్రబంధ ప్రదేశమున పని ఏమి ? అనుకున్న వారై,

(ప్రకాశముగా)

ఓరీ బాలకా, ఎవరవు నీవు ఎచట నుంచి నీ రాక ? అని గంభీరముగా చూసినారు. వారు గంభీర స్వరూపులు. వారి చూపులు నిశితమైనవి.

బుజ్జి పండు కొంత బెదిరి,

మలీ అండీ, మలీ అండీ... మలీ అండీ ....

ఈ మలీ మలీ ఏమిటి ? స్ప్రష్టముగా చెప్పుము !  నీ పెరేమిటోయీ ?

మలీ మలీ అండీ, నేను మా మాత పంపగా వచ్చినానండీ !

శ్యామలీయం మాష్టారు  గారు అబ్బురు పడి పోయారు. ! ఈ బాలుడు మాత అన్న పదమును ఎంత స్వచ్చముగా స్వేచ్చెగా పలికినాడు సుమీ ! ఈ మమ్మీ ల కాలములో వీడు మాత అని పలకటం గొప్ప విషయమే !

వారు ఈ మారు కొంత స్వాంతన స్వరముతో బాలకా, నీ పేరు ఏమి ? అని నిదానముగా అడిగినారు

నా పేలండీ , నా పేలండీ, ...

ఓహో ఈ బాలకునికి సాధు రేఫములు పలకడం కష్టమైనట్టున్నది ! అని భావించి శ్యామలీయం వారు, పోనీ, మనమే వేరు విధముగా అడిగి చూతము అని,

బాలకా, నీ నామమేమి ? అని రేఫములు లేక సాధు గా అడిగారు ఈ మారు .

మీలు పెద్ద వాలండీ, నామమేమి అనకూడదు. నీ నామమెక్కడ అని అడగ వలె ! నా నెత్తిపై వున్నది  చూడుడు , అని ఒక చెణుకు మన బుజ్జి పండు వేసి,

స్వామీ, నా నామము బుజ్జి పండు అని తనను పరిచయము చేసుకున్నాడు.

హార్నీ, బుజ్జి పండు , ఏమి ఈ తెలుగు పేరు ! ఈ కాలములో పిల్లలకి ఇంత మంచి స్వచ్చమైన  పెరెట్టిన తల్లులు గారు వున్నందువల్లే కదా, ఈ శంకరాభరణము వంటి కొలువులు ఇంకనూ వర్దిల్లుచున్నవని వారు సంతోషపడి,

బుజ్జి పండూ, నీ చెణుకు కి నేను మైమరిచితిని. ! నీ విక్కడి కి వచ్చిన కారణం బెద్ది ? అని వారు ప్రశ్నించారు.

"మా మాత, జ్యోతిల్మాయీ వాలు, నన్ను మలింత  తెలుగు నేల్చుకొనుటకు మీ శంకలాభలనము కొలువుకి నన్ను పంపినాలు మా మాత నన్ను అమలికా నిండి ఇక్కడి కి పంపించినాలు మీ వద్ద అంతల్జాల వాసము చేయమని ' అన్నాడు బుజ్జి పండు.

శ్యామలీయం మాష్టారు, ఈ అబ్బాయి ని గాంచి ముచ్చట పడి, వీడికి ఒక్క  రేఫమే కదా సమస్య ! ఈ తెలుగు లోకం లో ఎంత మందికి అసలు తెలుగే రాదు. అటువంటి కాలములో వున్న ఎందరికో కన్నా, ఈ బుడతడి ఉత్సుకతకి ఆ రేఫలోపము ( ఇది దుష్ట సమాసమా అని రేపు ప్రశ్న టపా లో వేయవలెనని గుర్తు పెట్టుకుని ) ఒక్కటే కదా, మన్నించి, శంకరాభరణం కొలువలో ఈ బుడతడికి ప్రవేశము కలిపించి ఈ బుజ్జి పండుకి తెలుగు నేల్పుదము ( హమ్మో, నాకు రేఫలోపము వస్తున్నదే సుమీ!, జాగ్రత్త గా వుండవలె అని మనస్సులో అనుకున్న వారై)  అని తీర్మానించి,

బాలకా, బుజ్జి పండు, వేచి వుండుము, నేను సభా ప్రాంగణములో మా పండితుల వారి అనుమతి గైకొని వచ్చి నిన్ను తోడ్కొని పోవుదునని వాక్రుచ్చి, వారు సభా ప్రాంగణంలోనికి వెళ్ళారు !

(సశేషం)

Wednesday, December 7, 2011

బుజ్జి పండు తెలుగు చదువు !

బుజ్జి పండు తన తల్లి గారైన శర్కరీ జ్యోతిర్ 'మాయీ' వద్ద వారు నేర్పిన తెలుగుని నేర్చుకుంటూ తెలుగు కాంతుల విరజిమ్ముతూ తెలుగు బిడ్డగా అమెరికా దేశమునందు పెరుగు చున్నాడు.

ఆ తల్లికి, తన తనయుడు మరి ఇతర తెలుగు గురువుల వద్ద తెలుగు ని నేర్చుకోవలె అనెడి కోరిక గలిగెను. తాను ఎంత నేర్పినను , సరియైన గురువు చెంత నేర్చిన విద్యయే కదా విరాజిల్లు అని ఆ తల్లి తలబోసి

'పుత్రా, బుజ్జి పండూ,  నీవు నా దగ్గిర నేర్చిన తెలుగు ని ఇంకను అభివృద్ధి చేసుకొనుటకై నేను నిన్ను మరి కొందరు మన 'తెలుగు బ్లాగ్ గురువుల  చెంత గురుకుల వాసము చేయుటకు పంపవలెనని నిశ్చయించితి అని ఆ మాత పలుకగా,

తనయుడు బుజ్జి పండు 'మాతా, నీ వాక్కు నాకు శిరోదార్యము. వెంటనే సెలవీయుడు , నేను మొదట ఏ e-గురువుల వారి వద్ద వాసము చేయవలె నని అడుగగా

 ఆ మాత కడుంగడు ముదావహము తో

'పుత్రా బుజ్జి పండూ,  నాకొక్క దినము అవకాశము నిమ్ము, నీకు ఆ గురువుల పేరు తెలిపెదను ' అని బహు సంతోషానంద  భరితు రాలై 'పుత్రోత్సాహముతో' ఆ నాటి కార్యక్రమములను ముగించుటకు సంసిద్దురాలాయెను.

పుత్రుడు బుజ్జి పండు తాను నేర్చుకోబోవు తెలుగు ను దృశ్య కావ్యముగా జూచుచు నిదురయందు జారుకొనెను.


(సశేషం)

Tuesday, December 6, 2011

మాయన్ కాలెండరు - 12-Dec-2012 సారూప్యతలు - ఇది జిలేబి పరిశోధన!




మాయన్ క్యాలెండరు గురించి జరుగుతున్న పరిశోధనలు గురించి మీలో చాలామంది చదివే ఉంటారు.



దీనికి సంబంధించి కొంత చదివాక సరే - మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏమైనా ప్లానెటేరి పొసిషన్స్ కనిపిస్తున్నాయా అని ఆ రోజు కి అంటే డిసెంబర్ ఇరవై ఒకటి , రెండు వేల పన్నెండు కి చక్రం గీస్తే నాకైతే ఎలాంటి విశేషాలు కనిపించలేదు చార్ట్ లో.


సరే - ఇంత గగ్గోలు అవుతోంది కదా - ఈ మాయన్ కాలెండర్ సబ్జెక్టు అని కొంత ముందు వెళ్లి డిసెంబర్ పన్నెండో తేది ,(కాకుంటే పదమూడో తేది ) రెండు వేల పన్నెండు కి చార్ట్ చూస్తె - ఓ పాటి విలక్షణమైన జ్యోతిష చార్ట్ కనిపించింది. అంటే - రెండు ప్లానెట్ లు తప్పించి, ( మంగళ, శని గ్రహాలూ తప్పించి మిగిలిన వన్ని కల గట్టుకుని ఎదురెదురు గా కనిపించడం, ఆ పై డిసెంబర్ పదమూడో తేది అమావాస్య కూడా కావడం లాంటివి నాకు తట్టిన విశేషాలు. మీకు జ్యోతిష్య శాస్త్రం తెలిసి ఉంటె మరీ మీరు  పరిశోధించి ఉండ వచ్చు.

అంతె కాకుండా - పదమూడో తేది అమావాస్య కాబట్టి - డిసెంబర్ ఇరవై ఒకట వ తేది నవమి.

త్రేతాయుగ కర్త శ్రీ రాముని జననం     నవమి లో.

ద్వాపర యుగ కర్త శ్రీకృష్ణుడి జననం  అష్టమి లో.


కలి యుగ కర్త ( ఎవరు? ) తెలియదు, నాకైతే - కలి ప్రభావం అనుకుంటే - శ్రీ కృష్ణ పరమాత్ములవారు ఈ కలి యుగానికి కూడా అవతార పురుషుడు  గా అనుకోవచ్చు. (వచ్చే అవతారం దాక, లాస్ట్ అవతార పురుషుడు ఇన్-చార్జ్ అన్న మాట!)


సో, ఈ రీతిలో ఆలోచిస్తే - సప్తమి రోజున ఏదైనా విశేషం ఉండవచ్చా?

అంటే ఈ డిసెంబర్ పన్నెండు నించి ఇరవై ఒకటి లోగా ఏదో విశేషం జరగవచ్చు అని ఊహించవచ్చా?

ఈ టపా ముఖ్యోద్దేశం మీకు తెలిసిన ఏదైనా పాయింటులు వుంటే వాటి గురించి రాయగలరు.

ఈ శీర్షిక పై మొదటి సారి నేను రాసినప్పుడు, సందీప్ అనే బ్లాగరు, పంచవటి అన్న గ్రూప్ కి ఈ మేటర్ ని పంపిస్తానని అందులో నిష్ణాతులు ఏదన్నా చెబ్తారేమో చూస్తామని అన్నారు. కాని ఆ తరువాత ఆ సందీప్ అన బడే ఆసామి దీని ని పంచవటి కి రెఫెర్ చేసారా, దాని పర్యవసానాలు నాకు తెలీదు. వారి నించి ఎట్లాంటి స్పందనా రాలేదు. శ్రీ తెలుగు యోగి శర్మ గారి ప్రకారం ఈ తేదీలలో ఎట్లాంటి విశేషాలు లేవు. (నా కు తెలిసి వారు రాసిన టపాలని బట్టి, - వేరుగా పంచవటి లో వేరే ఏమైనా సవివరం గా చర్చించి వుంటే నాకు తెలియదు)

ఆ  పంచవటి వారు గాని, వేరే వారేమైనా దీని ని పరిశోధించి వుంటే వివరాలు తెలుప గలిగితే మరీ సంతోషం !

సర్వే జనాః సుఖినో భవంతు ! సమస్త  మంగళాని భవంతు. !!



చీర్స్
జిలేబి

Monday, December 5, 2011

శ్రీ రామరాజ్యం నేను చూడను గాక చూడను !

అయ్య బాబోయ్ ,

బ్లాగ్ లోకం లో ఎన్నెని టపాలు శ్రీ రామరాజ్యం పై

ఇన్ని చదివాక నా తెలివి మరీ ఎక్కువై పోయింది.

సినిమా చూడ్డం మరో ఖర్చు ఎందుకు?

ఫ్రీ గా ఇన్నిన్ని టపాలు చదివేక, మొత్తం చిత్రం కళ్ళ ముందు ఫ్రీ గా వచ్చేసింది.

నేను సినిమా చూడను, రివ్యూలు  చదువుతాను.  అంతే !

(నేను హార్లిక్స్ తాగను , తింటాను  అని మా మనవుడు అంటే , వీపు మీద విమానం మోగుతుందిరా మనవడా అన్న మాటలు గుర్తుకొచ్చి.... మనకూ ఎవరైనా విమానం మోత పెడతారేమో, ఇక్కడ్నించి వెంటనే పరారై పో జిలేబి!. )

చీర్స్

జిలేబి.

Saturday, December 3, 2011

ఖబడ్దార్ - మీరెక్కడి నించి రాస్తున్నారో , మీరెవరో అంతా మాకు తెలుసు !

బాబయ్యా - బిగ్ బ్రదర్ మిమ్మల్ని తోలుకు రమ్మన్నాడు !

బాబయ్య కి తానేం తప్పు జేసాడో తెలీలే ! తాను చిన్నప్పుడు సినిమాలలో జూసేడు - వూళ్ళో ఎవడైనా ఏదైనా జేస్తే , 'అన్న' కబురంపే వాడు - ఆ తరువాత ఆ కబురు అందుకున్నవాడు గాయబ్ !

ఆ మధ్య కోల్డ్ వార్ సమయాల లో వీడు వాణ్ణీ, వాడు వీణ్ణీ అద్దాలు బెట్టి గమనిమ్చుకునే వాళ్ళు.  స్పై , క్రాస్ , డబల్ క్రాస్స్ మొదలగు పేర్లతో వీళ్ళు ప్రసిద్ధులు.

మన ఒక కాలపు తెలుగు సినిమాలో 'అన్న' ఎప్పుడు  కరకు మనిషే. అన్న రమ్మన్న డంటే , మన కు మూడి నట్టే లెక్క అన్న మాట !

ఇప్పుడు ఆ పెద్దన్నయ్య మన భారద్దేశం అయి పోయిందని వార్తా పత్రికల భోగట్ట !

ఇక మీదట జిలేబి ఏదైనా రాస్తే వెంటనే (ఆల్రెడీ తెలుసేమో?) పెద్దన్నయ్యకి ఖబురు వెళుతుంది.

జిలేబి మీ గురించి రాసిన్దటండి !

ఏమి గీకిన్దిరా ఆవిడ ?

మీరు బిగ్ బ్రదర్ అనండి

వెంటనే ఆవిణ్ణి బొక్కలో పెట్టు. ఏమిటా ఖండ కావరం? నన్ను మిస్టర్ బిగ్ బ్రదర్ అని వుండాలి కదా !

ఇప్పుడు జిలేబి కి సందేహం వస్తోంది. ఈ సంకలునులు, హారం లు కూడా ఈ బిగ్ బ్రదర్ కి సీక్రెట్ ఎజెంట్లేమో ?

ఎందుకంటే మనం ఏమైనా రాస్తే, వీళ్ళకి వెంటనే తెలిసి పోతోన్దబ్బా ! అదే ఎలా నో తెలీయటం లేదు.!

వెంటనే మనం గాయబ్ అయి పోవటం మంచిది ఈ బ్లాగ్ లోకం నించి!

చీర్స్

జిలేబి.

Friday, December 2, 2011

కామెంటు కోసం ఒక టపా రాద్దామని !

అందరూ టపా కి కామెంటు రాస్తారు. సరే, కొంత వెరైటీ గా కామెంటు కోసం ఒక టపా రాద్దామని !

కామెంటడం అన్నది ఒక కళ. అది బ్లాగ్ లోకం లో కొందరికి అచ్చి వచ్చిన విద్య.

మరికొందరికి చాలా కామెంటాలని ఉంటుంది.

 కాని సమయాభావం వల్లో, సాంకేతిక కారణాల వల్లో, చిన్నగా రాసి ఊరుకుంటారు.

ఇవ్వాళ బ్లాగ్ లోకం లో జల్లెడ వేసామంటే ఎక్కువగా కనిపించే కామెంటు రెండు చుక్కలు ఒక బ్రాకెట్టు ! :)

ఆ తరువాయి - కనిపించే చాలా కామన్ కామెంటులు - సూపెర్, కెవ్వు, కేక ! హ హ హ , hahahaha ,
lol...ఇలా చిన్ని చిన్ని పదాలతో కామెంటు తారు.

సో ఇవన్ని తెలుగు లోకానికి బ్లాగ్ లోకపు సరి కొత్త పదాలు

కొన్ని ఇప్పట్లో ఉన్న తెలుగు పదాలే, కొత్త అర్థం ఆపాదించుకోవడం కూడా కద్దు. ఉదాహరణకి , కెవ్వు కేక - ఈ పదం టపా సూపెర్ అన్న అర్థం లో వాడతారనుకుంటా . అంతర్జాలం లో మరిన్ని సరికొత్త పదాలు పోను పోను వస్తూంటాయి అనుకుంటాను.

కొంత కాలం పోయాక , నిఘంటువు ఎవరైనా ప్రచురిస్తే , ఈ కొత్త పదాలు ఆ నిఘంటువులో వస్తాయేమో ? మొదట్లో కొంత విముఖం గా ప్రచురించినా పోను పోను వేరు వేరు ప్రచురణలలో కొత్త అర్థాలతో వస్తాయేమో !

మరో పోకడ, టపా కన్నా సుదీర్ఘ మైన కామెంటు- వ్యాఖ్య ! ఇది టపా కన్నా చాంతాడంత మరో టపా అంత నిడివి ఉండటం కద్దు.

కొన్ని చమక్కులు,
కొన్ని కవితలు,
కొన్ని పద్యాలు,
కొన్ని చేణుక్కులు,
కొన్ని సమస్యా పూరణలు
కొన్ని కొంటె దనాలు
కొన్ని ఇన్ఫర్మేటివ్
వెరసి నేటి బ్లాగ్ కామెంటులు
ఓ విన్నూత్న సాహితీ ప్రక్రియ !

ఇప్పటి దాకా రానిది చైను కథానిక, కామెంట్ల ద్వారా ! (టపా ల లో ఇంతకు ముందే గొలుసు కథలు వచ్చేయని ఒక మారు జ్యోతి గారు చెప్పారు - సో , కామెంటుల లో ఇప్పటిదాకా ఈ ప్రయత్నం రాలేదనే భావిస్తాను !


చీర్స్
జిలేబి.

Thursday, December 1, 2011

రెండు చుక్కలు ఒక బ్రాకెట్టు ఆట ఆడదాం రా!

రెండు చుక్కలు ఒక బ్రాకెట్టు ఆట ఆడదాం రా

నాకు

నాలుగు ముక్కలాట తెలుసు

నాలుగు స్తంభాల ఆట తెలుసు

నాకు

జోకాట తెలుసు

పేకాట తెలుసు

కానీ

ఈ కామెంటు లలో వచ్చే

రెండు చుక్కలు ఒక బ్రాకెట్టు ఆట ఏమిటో

కాస్త వివరించి చెబ్దురూ !

:)


చీర్స్
జిలేబి.

Wednesday, November 30, 2011

Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ - జిల్ జిల్ జిలేబి !

Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ 

ఓ బాయ్స్ - ఐ యాం టైపింగ్ ఎ టపా


సూప్ టపా - ఫ్లాప్ టపా


చెప్పు నాటీ - చుప్ప నాటీ

దూరం లో హారం
హారం లో రమ్ము
రమ్ము తో కిక్కు
కిక్కు కిక్కుకీ హుక్కు

Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ
Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ
Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ

వైటు బ్లాగు జిలేబి
బ్లాగు టపా డప్పా
టపా టపా మీటు
ఫ్లాపు ఐయ్యే బోటు

Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ
Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ
Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ


మామోయ్ , నోట్సందుకో
అలాగే ఓ సిగారేట్టందుకో
ప ప పాన్ ప ప పాన్
ప ప పాన్ ప ప పాన్ - వేసేసుకో
కట్టేసుకో కిళ్ళీ -

ఓ బాయ్ - సరిగా కట్టు  కిళ్ళీ

Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ
Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ
Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ

సూపెర్ మామోయ్,

రెడీ 1 2 3 4 నొక్కేయ్ పబ్లిష్ పోస్ట్ !

నౌ

చేతిలో గ్లాసు - రాసేయి ఎంగిలి పీసు

సూపెర్ మామోయ్, 

రెడీ 1 2 3 4 నొక్కేయ్ పబ్లిష్ పోస్టు

Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ
Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ
Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ



చేతిలో గ్లాసు
రాసే వాడే బోసు
కోసేవాడే బాసు 
అందుకో ఐసు 

This Song ఫార్ సూప్ బ్లాగర్సు,
వేసేసుకో ధమాల్ ధమాల్ దబాల్ దబాల్ 
కట్టేసుకో టపా పెట్టేసుకో సొంత డబ్బా !

Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ
Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ
Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ



చీర్స్
 
జిలేబి. !  
(నా మీద ధ్వజం ఎత్తకండి మహాశయులారా - లోకం పోకడ - జిలేబి పోకడ!- వేసేసుకో పకోడీ, రాసేసుకో పేరడీ !)

Tuesday, November 29, 2011

'సురా' పానీయం - జిలేబీయం !

"ఓరోరీ ఇంద్రుడా, సోమ  పాన మత్తులో ఉండినావా, ఏమి నీ ఖండ కావరము ? "

 ఇట్లాంటి సంభాషణలు మన పాత తెలుగు పౌరాణికాల లో గానీండీ, తెలుగు సినిమా ల లో గానీండి మనం చదివి లేక విని ఉండవచ్చు.


మన e లోకం లో మనకు సురాపానం గావించే అవకాశాలలో మొట్ట మొదటిది వ్యాఖ్యలు. అవి ఇచ్చు కిక్కు వేరే ఏదీ e-మాధ్యములో ఇవ్వదని నేను కీబోర్డుపధం గా చెప్పగలను!


ఆ మధ్య హారం , హా, రమ్, హారం ఒక మధు శాల లాంటి దని కూడా ఎవరో జిలేబి అట వారు రాసినది చదివినట్టు నాకు గుర్తు!


ఇక రెండవది - టపా. మనసుకు నచ్చిన టపా, ఆ టపా లో మంచి కంటెంటు ఉన్న టపా మరో సురా పానం లాంటిది.


జిహ్వ కొద్దీ రుచీ, మూడు కొద్దీ టపా లైకింగు !


 శ్రీ రామ రాజ్యం వస్తే, వెంటనే దానిని చాకి రేవు బండ మీద ఎంత ఎక్కువగా బాదితే , మన టపా ఎంత వ్యత్యాసం గా ఉంటె అంత మంచిది.

ఇదే విధం గా  మన డైలీ లైఫు లో జరిగే విషయాల గురించి రాసే టపాల కోవలో , హాట్ హాట్ రాజకీయం, అన్నా హజారే ఉన్నావరిదం కి సంబంధించి మనం చూపించే లెగ్ కికిన్గులు ఇవన్నీ 'when its hot its really cool' లాంటివి అన్నమాట !


మరికొన్ని టపాలు , వంటలకి సంబందించింది. ఇవి చాలా కారణాల వల్ల చాలా పాపులర్ ! ఐటీ రంగం లో ని 'బేచలర్ కిచెన్' టార్గెట్ ఇవి. కాబట్టి మరీ ఘాటుగా , సూపెర్ సేవీ గా రంజు గా కొన సాగుతాయి.


ఇక జ్యోతిష్యం - హాట్ హాట్ టాపిక్! నేను గమనిన్చినదాంట్లో , జ్యోతిష్యం మీద టపా పడితే ( అమెరికా ఎప్పుడు మునుగును- జ్యోతిష్యం ఏమి చెబుతోందీ - ఇట్లాంటి టైటిల్ (తిట్లు) సూపెర్ డూపర్ - అల్ టైం 'ఎక్కువ ' చదివిన' టపాల కోవకి వస్తుంది. !


మరి సాఫ్ట్ వేర్ సాములు రాసే - సెటైర్ అది మరో స్టైల్ . కొంత అర్థం చేసుకోవాలంటే వారి Knowledge is Power and Money' కాన్సెప్ట్ కొంత తెలిసుండాలి.


ఇక హాస్యం గురించి చెప్పనే అక్కర్లేదనుకుంటా. మనిషికి ఆహ్లాదం ముఖ్యం కాబట్టి ఈ టాపిక్కు ఎవెర్ హాట్!


వీటన్నిటికీ , ఆవల, కొన్ని బ్లాగులు , నిశ్శబ్దం గా తమ మానాన తాము రాసుకొంటూ పోతూంటాయి. అంత అలజడి, కామెంటుల పరమాన్నాలు, వీటి లో వుండవు. కాని వాటి కని వేచి వుండే కనులు ఎన్నో ! 
వాటికి వున్న విలువలు - కాల గతిలో నిలిచి పోయేవి.  బ్లాగు లోకాలు గాయబ్ అయినా , అవి తమ కాళ్ళ మీద నిలబడ గలిగినవి !


అట్లాంటి నాకు తెలిసిన ఒక 'సోమ  పానీయం '  శ్రీ సుబ్బా రావు గారి బ్లాగు !

శ్రీ సూక్తం లో- వైనతేయ సోమం పిబ, అని అన్నట్టు,

సోమ పానీయం గా వారి బ్లాగుని పరిచయం చెయ్యడానికి కారణం నాకు తెలిసిన ఈ 'సురా'బ్లాగీయం '  - సుబ్బా రావు గారి బ్లాగు నాకు చాల నచ్చడం !

ఎందుకు నచ్చడం ?

 ఒక ప్రత్యేక శైలి వీరిది  - నాలుగు పదాల నాలుగు పంక్తులతో , జీవితాన్ని ప్రతిష్టాపించడం వీరికే చెల్లు.

చిన్ని చిన్ని పదాలతో , చిన్ని పదబంధాలతో, తేట తెలుగు లో తేనీయలు జాలువారించడం అంత సులభం గాదు !

బ్రహ్మాండమైన సంక్లిష్ట పదాలతో భావాన్ని రాయడం ఒక ఎత్తైతే, అదే భావాన్ని సున్నితం గా, సింపుల్ గా చెప్పడం వెయ్యి ఎత్తులకి సరి సమానం  అని నా విశ్వాసం. అలా సింపుల్ గా చెప్పే కెపాసిటీ ఏ కొద్ది మందికో ఉంటుంది. అలాంటి వారిలో రావు గారు సుప్రసిద్ధులని పిస్తుంది. వీలు చేసుకుని ఓ సారి దర్శించండి !

'బ్లాగ్ మైత్రేయ -  సోమం పిబ'  !


చీర్స్
జిలేబి.

Monday, November 28, 2011

అనానిమస్ కామెంటులు - బ్లాగ్ వారల అగచాట్లు - జిలేబి ప్రతిపాదన

పూర్వ  కాలం లో ఆకాశ రామన్న ఉత్తరములు వచ్చేవి !

కాలాలు మారినై !

కాలం తో బాటు e మాధ్యములు వచ్చినై.

బ్లాగు లోకములు వచ్చినై.

అయినా , ఆకాశ రామన్న లు  ఎవెర్ గ్రీన్ హీరో లు !!

వారే మన e తరం అనానిమస్సులు ! వారికి నమస్సులు !

వారు లేనిదే ఈ భువి ఉంటుందా అన్నది నా ధర్మ సందేహం ! ఆకాశం పైనా ఉంటేనే కదా క్రింద భువి ఉండును!


మిస్సులు కస్సుమంటే , ఈ అనానిమస్సులు  బుస్సు మందురు.

మాష్టారులు  బెత్తం పడితే , వీరు పంతం పట్టెదరు.!

 ఔరా, అయ్యలారా మీరేమైనా బ్లాగు లోకమును గుత్తగా కోనేసుకున్నారా అని అందురు !

వీరికున్న 'gut' వేరే ఎవరకీ ఉండదని నా సవినయ అభిప్రాయం !

దొంగ గారికి ఎ ఇల్లు తాళం లేక, తాళం సరిగా లేక ఉన్నదో తెలవడం అన్నది చోర కళా నైపుణ్యము !

తలుపు లు జాగ్రత్తగా వేసి ఉన్న కూడా చోరీ జరుగక ఉన్నదా ? కావున అనానిమస్సులు కాక పోయినా కూడా, ఎవడైనా , ఓ కందిరీగ అన్న పేరు తో కామేన్టడం మొదలెడితే మన చెవులు హోరుమన క ఉండునా ?

వీరి కున్న gut కి కారణం బెద్ది ? వారి నామ ధేయమే  కదా ? నామమేమి ? అజ్ఞాత ! అనగా ఏమి ? జ్ఞాతుడు కాని వాడు. అనగా , సర్వం తెలిసిన వాడు కాదని. అనగా కొంత తెలిసిన వాడని. అనగా వాడికి ఎంతో కొంత ఆ మేటరు లో పాయింటు లోపమో తెలిసినవాడు అని అర్థము కదా !

సరే, ఇంతకీ ఈ అనానిమస్సులంటే మనకు ఎందుకు పడదు ? ఎవరైనా ఆలోచిన్చినామా? వారికి తగినన్ని స్థానములు మనము గాని, ఈ సంకలిని నిర్వాహకులు గాని సముచిత స్థానము కల్పించినారా ? లేదే ? వారికి సముచిత స్థానము వెంటనే హారం అధినేతలు కలిపించినచో ఈ అననిమస్సులు సరియిన విధముగా సత్కారము పొందిన  వారై భుక్తాయసములతో తీరికగా ఆలోచించి కామెంటు దరు కదా ?

వీరి కై నేనొక మహత్తరమైన ప్రణాళికని హారం అధినేతలకు ప్రతిపాదిస్తున్న్నాను. !

అది ఏమనగా, వారు హారం లో నే ఎ టపా పైన అయినా అన్య మనస్కులైన , వెంటనే అననిమస్సులుగా బుస్సు మను టకు సదవకాసము కలిగించవలె !

ఎందుకనగా చాలా బ్లాగర్లు అనానిమసులకి ఆస్కారము కలిపించకుండా తమ బ్లాగులను పకడ్బందీ (మళ్ళీ ఈ పదమును గమనింపుడు - బందీ ! - బందీ అనగా ఎవరు ? తప్పు చేసిన వాడు గదా - మనలను మనం పకడ్బందీ చేసుకున్నచో దీని అర్థం ఏమి ? మనం తప్పు చేసినవారలమని కదా అర్థము ?) గావిన్చుకున్నారు కాబట్టి, ఈ అవకాసమును హారము నేతలు కలిపించవలె నని కోరడము జరిగినది.

అనానీమస్సు,
అన్నా, నీ మనస్సు తెలియక
అనాడీ వాణి గమనించక
మేము చేసిన తప్పుల మన్నించి
మమ్ము కరుణించ వయ్యా
'అనాధ' బ్లాగ్ లోక పోషకా - అజ్ఞాతా !

చీర్స్

జిలేబి.

Saturday, November 26, 2011

ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే- మేటరు లేకుండా టపా రాయడం ఎలా ?


శంకరాభరణం మాష్టారు ఒకే ఒక వాక్యం ఇస్తారు పూరించుడీ, అని. వెంటనే టప టపా కామెంటు తారు బ్లాగ్ బంధువులు.  అమ్మో వారి ఒక్క లైను కి అంత వెయుటు ఉందే అని ఆశ్చర్య పోతాను.


మా జ్యోతక్క గారు చాలా నిశితం గా ఆలోచించి , ఒక టపా రాసారంటే దానికి ఒక నిర్దుష్టమైన దారి, గురి, ఉంటుంది. బాణం ఎక్కుపెట్టడం లో కానివ్వండి , చదువరులని ఆలోచింప చెయ్యడం లో కాని ఒక రాచ బాట వారిది.


మరి ఎందుకో ఏమో గారి బ్లాగు కన్నా వారి కామెంటు లే నాకు కనబడుతుంటాయి. అంటే వారు రాయరని కాదు. మరీ భారీ వీడియో లతో ఉన్న వారి బ్లాగు నాకు ఎప్పుడూ ఓపెన్ కాదు. సరే అని ఓ మారు ఓ యుగం ప్రయత్నించి అయ్యా ఎందుకో ఏమో గారు మీ బ్లాగు ప్రాబ్లం ఏమైనా ఉందా చూస్తారా అని కామెంటు పెడతామని ఓపిక గా కామెంటు పెట్టా, కామెంటు పడిందో లేదో కాని నా కంపుటరు హాంగ్ అయి పోయింది. !


మా భారారే గారేమో మరీ విచిత్రం- అప్పుడప్పడు ఆంగ్లం లో రాస్తారు. స్వామీ ఇది ఆంగ్లమా లేక గ్రీకు అండు లేటినా అన్న సందేహం నాకొస్తుంది. వారు మొదట్లో మంచి మంచి కవితలల్లే వారు. ఆ తరువాతే  మయ్యిందో నాకు తెలియదు, వారి బ్లాగు సింపుల్ టెంప్లేట్ మారి కొత్త టెంప్లేట్ (ఇప్పుడున్న టెంప్లేట్) వచ్చేక చాల చాలా భారీ విషయాలు (మచ్చుకి సిగరెట్టూ గురించి ఒక రిసెర్చ్ ఆర్టికల్ ) రాయడం మొదలెట్టారు.


మా బులుసు మాస్టారు గురించి చెప్పాల్సిన పనే లేదు. వారు మూడు నెలలకో మారు రాస్తే గొప్ప టపా. అయిన వారు రాసి అలా టపా వదిలారంటే ఇక హారం కానివ్వండి, సంకలిని గానివ్వండి హోరు మని కామెంటు ల తో వరద ప్రవాహం , ఒక ప్రళయం వచ్చేసిందా అన్నట్టు ఓహో ఆహో అని హోరెత్తి పోతూన్టూంది. (ఈ మధ్యేమో వారు బ్లాగు లోకాని కి గుడ్ బై చెబ్తానని అక్కడెక్కడో బజ్జు లోకం లో చెప్పారని వినికిడి. వారు అలా చెప్పారో లేదో, ఆ గూగుల్ వాడికి భయమేసి బజ్జులని మూసేస్తానని వాక్రుచ్చేడు.- బులుసు గారు బజ్జులలో రాయటం మొదలెడితే గూగుల్ కి కామెంటులు మేనేజ్ మెంటు కష్టం అయిపోతుందేమో అన్న గూగుల్ వారి భయం వారిది - ఎం చేద్దాం - ఓ 'భామా' ఎఫ్ఫెక్టు మరి )




మరి మన బాతాఖాని లక్ష్మీ ఫణి మాస్టారు/మాస్టారిణి వారు అల్లాటప్ప గా ఎ మేటరు పై అయినా అలా అలవోక గా రాసేస్తారు.  ఒక్కో మారు రెండు లేక మూడు టాపిక్కులని కలగలిపి ఓ టపా రాసి పడేస్తారు. అది వారికే చెల్లు. కాదేది వారి టపా కే అనర్హమేమో అని పిస్తుంది.


శర్మ గారు, కాలక్షేఫం కబుర్లు అంటారు గాని అవి నూటికి నూరు శాతం కాలక్షేపం కబురులు  కావే కావు. ఓ జీవితాన్ని కాచి వడబోసి సత్యాలని చెళ్ళుమని మనకోసం ఇస్తుంటారు. కాని మొహమాటం కొద్దీ - ఇవి కాలక్షేపం కబుర్లు మాత్రమె సుమా అని (మనం జీవిత సత్యాలు అంటే చదవం గదా - భారీ వ్యాసం అంటే కష్టం మరి - అందుకే వారు కాలక్షేఫం కబుర్లతో చిన్న గా హోమియో పతీ డోసులలో ఇచ్చేస్తో వుంటారు ) !


ఇక వారెవరో మధుర వాణీ గారని , జర్మేనీ దేశం లో ఉన్నారట ! ఉన్నారన్న మాటే గాని జర్మేనీ కబుర్లకన్న స్వచ్చమైన తెలుగు కబుర్లే ఎక్కువ చెబుతూంటారు. ఏమండీ అంటే, అప్పుడప్పుడు జర్మేనీ అందాలని ఫోటో పట్టి పెట్తోస్తాంటారు !


మరొకరెవరో కృష్ణ ప్రియ గారట, డైరీ అని రాస్తూ , ఓ విశిష్టమైన శైలి తో కథల పరంపరలు రాస్తూంటారు. అమ్మో వీరికి ఎన్ని విషయాలు తెలుసంటారు జీవిత గమనాల గురించి . ఈ మధ్య ఓ సిక్స్ ఫేసస్ అఫ్ ఎ మాన్ అని - స్టీఫన్ కోవే ని మించి న నైంత్ ఫేక్టర్ అఫ్ హ్యూమన్ రిలేషన్షిప్ గురించి వాడెవడో ఓ అరవబ్బ్బాయి ఆరుముగం  అట , ఆతన్ని సంపూర్ణం గా అనలైజే చేసి రాసేస్తూన్నారు.


మరి నాగ మురళీ గారని, అలా ఓ చేత్తో కాళిదాసుని, మరో చేత్తో వాల్మీకిని , సంస్కృతాన్ని వడబోసి ఓ సంస్కృత కాలేజీ తెలుగు లో నడిపెస్తూంటారు! వామ్మో వీరికెంత జ్ఞానం అని నేను ఆశ్చర్య పోవడం కద్దు కూడాను. !


ఇలా చెప్పుకుంటూ పొతే , అసలు విషం మరిచి పోయేట్టు ఉన్నాను. అసలు మేటరు లేకుండా టపా రాయడం ఎలా అని కదా ఈ టపా తిట్లు సారీ టైటిల్ మరి ? ఈ టైటిల్ మాట ఎందు కొచ్చిందంటే,


ఎవరో జిలేబి అంట, రోజు టపా టపా రాస్తూంది. మేటరు ఉందొ లేదో తనకే తెలీదు. అసలు ఆడవారో మగ వారో వీరు అని మరీ కన్ఫుషన్- నాకు తెలిసి జిలేబి అని ఎవరికైనా పేరు ఉంటుందా ? సందేహమే నా కైతే ! - ఆడవాళ్ళు సందేహం సినానిమాస్ గదండీ మరీ ?


ఈ మధ్య ఓ లబ లబ కూడా లబ లబ లాడి పోయాడు - ఈ జిలేబి ఎవరబ్బా అని ముక్కు మీద వేలేసుకుని వెళ్లి వెళ్లి భారారే గారినే (వారే కదా 'హారం' అధినేత గారు ) అడిగేసాడు. ఆ భారారే గారు కూడా ఖంగు తిని  ఆ జిలేబి సుద్ధ వేష్టండి అన్నారని గ్రేప్ వెయిన్ స్టొరీ ఒక టి విన్నాను ) . అంతే గాక వారెవరో మరో వరూధిని గారట, మాంచి సిరి సిరి మువ్వలతో సరిగమలు పలికిస్తూ చాలా సునాయాసం గా రాసేస్తూ వుంటారు - వారి కే ఈ జిలేబి కీ మధ్య ఒక పెద్ద కన్ఫుషన్, ఈ బ్లాగర్లు కూడా ఒక్కో మారు వారే వీరేమో, వీరే వారేమో అని జిలేబి అనవలసిన చోట వరూధిని గారు అని, వరూధిని అన వలసిన చోట జిలేబి అని మరో కన్ఫుషన్ క్రియేట్ చేసేస్తూంటారు !  నాకు మరీ పెద్ద డౌటు ఇద్దరూ ఒకరేమో అని కూడా.


ఆ మధ్య ఆవిడ , కంటెంటు లేని టపా కనులకి కనపడదని ఓ బ్లాగ్ సామెతల లిస్టు కూడా ఇచ్చింది.
ఈ విషయమై  ఆలోచిస్తూంటే , ఇంతకీ టపా టైటెల్ ఏమిటన్నాను? అబ్బా నా మతి మరుపు కాకి ఎత్తుకుపోనూ, ఈ జిలేబి ఎవరబ్బా ?


చీర్స్
జిలేబి

Friday, November 25, 2011

ఒకటి సున్నా ఒకటి - జిలేబి బైనరైజేషన్ !

నేను


కాగితాలకి పట్టుబడను


కలం కి కట్టు బడను


సున్నా, ఒకటీ లతో


దోబూచులాడుతూంటాను


నా పేరు బ్లాగు టపా


తను
ఒక  జిలేబి


దాని లో ఉన్నది జీరో


ఈ ఒకటీ ఆ సున్నా కలిస్తే


అవుతుంది అప్పుడప్పుడూ జిలేబి కవితాజీ


అందుకో ఈవ్వాళ్టి బ్లాగు పేజీ !



చీర్స్


జిలేబి


దీనికి స్ఫూర్తి ఎవరో చెప్పాలంటారా?

Thursday, November 24, 2011

నయనతారానందం బాపు రే రమణీయం ! - శ్రీ రామ రాజ్యం !

యనతారానందం

భూనభో బాలకృష్ణ నాగేశ్వరుల  

తో బాపు రమణీయ

వ్య దృశ్య కావ్యం

వ్య ఇళయ హంగేరీయం, జొన్నవిత్తుల

విరచిత గీతాలాస్యం, సాయి  సినీ లోక భవి

ష్యత్తు వెలుగుల లో ప్ర

తిష్టాపితం


బాపు రే రమణీయం - శ్రీ రామ రాజ్యం !

చీర్స్
జిలేబి.

Wednesday, November 23, 2011

ఆమె ఎవరు ?

ఆమె ఎవరు ?

ఒకప్పటి సత్యవతీ శారద

ఒక శుభోదయాన జీవనం మారింది

 బ్లాగ్ లోకపు వెలుగు ఐయ్యింది

 కాంతలకున్ కాంతి గూర్చు కాంతకు జేజే

ఆమె ఎవరు ?



చీర్స్

జిలేబి

Tuesday, November 22, 2011

గృహే గృహే యోగి - మనే మనే మాతా !

నాడు

కృష్ణుడు పదునారు వేల గోపికలో కూడి నా

నిత్య బ్రహ్మ చారి ఐయ్యాడట


ఏం గొప్పా ?


నేడు

ఎల్కేజీ సీటు కోసం ఎలెవన్ కేజీ తగ్గి పోయే

బాబూ రావులతో

గృహాన్ని  సాగిస్తూ

ఎట్

ఆ ప్రేమ తత్వాన్ని చూబెట్టే నేటి స్త్రీ,

తల్లి

మనే మనే మాతా

గృహే గృహే యోగీ !


నమో మాతా నమో మాతా నమోన్నమః !

జిలేబి

Monday, November 21, 2011

రారాజు నెలరేడు వీడు 'e' లోకం వాడు !

టపా రాసినవాడు
తన బ్లాగుకి రారాజు

అందలములెక్కిన వాడు
తన రాజ్యానికి నెలరేడు

మదిలోని ఊసులన్నీ
'ఈ' మాధ్యములో
తెలుపు వాడు ,

వాడు, 'e' లోకం వాడు !


చీర్స్
జిలేబి.

Sunday, November 20, 2011

బ్లాగర్లు సంకలినులకు శృంఖలా బద్ధులై పోయారా ?

సంకలినులు లేకుంటే అసలు బ్లాగులకు గుర్తింపు ఎలా ఉండేదో నాకు తెలీదు.

ఎందుకంటే నేను బ్లాగు మొదలెట్టినప్పుడు ఆల్రెడీ aggregaters వచ్చేసి వున్నాయి. అంతకు మునుపు బ్లాగులకి గుర్తింపు గూగుల్ ద్వారానో కాకుంటే సెర్చ్ సైట్ ల ద్వారానో, కాకుంటే పరిచయస్తుల ద్వారానో ఉండి ఉండవచ్చు.

ఇప్పటి కాలం లో అలా ఒక బ్లాగు ఓపెన్ చెయ్యడానికి జస్ట్ ౩ స్టెప్పులు. సంకలినుల లో చేరడానికి కొన్ని క్షణాలు అంతే

కాని ఈ ప్రస్తుత పరిస్తితి నాకైతే , బ్లాగరులు ఈ సంకలినులకు శృంకలా బద్ధులై పోయారేమో అని పిస్తోంది.

మనం బ్లాగు మన రీతిలో రాస్తున్నామా కాకుంటే , aggregators లో మన టపాలు రావాలని , అవి ఎక్కువ గా చదివిన తపాల లిస్టులలో రావాలనో, కాకుంటే , ఎక్కువ కామెంటులు కోరి రాస్తున్నామో  అని ఆలోచిస్తే, ఈ బ్లాగడం ఒక ఇండస్ట్రీ క్రింద జమకట్టిన వాళ్ళూ ఉన్నారూ, అడపా దడపా రాసే వారూ ఉన్నారూ, అలా మేము కామెంట డానికే ఉన్నాము అనే వాళ్ళూ ఉన్నారు.

బ్లాగ్ లోకానికే శాస్వతం గా అంకితమైన వాళ్ళూ ఉండవచ్చు.

ఈ లాంటి పరిస్తితులలో , ఈ సంకలినులు అనేవి లేక పొతే అసలు బ్లాగర్ల కి ఈ పాటి సమయ వెచ్చింపు మాధ్యమం వేరే ఉండేదా?

ఒక రకం గా చెప్పాలంటే సంకలినుల వల్ల బ్లాగులు గణనీయం గా పెంపొందాయని చెప్పు కోవచ్చు.

దీనికి మరో కోణం మనం బ్లాగర్లు , సంకలినులకు శృంఖలా  బద్ధులమై పోయామని కూడా చెప్పు కోవచ్చా ? ఏమంటారు ?

చీర్స్
జిలేబి.

Saturday, November 19, 2011

కి ప దొ న = ROFL అనబడు ఒక జిలేబి O = BR² సమీకరణం కథ


కి ప దొ న అని మన అప్పారావు శాస్త్రీ గారు ఒక సమీకరణాన్ని నా బ్లాగులో కామెంటు కింద పెట్టి మెజీషియన్ మన పట్టాభిరాం గారి లాగ హుష్ కాకీ ఐ పోయారు.
ఏమండీ అప్పా రావు శాస్త్రీ గారు, శాస్త్రీ గారు, కి ప దొ న అనగా ఏమి అంటే ఆయన జవాబిస్తే ఒట్టు.
ఈ మధ్యలో John గారు వచ్చి , కి ప దొ న = ROFL అని మరో సమీకరణం కామేంటి ఆయన కూడా గాయబ్ అయి పోయారు.
ఇలా ప్రతి ఒక్కరు వచ్చి వారికి తోచిన సమీకరణాన్ని రాసి వెళ్లి పొతే, నేనేమి చేతును నారాయణా అని కుయ్యో మొర్రో అంటే, అసలు కామేన్టిన వాళ్ళు తిరిగి వచ్చి మనం కామెంటినామే , జిలేబి గారి కి ఏమైనా సందేహములు ఉన్నాయా, వాటిని తీర్చవలసిన భాద్యత మన మీద ఉంది కదా ? అని ఆలోచిన్చనే లేదు సుమీ !
ధడాలుమని, మరో బ్లాగరు శ్రీ మాన్, పురాణ పండ ఫణి గారు, (మంచి కాలం వీరు పేరు పీ క్యూబ్ అని పెట్టుకోక నాకు ఒక సమీకరణం తగ్గించారు !) , నా మీద దయతలచి, జిలేబి గారు ,

ROFL = Rolling on Floor Laughing అని మరో సమీకరణం వదిలి గయ్యబ్ హోగయేరు !

ఇక ఇన్ని సమీకరణం లు మనలని కొంగ ఫ్యుజి చెయ్య కూడదు సుమా అని నేను చాలా సీరియస్ గా ఆలోచించి,
కి ప దొ న అనగా, కింద పడి దొర్లి నవ్వడం అన్న అర్థం వచ్చేలా అర్థం చేసేసుకున్నాను.
హమ్మయ్య ఇప్పడు నేను కూడా మరో సమీకరణం రాసేసాను.

కింద = Below
పడి = Fall
దొర్లి = round round round
నవ్వు = Laugh

so, BF R*R*R L = ROFL

Cancelling both sides R,F,L we derive,

BR*R = O

So, O = BR Square!

వావ్ నేను Einstein అయి పోయానోఅచ్ !

ఇప్పడు నేను కూడా ఎవరైనా కామేంటి వెళ్లి పొతే , వాళ్ళ టపా లో వెళ్లి ఓ = బీ ఆర్ పవర్ రెండు అని ఒక సమీకరణం రాసేయ వచ్చు!


ఎయిన్ స్టెయిన్ అయిన
జిలేబి
O = BR² ! (ఓ ఈజీ క్వల్టు బీ ఆర్ స్కోయారు)

ముత్తాత మధుశాల - మనవడి 'మధు బాల' - బచ్చనైశ్వర్యం!

ముత్తాత మధుశాల - మనవడి 'మధు బాల' -  బచ్చనైశ్వర్యం!


నాడు


హరివంశ రాయ్ బచ్చన్ గమ్మత్తైన


మధుశాల తో హిందీ లోకాన్ని ఉర్రూత లూగించాడు


నేడు


ఐశ్వర్య రాయ్ బచ్చన్ రేపటి


మధు బాల తో బాలీవుడ్ ని ఉర్రూత లూగిస్తోంది !


ఇది బచ్చనైశ్వర్యం! హరివంశ రాయం !


ఐశ్వర్యా అభిషేక ప్రోక్తం


శుభాకాంక్షలతో ,


జిలేబి.

Friday, November 18, 2011

బ్లాగాయణం లో జిలేబీల వేట !

బ్లాగాయణం లో జిలేబీల వేట - మచ్చుకి కొన్ని జిలేబీలు

తెలుగు భాషను మరవకండి. తెలుగు భాషను ప్రేమించండి. తెలుగు వారిగా జీవించండి
పద్యము తెలుగుల విద్యగు!
హృద్యము చదువరుల కెన్న,
నింపగు వినగా !
పద్యము కవితల కాద్యము!
సద్యశమును కల్గజేయు చక్కగ కవికిన్!

సర్వేజనాః సుఖినోభవంతు

చిన్ని కృష్ణుడు లోకాన్ని యశోదకి చూపినట్టు నా మనసుకి నచ్చింది చూపడానికి

తెలుగు సాహితీ సుధా కథా వేదిక

సిసలైన సాహీతీ భోజనం

పదములు తామే పెదవులు కాగ....గుండియలే అందియలై మ్రోగ

కొబ్బరాకు నీడలో చల చల్లగా

శరణం పండిత మానసాపహరణం
శశ్వద్యశఃకారణం సరసానందద వాగ్విలాస చరణం, శబ్దార్థ సంపూరణం
 చరదత్యద్భుత సత్కవీశ్వరగణం సాలంబనం
‘శంకరా భరణం’ నిత్యమహం స్మరామి
విలసద్ వాగ్దివ్య సింహాసనం


నీ పదమును పూజింప ఒక పూవునైనా చాలు..వనమాలీ.. వనజవనమాలి

గీతలతో అందమైన రాతలు

...బాలాకుమారినంట, చాలా సుకుమారినంట !

రోజూ వారీ యాంత్రిక జీవనం లో ఎదురయ్యే అనుభవాలు,అనుభూతులూ, ఆలోచనలు, పరిశీలనలకూ కొద్దిగా కల్పన తాళింపు చేర్చి..


వినీల గగనపు వేదికపై నే పాడిన జీవనగీతం

Postings by Zilebi- When its Hot its Really కూల్!


జిలేబి.

చీర్స్

Thursday, November 17, 2011

తిరపతయ్య - ఢిల్లీ చలో ! చలో ఢిల్లీ !

ఇవ్వాళ ఏమి సుదినము !

ఏమి సుదినము !

మా తిరపతయ్య ఢిల్లీ చలో

 ప్రయాణం మొదలెట్టిన సుదినం !

చాలా కాలమునకు మా తిరపతయ్య కి

దేవీ దర్శనం దక్కిన సుదినము !

దేవేరి ఏమి చెప్పెనో ?

తిరపతయ్య ఏమి చేయునో ?

పంచు లచ్చీ చిలక జోస్యం చెప్పుమా ?

మా వెంకన్న బోడి గుండు సంఘం వాళ్ళు

తిరపతయ్య కి ఏమి సత్కారం చేతురో ?

అయ్యా త్వరగా సమాచారములు చెప్పుడీ ,

మా తిరపతయ్య కి జేజేలు చెప్పుడీ !

చీర్స్
జిలేబి.

తిరపతయ్య ఎవరు ? ఆతని కథా కమామీషు ఏమిటి ? సస్పెన్స్ సుమా !

Wednesday, November 16, 2011

జిలేబి ఫేమస్ ఈక్వేషన్ - O = BR² - నోబెల్ బహుమతి గ్రహీత

జిలేబి ఫేమస్ ఈక్వేషన్ - O = BR² - నోబెల్ బహుమతి గ్రహీత

కి ప దొ న అని మన అప్పారావు శాస్త్రీ గారు ఒక సమీకరణాన్ని నా బ్లాగులో కామెంటు కింద పెట్టి మెజీషియన్ మన పట్టాభిరాం గారి లాగ హుష్ కాకీ ఐ పోయారు.

ఏమండీ అప్పా రావు శాస్త్రీ గారు, శాస్త్రీ గారు, కి ప దొ న అనగా ఏమి అంటే ఆయన జవాబిస్తే ఒట్టు.

ఈ మధ్యలో John గారు వచ్చి , కి ప దొ న = ROFL అని మరో సమీకరణం కామేంటి ఆయన కూడా గాయబ్ అయి పోయారు.

ఇలా ప్రతి ఒక్కరు వచ్చి వారికి తోచిన సమీకరణాన్ని రాసి వెళ్లి పొతే, నేనేమి చేతును నారాయణా అని కుయ్యో మొర్రో అంటే, అసలు కామేన్టిన వాళ్ళు తిరిగి వచ్చి మనం కామెంటినామే , జిలేబి గారి కి ఏమైనా సందేహములు ఉన్నాయా, వాటిని తీర్చవలసిన భాద్యత మన మీద ఉంది కదా ? అని ఆలోచిన్చనే లేదు సుమీ !

ధడాలుమని, మరో బ్లాగరు శ్రీ మాన్, పురాణ పండ ఫణి గారు, (మంచి కాలం వీరు పేరు పీ క్యూబ్ అని పెట్టుకోక నాకు ఒక సమీకరణం తగ్గించారు !) , నా మీద దయతలచి, జిలేబి గారు ,

ROFL = Rolling on Floor Laughing అని మరో సమీకరణం వదిలి గయ్యబ్ హోగయేరు !

ఇక ఇన్ని సమీకరణం లు మనలని కొంగ ఫ్యుజి చెయ్య కూడదు సుమా అని నేను చాలా సీరియస్ గా ఆలోచించి,
కి ప దొ న అనగా, కింద పడి దొర్లి నవ్వడం అన్న అర్థం వచ్చేలా అర్థం చేసేసుకున్నాను.

హమ్మయ్య ఇప్పడు నేను కూడా మరో సమీకరణం రాసేసాను.

కింద = Below
పడి =  Fall
దొర్లి = round round round
నవ్వు = Laugh

so, BF R*R*R L = ROFL

Cancelling both sides R,F,L we derive,

BR*R = O

So, O = BR Square!

వావ్ నేను Einstein అయి పోయానోఅచ్ !

ఇప్పడు నేను కూడా ఎవరైనా కామేంటి వెళ్లి పొతే , వాళ్ళ టపా లో వెళ్లి ఓ = బీ ఆర్ పవర్ రెండు అని ఒక సమీకరణం రాసేయ వచ్చు!

ఎయిన్ స్టెయిన్ అయిన
జిలేబి
O = BR² ! (ఓ ఈజీ క్వల్టు బీ ఆర్ స్కోయారు)
(కి ప దొ న = ROFL అనబడు ఒక జిలేబి O = BR² నోబెల్ సమీకరణం కథ సమాప్తము)

Tuesday, November 15, 2011

జిలేబి కి పెళ్ళి కళ వచ్చేసిందోచ్!

జిలేబి కి పెళ్ళి కళ వచ్చేసిందోచ్!

అప్పుతచ్చు. ఈ మధ్య చాలా అప్పు తచ్చు లు వచ్చేస్తున్నాయి. ఆ మధ్య భారారె గారికి ఏప్రిల్ ఒకటో తారీఖు లోగా సంక్రాంతి కి కొత్త గా ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకె రాస్తానని చెప్పాను. ఏప్రిల్ లో సంక్రాంతి ఏమిటి మీకెమైనా మతి పోయిందా జిలేబి,  లేక రమ్ము ఎక్కువ తాగారా అని చీవాట్లేసారు ఆ మహానుభావుడు.

అరే చాలా అప్పుతచ్చు లు జరుగుతున్నాయే సుమా అని సరే అప్పుతచ్చు మీదే ఒక టపా రాద్దామని నిదురలోకి జారుకుంటే, పిల్లి కలలో కొచ్చేసింది.

పెళ్లి కళ అన్నానా ? అప్పు తచ్చు.

పిల్లి కల (లోకి) వచ్చెసింది. అదీ విషయం.

పిల్లి ఈ వైపు నించి ఆ వైపు వెళితే శాస్త్రం చెబుతారు.

ఇలా పిల్లి కలలో వచ్చిన ఏమి అగును ? జీడిపప్పు ఉప్మా తినే యోగం కలుగునా ?

(దీనికి సమాధానం చెప్పగలవారు నాకు తెలిసి ఒక్కరే ఒక్కరు ఉన్నారు, కాని వారు ఇలాంటి చచ్చు ప్రశ్నలకి ఆస్కారం ఇవ్వరు - కాబట్టి ఏమి చెయ్యలేం. )


జీడిపప్పు యోగం  అంటే జ్ఞాపకం వస్తోంది- నేను నవలలు గట్రా చదివే రోజులలో (అంటే నా చిన్నప్పుడన్నమాట)   ఝాన్సీ రాణీ గారో, కాకుంటే మరొకరో ఎవరో నాకు సరిగ్గ గుర్తు లేదు, వారి నవలల్లొ టిఫిను మాట వస్తే , ప్రతిసారీ జీడిపప్పు ఉప్మాయే టిఫిను అయ్యేది నవల మొత్తం మీద.

ఝాన్సీ అంటే  గుర్తుకొస్తోంది, హిందీ - నవలిక ఝాన్సీ కీ రాణీ లాంటి గొప్ప పుస్తకం వేరొకటి నేను  చదివింది లేదు.

హిందీ  అంటె గుర్తుకొచ్చేది దక్షిణ భారత హిందీ ప్రచార సభ.

మద్రాసు పట్టణం లో ఉండేది మేము చదివే రొజులలో. ఆ తరువాయి, జై ఆంధ్రా సమయం లో హైదరాబదు కి వచ్చిందనుకుంటాను. ఖచ్చితం గా తెలీదు. హైదరాబాదీలు చెప్పాలి.

జై అంధ్రా అంటే గుర్తుకొస్తొంది, జై ఆంధ్రా మూవ్మెంటు. (ఇప్పుడు తే నా లంగా  మూవ్మెంటు అంటున్నారు- ఇది విడదీత, అప్పటిది కలబోత అనుకుంటాను)

జై ఆంధ్రా అంటే, , మా వీధి బడి వద్ద పెట్టిన  వినాయక బొమ్మ జ్ఞాపకం వచ్చెస్తోందండోయ్. అప్పుడు వీధి బడి కాడి వినాయకుని బొమ్మ వద్ద కూర్చుని మేము 'ఉణ్ణావరిదం ' ఉన్నాము జై ఆంధ్రా మూవ్ మెంటు కోసం.

కడుపు మాడబెట్టటానికి అనగా ఉపవాస దీక్ష కు అరవం లో 'ఉణ్ణావరిదం' అన్న పేరు.

ఉపవాసం అంటే, అన్నా హజారే గారు యాద్గారోన్ మే ఆ రహెన్ హై !

యాద్గారే అంటే, చిన్నప్పటి మా పెళ్లి (జిలేబి వెడ్స్ జంబు నాధన్- అని పెద్ద అక్షరాలతో కలర్   చాక్ పీసు తో బ్లాకు బోర్డు మీద అప్పుడు రాసి పెట్టడం కూడా గుర్తుకొస్తోంది సుమా)  గుర్తుకోచ్చేస్తోంది. (మా కాలం నో నియాన్ దీపాల కాలం మరి )

అబ్బో, పెళ్లి అంటే మళ్ళీ జిలేబి కి పెళ్లి కల, పెళ్లి కళ రెండూ వచ్చేస్తూన్నాయి.

హమ్మయ్య, back to square one!

ఇంతకీ నెనక్కడున్నాను ?

అంతా జిలేబి మయం గా ఉందే ఇక్కడ ?


ఇదేమి విష్ణు మాయయో? కలయో నిజమో తెలియని అయోమయములో ?!


చీర్స్
జిలేబి.

Monday, November 14, 2011

పిల్లల్లారా పాపల్లారా టోయ్ టోయ్ టోయ్ టోయ్

పిల్లల్లారా పాపల్లారా టోయ్ టోయ్ టోయ్ టోయ్ భారత జాతి  పౌరుల్లారా టోయ్ టోయ్ టోయ్  టోయ్ - ఆ టోయ్ టోయ్ టోయ్ టోయ్ అన్నది మధ్యలో వచ్చే వయోలిన్ నాదం అనుకుంటాను.

నేడు పిల్లల పర్వ దినం. మా చాచా మావయ్య పుట్టిన దినం.

మా చిన్నప్పుడు బళ్ళో చాక్లెట్లు ఇచ్చే వాళ్ళు. ఇప్పుడూ ఇస్తున్నారనుకుంటాను.

ఒక వ్యక్తి - ఆతను ఒకప్పటి ప్రధాన మంత్రి అన్న మాటని పక్కన బెట్టి,  తన కాలం లో పిల్లల పట్ల చూపిన ప్రేమానురాగాలు , అతన్ని సర్వకాలాలకీ నేరూ మావయ్య ని చేసింది.

ఇప్పటి పిల్లలకి చదువు పరిధి ఎక్కువ. ఆయన సంతతి గురించి వారి రాజ్య భోజ్యం గురించి కొంచం ఎక్కువే తెలిసి ఉంటుందనుకుంటాను. కాబట్టి వారు నెహ్రూ మావయ్య ని ఎలా ఆదరిస్తారో  తెలియదు నాకైతే.  బ్లాగు రచయితలలో ఎవరైనా ఇప్పటి స్కూలు అధ్యాపయకులు తెలియజేయ వచ్చు ఈ విషయాన్ని.

ఆ మాట పక్కన బట్టి, ఒక మావయ్య గా, అవ్యాజ ప్రేమానురాగాల కి ఒక నిదర్సనం గా ప్రతి అబ్బోడికి, అమ్మాయికి మావయ్య ఉండటం పెద్ద విశేషమే.

భారత జాతి పౌరుల్లారా అన్నది అప్పటి పాత పాట. ఇప్పటి మన పిల్లలు ప్రపంచ పౌరులు. పెద్దయ్యాక , ఎవరెవరు ఏ ఏ దేశాల లో సెటిల్ అవుతారో మా ఏడు కొండల ఎంకన్న కే ఎరుక.

వారి జీవితం వసుధైక కుటుంబం . ఆ రాబోయే కాలపు ప్రపంచ పౌరులకు ఇవే పిల్లల పర్వ దినపు శుభాకాంక్షలు.

ప్రేమతో 'పంచు లచ్చి '

జిలేబి.
(ఒకప్పటి 'భావి భారత శాంతి పావురాలు !)

Sunday, November 13, 2011

బ్లాగులు వెర్సెస్ దురదగొంటాకు ఒక సమాలోచనా విశ్లేషణ

పాత సామెత ఉండనే ఉంది. ఆకు మీద ముల్లు పడ్డా, ముల్లు మీద ఆకు పడ్డా నష్టం మరి ఆకుకే అని.

ఆ తీరులో , మన బ్లాగులని, బ్లాగరులని గమనిస్తే, ఒక విషయం స్ప్రష్టం గా కానవస్తుంది.

పాపం ఈ అమాయక బ్లాగర్లు (ఈ జిలేబి తో చేర్చి) ఏదో అల్లా టప్పా గా అలా 'నేనెందుకు బ్లాగు మొదలెట్టాను , చదువరులారా నన్ను ఆశీర్వదించు డీ అని వినమ్ర ముగా  పలికి బ్లాగు మొదలెడుతారు.

ఇక అప్పట్నించీ వీరి కనా కష్టాలు మొదలు.

ఓ టపా రాసేక, అమ్మయ్య అని ఊపిరి పీల్చు కునే సమయలోపలె, టపా కి వెల్లువగా వచ్చి కామెంటుల తుంపరలు పడతాయి -  'మీకు బ్లాగ్ లోకమునకు ఇదే, మా సుస్వాగతం', మీరు ఆ డిపార్ట్మెంటు వారా, ఐతే మీరే మా మొదటి ఈ స్టైల్ బ్లాగరు, ఈ బ్లాగ్లోకం మీకు కొంగొత్త ఐడియా లు ఇవ్వు గాక లాంటి ఆశీర్వచనములు కోకొల్లలు గా వీరి కి వస్తుంది.

ఇక చూడండి మజా, - రాసే వాడికి చదువరి  లోకువ చందాన టప టపా తమ జ్ఞానం అంతా బ్లాగ్ రూపేణ బహిష్కారం అవుతుంది. _ ఈ వ్యాక్యం లో ఏదో తప్పుందే, ఏమిటి చెప్మా ?

ఇక అక్కడ్నించీ దురద గొంటాకు ఎఫ్ఫెక్టు మొదలు. మెల్లి గా కామెంటడం  మొదలెడతారు. తమకొచ్చిన కామేన్తులకి  నెనర్లు పలుకుతారు. వేరొకరి టపా కి జేజేలు పలుకుతారు.

ఇంకా కొంచం ముందుకెళ్ళి, అప్పుడప్పుడూ , ఎవరినైనా అలా మరీ తీవ్రం గా గోకేసారనుకొండీ, ఇక ఉన్నది తంటా,  కామెంటుల హోరాహోరి వరల్డ్ వార్ మొదలు.

ఇలా, పాపం అసంస్ప్రుస్య అయిన వాళ్ళు , బ్లాగటం అనే దురద గొంటాకు మీద పడి  ఆ పై, ఆ దురద గొంటాకు ఎఫ్ఫెక్టు కి బలి అయి పోతారు.

దీనికి పరాకాష్ట, వారే దురద గొంటాకు గా రూపాంతరం చెందడ మన్న మాట. !

ఇంతటి తో ఈ దురద గొంటాకు సమాలోచనా విశ్లేషణకి 'కామా పెట్టి, ఈ దురద ఎఫ్ఫెక్టు ఎంత మందికి ఉందొ వేచి చూస్తాను. -

దురదస్య దురదః ,
జిలేబి నామ్యా దురదగొంటాకు హ !

చీర్స్
జిలేబి.

Saturday, November 12, 2011

2011 సంవత్సరపు ప్రాంతంలో బ్లాగ్వ్యవసాయం చేసే వారి సామెతలు

బ్లాగ్ రాయటానికి కామెంటు కౌంట్లు పనికి రావు

'తిం కిన ' కొద్దీ టపా, మూడు కొద్దీ కామెంటు

బ్లాగు మీద రాతలు కూటి కైనా పనికి రాదు (ఇది జ్యోతక్క  గారికి వర్తించదు!)

అంతర్జాలం లో పొత్తు లాగ్ అవుట్ తో సరి

టపా కి సైజు , కామెంటు కి నిబద్దత ఉండవలె

రాసిన టపాలన్నీ హిట్లయితే , ఇక రాయడానికి ఏమీ ఉండదు

బ్లాగు కి టెంప్లేటు పుష్టి , టపా కి కంటెంటు పుష్టి

అరవ బ్లాగు లో తెలుగు కామెంటులు పండవు

బులుసు బ్లాగుకు నవ్వులు, భారారే బ్లాగు కి తెక్నీకులు

బ్లాగరు పేరు జిలేబి ఐతే టపా తియ్య నౌనా ?

అన్ని టపాలకి అమెరికా టైము

టపా రాయటానికి శుక్ర వారము, కామెం ట డానికి శనివారము

కామెంటినవాడికి నెనర్లే మిగులును

కామెంట్లతో నిండిన టపా కన్నుల పండువగా ఉండును

టపా లు లేని బ్లాగు, మూత బడ్డ సైటూ పనికి రాదు

కామెంటులు  ఇచ్చు కిక్కు, ఈనాడు తిరగేసి చదివినా రాదు

టపా కి మేటరు సిద్ధము చేసుకుని టపా రాయవలె

మేటరు లేని బ్లాగు,  కామెంటులు లేని టపా ఒక్కటే

టపా కి ఏడు లైన్లు, కామెం ట డానికి నాలుగు లైన్లు

గ్రిప్పు చెదరక టపా రాయ వలె

కంటెంటు ఉన్న టపాకి చదువరి ఎక్కువ

సమయము చూసి టపా పబ్లిషు చేయ్యవలె (దీపావళీయం  లాగా అన్నమాట )

అనానిమస్సు కామెంటు టపాకి చేటు , వివాదభరిత టపా దూషణల కి మూలం

000000000000000000000000000000000000000000

కొంత కాలం మునుపు రాసిన 'బ్లాగ్ వెతలు ' చదవ దలిస్తే ఇక్కడ 'క్లిక్కండి '

000000000000000000000000000000000000000000


చీర్స్ చెబితే జిలేబి
నెనర్లు చెబితే తెలుగు బ్లాగరు

చీర్స్
జిలేబి.

పీ ఎస్: ఈ టపా కి ప్రేరణ భారారే గారి టపా 1920 సంవత్సరపు ప్రాంతం లో వ్యవసాయం చేసే  వారి సామెతలు )

Thursday, November 10, 2011

ఆమె గురించి - నాలుగు ముక్కలు

ఆమె గురించి - నాలుగు ముక్కలు
 
ఎందుకు పుట్టిందో తనకే తెలియదు
 
తనని పెంచిన తల్లికి డస్ట్ బిన్ లో దొరికిందట తను
 
ఆ తల్లి హృదయం ఇచ్చి పెంచింది
 
వయసు వచ్చింది
 
సెలయేరు సముద్రాన్ని ఆశించింది
 
పక్షి ఎగిరి పోయింది కువ కువ లాడుతూ
 
తల్లి హృదయం కష్ట పడ్డది
 
ఒక నిట్టూర్పు , ఒక ఆశ్వాసం
 
గప్ చుప్
 
పైర గాలి ఎప్పుడు వస్తోందో మళ్ళీ ?
 
చీర్స్
జిలేబి.
 
 

Wednesday, November 9, 2011

కాలక్షేపం కి బటాణీలు - టైం పాస్ కి బాతాఖానీ - మా చిత్తూరు అవ్వ కథ

మా స్కూలు ముందు ఓ పెద్దమ్మ - అవ్వ బటాణీలు అమ్మేది. 

తన మనవలు పొలం పనుల్లో కెళ్ళాక  ఆవిడ మా వూరి దగ్గిరున్న గ్రామం నించి వచ్చి బటాణీలు అమ్ముకునేది. వరుమానం ఎంత వచ్చేదో నాకు సందేహమే. ఎందుకంటే ఆవిడ దగ్గిర ఒక చిన్న బుట్ట మాత్రమె ఉండేది. అంత చిన్న బుట్టలోని బటాణీలు ఎంత అమ్ముకుంటే పైసలు వస్తుంది అన్నది ఒక ప్రశ్నే.

అయినా తప్పనిసరిగా   వూళ్ళో వున్న మా బడి కాడికి వచ్చి కూర్చొనేది. మేము ఐదు పైసలకి కాకుంటే ఓ పది పైసలకి బటాణీలు అడిగే వాళ్ళం. అంతకు మించి మా దగ్గిర పైసలు ఎక్కడ ?

ఓపిగ్గా బటాణీలు ఓ చేతిన్నర కాగితం లో పొట్లం ( చక్కటి కోన్ ఆకారం లో ) కట్టి ఇచ్చేది. దాని తో బాటు ఒక బోసి నవ్వు కూడాను.  మా నవ్వూ ఆవిడకి (అప్పట్లో అంటే ఓ నాలుగో క్లాస్సో , ఐదో క్లాసో ఉండవచ్చు అనుకుంటాను ) బోసి నవ్వు లా అని పించేదేమో ? ఎందుకంటే మమ్మల్ని చూస్తె ఆవిడ నవ్వు ఇలా ఖాన్డ్లా నించి కొహిమ  దాక లాగదీసిన భారద్దేశం అయ్యేది.

కొసరు అడిగితె ఆవిడ చెయ్యి ధారాళం. చాల సార్లు అడగకనే కొసరు వేసేది. అడిగామంటే బోసి నవ్వు ఇంకా సాగలాగి అలా పాకిస్తానూ, ఇలా బంగ్లాదేషూ భారద్దేశం లో కలిసి పోయేది.

ఓ వేసవి సెలవుల తరువాత ఈ పెద్దమ్మ కనబడ కుండా పోయింది. మాకు బటాణీలు అమ్మే అవ్వ ఏమైందో తెలియకుండా పోయింది.

ఓ పది రోజుల తరువాత , మా హెడ్ మిస్ట్రేస్సు మమ్మల్ని స్కూలు గ్రౌండ్ లో హాజరు పరిచి "అమ్మలూ , మీరు బటాణీల  అవ్వ దగ్గిర దాచిన పైసలు , అవ్వ మీకందరికీ  పలకా బలపం కొనిబెట్టమని చెప్పి ఇచ్చిపంపించి తాను దేవుడి దగ్గిరకి వేల్లిపోయిన్దర్రా"  అని చెప్పి మౌనం గా ఉండి పోయింది.

ఆ తరువాయి మేమెప్పుడూ మా పెద్దవ్వ  అంత భారద్దేశం నవ్వు చూళ్ళేదు.  మీకెక్కడైనా ఆ బోసి నవ్వు అవ్వ కనిపించిందా ?

జిలేబి.

Tuesday, November 8, 2011

చేత వెన్న ముద్ద - మాలికా హార కూడలి పూదండ!

చేత బ్లాగు

పెట్టుకుని

ఎవడైనా

పత్రికల లో

ప్రచురణల కోసం

పుస్తక ప్రచురణ కోసం

దేవుర్లాడ తారా ?


మాలికా కూడలీ హారములు

చెంగల్వ పూదండ ఐ

ఉండ

వేరొక ప్రచురణ అవసరమా

చెప్పమ్మా బ్లాగిణీ ?

 చీర్స్
జిలేబి.

పీ.ఎస్: ఇది బులుసు గారి కి వర్తించదు.

Sunday, November 6, 2011

హారం లో నాకిష్టమైనది

హారం లో

నాకిష్టమైనవి

 వ్యాఖ్యలు


హా , అవి 

 నాకు రమ్మ్!

అసలు రాతలకన్న

ఈ కొసరు కామెంటులు

కొత్తావకాయ  లా  

నోరూరించే కారమ్ !

మరో పెగ్గుకి పిలుపులు !


రెండో పెగ్గుకి

చీర్స్ చెబుతూ

మీ
జిలేబి.

సందేహం ఏల జిలేబి - వాడు నీవాడే

సందేహం ఏల జిలేబి ?

'some' దేహం కొసం?

'sum' గా దేహాన్ని వదిలిపెట్టు


వాడు నీవాడే

కమల నయనుడు

కరుణార్ద్ర హృదయుడు

య ఏవం వేద !


చీర్స్
జిలేబి.

ఇది  దరి చేరిన పుష్పం కి సీక్వెల్

శ్రీ శర్మ గారి - కాలజ్ఞానం - 4- గురించి - నాకు తోచినది

ఆలోచనాతరంగాలు శ్రీ సత్యనరాయణ శర్మ గారి కాలజ్ఞానం నాలుగు వెలువడింది.

దీని గురించి నా వివరణ నాకు తోచినది -

వీరు ధర్మం నిద్ర లేస్తున్దంటారు. కాలజ్ఞానం నాలుగు లో.

కాలజ్ఞానం రెండు లో

విలాసపు మోజులో పడిన ధర్మం
కళ్ళు మూసుకుని ఊరుకుంటుంది
 
అంటారు.
 
ఒక దానికి ఒకటి contradictory గా ఉన్నట్టున్నాయి.
 
కాలజ్ఞానం నాలుగు లో నాకైతే ఎట్లాంటి ప్రత్యేకతలు కనిపించడం లేదు. ముప్పై సంవత్సరాలకొక సారి సామాన్యుడికి బలం వస్తుంది అంటారు . ఒక generation మారడానికి కాలపరిమితి ముప్పై సంవత్సారాలు అందాజగా.  అంతకు మించి ఎట్లాంటి విశేషం వారు సూచిస్తున్నారో తెలియదు.
 
చీర్స్
జిలేబి.

Saturday, November 5, 2011

దరి చేరిన పుష్పం


ప్రభూ


నమస్సులకీ


ప్రార్థనలకీ


నమాజులకీ

మౌన ధ్యానాలకీ


నీకూ నాకూ

మధ్య


వేరొక్కరు లేక
 
దరిచేరనీయి

 
నమస్సులతో
జిలేబి.

Friday, November 4, 2011

గోబీ మంచూరియన్ - అనబడు గ్లోబలైజేషన్

జర్మనీ వాడి వోక్స్ వాగను

జపాను సూషి

ఇటాలియన్ కట్లేరి

చైనా వాడి యూజ్ అండ్ త్రో ప్లేటు

ఇద్దరు ఇండియన్లు

గోబీ మంచూరియన్ సెర్వింగ్

వాచింగ్ కొరియన్ టీవీ

యూసింగ్ అమెరికన్ ఐఫోన్

స్థలం - యుంగ్  ఫ్రౌ కొండలు - స్విజేర్లాండ్

వెరసి

గ్లోబలైజేషన్

ఇవ్వాళ కాదేది కుదరక పోవటం

అయినా ఎందుకో జీవితం లో వెలితి అంటారు

నిజమా ? కలా ?

చీర్స్
జిలేబి.


Wednesday, November 2, 2011

సిద్ధార్థుని ఒంటరి పయనం


ఆకాశాన

ఒక నక్షత్రం నేల వైపుగా వచ్చింది.

ఓ శుభ నక్షత్రాన ఓ తల్లి ఓ బిడ్డని కన్నది.


ఒక నావ ఈవల తీరాన్ని విడిచింది.


నది వేగం జల వేగం కి ఎదురీతగా

పయనం సాగించడానికి ఆయత్తమైనది

సిద్ధార్థుని ఒంటరి  పయనం మొదలైంది.


చీర్స్
జిలేబి.

ఇది నది దాటిన నావ కి సీక్వెల్


Tuesday, November 1, 2011

నది దాటిన నావ

ఓ నది ఓ నావ ఓ మనిషి

మనిషి లంగరు తీసాడు

తెడ్డు వేసాడు
 
నావ  నదిని దాటింది.

నావ ని తిరిగి చూడకుండా

సిద్ధార్థుడు వెళ్లి పోయాడు


నావ నవ్వింది తీరం చేరబడి

 నది తన మానాన తాను సాగిపోయింది.



చీర్స్
జిలేబి

Monday, October 31, 2011

ఐ హేట్ జిలేబి

ఒక అవ్వ జిలేబీలు అమ్మేది


ఆ దరిదాపుల్లో ఎగిరే కాకి ఒకటి

అప్పుడప్పుడు జిలేబి వాసనల్ని పసిగట్టేది


కాకి కి అవ్వ వేడైన వడలు వేసిన కథలు తెలుసు  కానీ

జిలేబీలు చుట్టే అవ్వ దగ్గిర నించి జిలేబి లు ఎలా


లాగాలో తెలియలేదు.



అవ్వా అవ్వా, ఐ హేట్ జిలేబీలు అంది కాకి


పోనీలే అమ్మీ, జిలేబి లు వంటికి , పంటికి , కంటికి


మంచిది కాదులే అని ఓ మాంచి వేడైన జిలేబి ని


పక్కన పెట్టి నిద్ర పోయింది అవ్వ .


కాకి వేడైన జిలేబి ని ముక్కున కరుచు కొని పైకేగురుతూ


కావు కావు మన్నది.


ఇంకే ముంది జిలేబి జారి   పడ్డది.


నేనప్పుడే చెప్పాను గా జిలేబి పంటికి మంచిది కాదని అంది


అవ్వ  నిదుర మాని.


నిజం, ఐ హేట్ జిలేబి అంది  కాకి ,

నాట్ బికాస్ ఐ లవ్ వడ, బట్

కాలం మారినా  కథలు మార కూడదు, అందుకని.



కథ కంచికి , మనమింటికి.


చీర్స్
జిలేబి.

పీ ఎస్: ఇది ఫకీరు లడ్డు కి సీక్వెల్

Saturday, October 29, 2011

వరూధిని జిలేబి ఒక్కరేనా? - ఒక వివరణ

బ్లాగ్ భాన్దవులారా,

Disclaimer Statement

 

ఏదైనా అపోహలు ఉంటె వాటిని తొలగించడానికి ఈ టపా పునః  టపా కీ కరణం.  దయచేసి గమనించగలరు. 

ఈ బ్లాగుల్లో రాస్తున్న వరూధిని , జిలేబి ఒకరే వ్యక్తీనా లేక ఇద్దరనా అన్న సందేహం కొందరికి వస్తున్నది.

వరూధిని అన్న పేరుతొ నేను ఈ బ్లాగు మొదలెట్టాను. ఈ పేరెందుకు పెట్టానో నా మొదటి టపా లో తెలిపాను .

 ఆ పేరుతోనే మరి ఒక బ్లాగోదరి ఉన్నారని వారు కూడా ప్రముఖ బ్లాగు రైటర్ అని ఆ తరువాయి నాకు తెలిసింది.

కొంత మంది జిలేబి పేరు ఏమిటి ఈ విడకి ? - ఈ విడకి జిలేబి లంటే మరీ ఇష్టమా అని కూడా సందేహ పడి పోయారు

ఇందు మూలకం గా వచ్చిన సందేహాలకి సరి ఐన సమాధానం ఇవ్వ వలసిన భాద్యత నా దని భావించి  దీని మూలకం గా అందరికీ  తెలియ జేసు కోవటం ఏమనగా - బ్లాగ్ బాన్ధవులార- నా బ్లాగు పేరు మాత్రమె వరూధిని - నా పేరు జిలేబి. ఈ విషయాన్ని గ్రహించగలరు !

ఇట్లు
చీర్స్
చెప్పుకుంటూ
మీ వరూధిని, కాని జిలేబి.
మీ వరూధిని కాని జిలేబి.

పీ ఎస్: ఆ వరూధిని గారెవరో వారు కూడా నా లాగ ఒక Disclaimer ఇవ్వగలిగితే బెటరు !

Friday, October 28, 2011

ఫకీరు లడ్డు

ఫకీరు కి లడ్డు తినాలన్న

కోరిక కలిగింది

మనసు - ఆ హా

ఇంకా జిహ్వ చాపల్యం

వదల్లేదే అంది


బుద్ధి పొతే పోనీలే -

అంతా వాతాపి జీర్ణం

అని కానిన్చేయ్ అంది

ఫకీరు లడ్డు

లాగించి

బ్రేవ్ మన్నాడు

ప్రాణం గాలి లో కలిసి పోయింది



చీర్స్
జిలేబి

దీపావళీయం చదవదలచుకుంటే కింద లింకు నొక్కండి.

Thursday, October 27, 2011

గరమ్ నరం బేషరం !

పెళ్ళికి మునుపు
నేను షరం
తను గరమ్

పెళ్ళయ్యాక

నేను గరమ్
తను నరం

పరిష్వంగం లో ఇప్పుడు

ఇద్దరం మమేకం
గరమ్ నరం విడచి బేషరం !

చీర్స్
జిలేబి

దీపావళీయం చదవదలచుకుంటే కింద లింకు నొక్కండి.

ఓ "ఫన్ ఆర్ట్" విత్ జే కే - ముఖాముఖి విత్ బులుసు సుబ్రహ్మణ్యం !

Wednesday, October 26, 2011

దీపావళీయం - ఓ "ఫన్ ఆర్ట్" విత్ జే కే-బులుసు గారితో బ్లాగ్ముఖీ

బ్లాగ్ లోకానికి దీపావళి శుభాకాంక్షలతో - మీ జిలేబి సమర్పించు

ఓ "ఫన్ ఆర్ట్" విత్ జే కే

బ్లాగ్ముఖి

ముఖాముఖి విత్ బ్లాగర్ 'బులుసు సుబ్రహ్మణ్యం'
(నవ్వితే నవ్వండి - వారి బ్లాగ్)

 


స్నిప్పెట్స్ :


మీకు నచ్చిన వంటలు ?

ఆహా! ! ఏమి గుర్తు చేసారండి. వంకాయ పచ్చడి ఉప్పిడి పిండి, పెసరట్టు ఉప్మాకి అల్లం పచ్చడి OK కానీ పుల్ల మజ్జిగ కలిపిన కొబ్బరి పచ్చడి ఓహ్, మరీను !


మీ పెళ్లి కలలు  ?

ఎలా ఐనా నా పెళ్ళికి బంగారు రోలూ, బంగారపు కట్లేసిన పగడపురోకలితో పసుపు దంచాలని కలలు కనేవాణ్ణి...హిహిహి.

 
దీపావళీ శుభాకాంక్షలతో

చీర్స్
జిలేబి.